Others

బడిపంతులు (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్ తాతగా, అంజలీదేవి నానమ్మగా, శ్రీదేవి మనవరాలిగానటించిన చిత్రం ‘బడిపంతులు’. ఆనాడు బడిపంతులకు చాలా గౌరవం ఉండేది. విద్యార్థులు కూడా వారి పట్ల భయభక్తులతో ఉండేవారు. ఇలాంటి విలువలను, మానవతను, కుటుంబ ప్రేమానుబంధాలను, వృద్ధ తల్లిదండ్రులపై పిల్లలు చూపే నిర్లక్ష్య ధోరణిని కళ్లకు కట్టినట్లు ఈ చిత్రంలో చూపారు. అంతేకాకుండా ఆణిముత్యాల్లాంటి పాటలు నేటికీ వింటుంటే వీనుల విందుగా ఉంటాయి. ‘బూచాడమ్మా బూచాడు.. బుల్లిపెట్టెలో ఉన్నాడు’ అనే పాట, ‘్భరత మాతకు జేజేలు.. బంగరు భూమికి జేజేలు’ పాట ప్రతి స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ డే రోజున నేటికీ తప్పనిసరిగా వినిపిస్తుంది. ‘నీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు’ పాటను అంజలీదేవి, ఎన్‌టిఆర్ కళ్ళలోకి చూస్తూ పాడుతుంటే ఎంతో అనుభూతి కలుగుతుంది. ఈ పాటలో ఒక చోట రెక్కలు వచ్చి పిల్లలు వెళ్ళారు, రెక్కలు దిగి మనమున్నాము, పండుటాకులమై మిగిలితిమి.. ఇంకెన్ని పున్నమలు చూడనుంటివి’ అంటూ భర్త పాదాలమీద వాలి పడే సన్నివేశం ఎప్పటికీ మరచిపలేము. ఈ పాట చాలా అర్థవంతంగా, సన్నివేశానికి తగినట్టుగా ఉంది. ఎన్టీఆర్ తాతగా కర్ర పట్టుకుని నటించిన తీరు చాలా బాగుంది.

-కాయల నాగేంద్ర, హైదరాబాద్