విశాఖ

జిల్లాలో 70 బుక్ డిపో కేంద్రాలు ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొయ్యూరు, ఫిబ్రవరి 15: జిల్లాలో గ్రంథాలయాలు లేని చోట్ల 70 బుక్ డిపో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఉదయ్‌కుమార్ తెలిపారు. గురువారం స్థానిక శాఖా గ్రంథాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేసారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాల్లో యువతకు అవసరమైన పోటీ పరీక్షల పుస్తకాలను అందుబాటులో ఉంచే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. కొయ్యూరు గ్రంథాలయ భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. ఇప్పటికి జిల్లాలో 70 బుక్ డిపో కేంద్రాలు ఏర్పాటు కాగా మరికొన్నింటిని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామన్నారు. జిల్లాలో 45 గ్రంథాలయ మాష్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. తాత్కాలికంగా పని చేసే మాస్టర్ల వేతనం పెంపునకై ప్రతిపాదించడం జరిగిందన్నారు. గ్రంథాలయాల్లో పాఠకుల అభిరుచి మేర పుస్తకాలను సమకూర్చి అందుబాటులో ఉంచే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.