డైలీ సీరియల్

వ్యూహం - 64

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డాక్టర్ వౌర్య, డాక్టర్ ఫణిని ఎలా అంతమొందించాలన్న ప్లాన్ తన ఛాంబర్‌లోనే వేశాడు. ఆ వివరాలు అతను తనకు చెబుతున్నప్పుడు గోడలో సీక్రెట్‌గా అమర్చిన సిసిటివి కెమెరాల్లో నిక్షిప్తం అయ్యాయి. ఆ సిడీలు తీసి కవర్‌లో వుంచాడు.
అవన్నీ భద్రంగా వో బ్రీఫ్ కేసులో వుంచాడు.
డ్రైవర్ నాగరాజును పిలిచాడు.
‘‘ఈ బ్రీఫ్ కేసులో ముఖ్యమైన రికార్డులు వున్నాయి.. వీటిని నువ్వు హైద్రాబాద్ తీసుకెళ్లి స్కందగారికి ఇవ్వాలి! ఎటువంటి పరిస్థితుల్లోను ఈ బ్రీఫ్‌కేస్ మరొకరి చేతిలో పడకూడదు.. మనకార్లో వెళ్లి జాగ్రత్తగా స్కందగారికి అప్పగించు!’’ అనేసి బ్రీఫ్ కేసు నాగరాజుకు ఇచ్చేడు.
నాగరాజు ఎంతో నమ్మకస్తుడు. పాట్నాలో డాక్టర్ అరవింద పనిచేస్తున్నటి నుంచి అతనికి డ్రైవర్‌గా వున్నాడు. అరవింద్ చెప్పింది చేసుకుపోవడమే అతనికి తెలిసినది. అరవింద్ ఆర్థిక సహకారంతో ఖమ్మంలో ఇల్లు కట్టుకున్నాడు, ముగ్గురి ఆడపిల్లల పెళ్లిళ్లు చేయగలిగాడు.
డ్రైవర్ తన ఛాంబర్‌లో వున్నప్పుడే స్కందకు ఫోన్ చేశాడు.
‘‘మీ డిజిపి ఆఫీసుకు మా డ్రైవర్ నాగరాజు వొస్తున్నాడు. ఓ బ్రీఫ్ కేస్ మీకు అందజేస్తాడు.. ముఖ్యమైన సమాచారం వుంది.. ఈ హాస్పిటల్‌కు సంబంధించి నాకు తెలిసిన వివరాలన్నీ వో స్టేట్‌మెంట్‌లో రికార్డు చేసి సంతకం పెట్టాను.. అది నా ఎఫిడవిట్‌గా ఉపయోగించుకో! కొన్ని సీక్రెట్ ఆపరేషన్స్‌కు సంబంధించిన వివరాలు ముఖ్యమైన సీడీలు నీకు పంపుతున్నాను. వాటిని ఉపయోగించుకుని నువ్వు అనుకున్నది సాధించు! నీకు విజయం తప్పకుండా కలుగుతుంది.. నీకు నా బ్లెస్సింగ్స్!’’ అనేసి ఫోన్ పెట్టేశాడు అరవింద్.
నాగరాజు వైపు తిరిగాడు.
‘‘నువ్వు వెంటనే హైదాబాద్ వెళ్లి సాయంత్రం లోపు ఈ బ్రీఫ్‌కేసు స్కందగారికి అందించు! డిజిపి గారి ఆఫీసు అడ్రెస్ నీకు తెలుసు కదా! వెంటనే బయల్దేరు!’’ అన్నాడు అరవింద్.
నాగరాజు బ్రీఫ్‌కేసు తీసుకుని ఎవరితోనూ తను ఎక్కడికి వెళ్తుంది చెప్పకుండా కార్లో హైదరాబాద్ బయల్దేరాడు.
***
డోర్ తెరచుకుని లోపలికి వచ్చిన అరిఫ్‌ను చూసి ఆశ్చర్యపోయాడు డాక్టర్ అరవింద్.
ఎప్పుడు వచ్చినా రెండ్రోజుల ముందే చెబుతాడు అరిఫ్. చెప్పా పెట్టకుండా రావడం ఏమిటి?
అరిఫ్ కళ్ళు జ్యోతుల్లా మండిపోతున్నాయి. వారం రోజులనుంచి నిద్రలేని వాడిలా వున్నాడు.
‘‘మనం హాస్పిటల్ కోసం ఇక్కడ పదెకరాల స్థలం కొని, భవనాలు కట్టించాం కదా! ఆ డాక్యుమెంట్స్, సేల్‌డీడ్స్ ఎక్కడ ఉన్నాయి!’’ వచ్చి రావడంతోనే అడిగాడు అరిఫ్.
‘‘ముఖ్యమైన డాక్యుమెంట్స్ బ్రీఫ్ కేసులో పెట్టుకుని మీ దగ్గరకు వస్తుంటే ఆ బ్రీఫ్‌కేసు పోయింది. ఆ విషయంమీకు చెప్పాను గదా!’’ అన్నాడు అరవింద్.
‘‘ఆ బ్రీఫ్‌కేసు దొరకలేదా?’’
‘‘లేదు’’
‘ఎవరి పేరుమీద స్థలం, ఆసుపత్రి భవనాలు వున్నాయి?’’
‘‘అన్నీ బినామీ పేరుమీద నడపమని చెప్పారు గదా! హాస్పిటల్లో ఏదన్నా ఘోరం జరిగి బయటపడి పోలీసులు మనల్ని అరెస్టు చేయకుండా వుండటానికి మరొకరి పేరుమీద రిజిస్టర్ చేయించాను’’.
‘‘ఎవరి పేరుమీద?’’ విసుగ్గా అడిగాడు అరిఫ్.
‘‘అన్నీ కాశి పేరు మీద వున్నాయి’’.
వొళ్ళు మండిపోయింది అరిఫ్‌కు.
‘‘అరవింద్, కాశిగాడు చేతులు కలిపి తనను మోసం చేస్తున్నారా? కాశీ ఎక్కడ ఉన్నాడో అరవింద్‌కు తెలియకుండా వుండదు!’’ అనుకున్నాడు అరిఫ్
‘‘కాశి పేరు మీదా! ఆ వెధవ ఇప్పుడు ఎక్కడ వున్నాడో? వాడు, నువ్వు కలిసి నాటకాలు ఆడుతున్నారేమోనని నాకు అనుమానం వస్తున్నది. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వాడికి ఇచ్చేసి దూరంగా పంపించావు. నీ బ్యాంకు ఎకౌంట్‌లోని డబ్బు వాడు ఎలా డ్రా చేసుకుని వాడి ఎకౌంట్‌లో వేసుకుంటాడు.. వాడికి పిన్‌నెంబర్లు నువ్వే చెప్పి ఎలా డ్రా చెయ్యాలో వివరించి చెప్పివుంటావ్.. మీరు ఇద్దరూ తోడుదొంగలు’’ అన్నాడు అరిఫ్ కోపంగా అరుస్తూ.
‘‘మీరు పొరబడ్డారు... వాడు ఎంతో నమ్మకంగా ఉన్నట్లు నటించి నాకే ఎసరుపెట్టాడు’’.
‘‘నీ మాటలు, వాడిమాటలు నమ్మకూడదు... ఇద్దరూ బేవకూప్‌గాళ్ళు! నిన్ను నమ్మి నా వ్యాపారంలో నీకు వాటా ఇవ్వడం నాది బుద్ధి తక్కువ!’’
అరిఫ్ రెచ్చిపోయి మాట్లాడుతూ వున్నాడు.
‘‘రెండ్రోజుల క్రితం హైదరాబాద్ ఎందుకు వెళ్ళావ్?’’ అడిగాడు అరిఫ్.
‘‘నెలకు ఒకటి, రెండుసార్లు వెళ్తూనే వుంటాను.. హాస్పిటల్‌కు కావాల్సినవి కొన్నాను.. నా పర్సనల్ పర్చేజెస్ పూర్తిచేసుకుని తిరిగి వచ్చాను’’.
‘‘అక్కడ నీ బంధువుల్ని కలిశావా?’’
‘‘నాకు బంధువులు ఎవరున్నారు.. ఎన్నో సంవత్సరాలనుంచి ఒంటరిగానే వుంటున్న సంగతి మీకు తెలుసు గదా!’’
‘‘హోటల్లో ఐపిఎస్ ఆఫీసర్ని, నీ భార్యను కలవడం నాకు తెలియదనుకున్నావా? స్కంద నీకు ఏమవుతాడు? నీ కొడుకా? ఇన్నాళ్లు నాకు ఆ విషయం చెప్పలేదే? ముంబాయిలో నా బిల్డింగ్ దగ్గరకు పోలీసులు వచ్చినపుడే నీమీద అనుమానం వచ్చింది. నేను సిటీ పోలీసు కమిషనర్‌తో మాట్లాడుతుంటే నువ్వు స్కందతో మాట్లాడుతున్నావ్.. నువ్వు, కాశి, స్కంద ఏకమై నా బిజినెస్, రెప్యుటేషన్ అంతా చెడగొట్టారు.. పోలీసు ఆఫీసర్‌తో లాలూచీపడతావా? స్కందగాడు ఓ రాస్కెల్... చాపకింద నీరులా నా వ్యాపార సామ్రాజ్యంలోకి దూరిపోయాడు... స్కౌండ్రల్!
స్కందను అరిఫ్ తిట్టడం తట్టుకోలేకపోయాడు.
‘‘మనకేం రెప్యుటేషన్ వుంది.. హాస్పిటల్లో అన్నీ స్కాండల్స్ చోటుచేసుకుంటున్నాయి.. మీరు చేసే డ్రగ్స్ బిజినెస్ కూడా పోలీసుల దృష్టిలోకివచ్చింది.. స్కందను తిట్టుకోవడం అనవసరం!’’ అన్నాడు అరవింద్.
అరిఫ్‌కు పట్టరానంత ఆగ్రహం వచ్చింది.

ఇంకాఉంది

అలపర్తి రామకృష్ణ