వినదగు!

‘మృత్యువు’ ‘ఆది’ అరూపాలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వృత్యువు విరాట్ తత్వాన్ని వొడిసి పట్టుకోవటం అంటున్నారు కదా! నిజం చెప్పాలంటే ఈ మృత్యు తాత్విక దర్శనం కాస్త తికమకగా ఉంది. ‘ఆత్మ’ విశ్వరూప దర్శనం కళ్ల ముందుకు వస్తోంది.. ‘ఆది’ విరాట్ తత్వం దర్శనీయమవుతోంది.. ‘మృత్యువు’ విరాట్ తత్వాన్ని చిత్రించుకోవాలంటే ఏ మాత్రం పాలుపోవటం లేదు’ బ్రహ్మయ్య గొణుగుడు కార్యక్రమంలో పడ్డాడు.
‘మృత్యువును దర్శించటం, మృత్యు స్పర్శను అనుభూతించటం పెద్ద కష్టమా బ్రహ్మయ్యగారూ?’ నా కొంటె ప్రశ్న.
‘మీకు అందుతుందేమో కానీ మాకు అందటం లేదు మాస్టారూ!’ అదీ బ్రహ్మయ్య విషాద వదనం.
‘రూపం కరగాల్సిందే కదా?’ నా ప్రశ్న.
‘అవును.. కరిగి తీరవలసిందే’ బ్రహ్మయ్య వివేకం.
‘కరిగేది చిన్నదా? పెద్దదా?’
‘చిన్నదే’
‘మరి కరగని తత్వం?’
‘పెద్దది’
‘పెద్దది అంటే విస్తృతమైంది అనేగా! సో, కరగని తత్వం గురించి ప్రాకులాడుతూ కరుగుతుండటం వాంఛనీయమా?’
‘కాదుకాక కాదు’
‘అయినప్పుడు శాశ్వతత్వం కోసం పరితపిస్తూ జీవితాన్ని కరిగించుకోవటం జీవిస్తూ మృత్యువు ఒడిలోకి చేరుతుండటమే కదా’
‘అవును’
‘అయినప్పుడు విరాట్ తత్వం మృత్యువుదా? జీవితానిదా?’
బ్రహ్మయ్యది వౌనం.
‘మృత్యువు పరిధి ఎక్కువ. జీవితానికి పరిధి తక్కువ. తక్కువ పరిధిగల జీవితం వందేళ్లదిలా అనిపిస్తుంది. వందేళ్లూ కనపడకుండా జీవితం వెంటపడే మృత్యువుది క్షణమే అనిపిస్తుంది. అది క్షణంలా కనిపించినా ఇటు ఇహాన్ని, అటు పరాన్ని ఆక్రమించిన ప్రతిభాశీలి.. ప్రభావశీలి.
నిజానికి, జననం కొంతవరకే పరచుకుంటుంది. మృత్యువు మాత్రం ఎంతవరకైనా పరచుకుంటూ పోతుంటుంది. ఇహంలోను, పరంలోను అస్తిత్వం గలది మృత్యువు. మృత్యువుతోపాటు ‘ఆది’కి అంతటి అస్తిత్వం ఉంది. అందుకే నా దర్శనంలో మృత్యువుది తొలి అధ్యాయం.. విషాదాంశకు తొలి చిరునామా. తుది అధ్యాయం అనిపించే తొలి అధ్యాయమే మృత్యువు. ఈ మృత్యుచ్ఛాయలోనే జీవితం అడుగులేస్తుంటుంది అని చెప్పక చెప్పిన ప్రబంధం భగవద్గీత’
-పుటలలో పరివ్యాప్తవౌతున్న నా గిక గీత.
* * *
చివరి వజిలీలో మృత్యువు వాకిట రెండు మార్గాలు కనిపిస్తుంటాయి. ఒక మార్గం మరుజన్మలేని తీరాన్ని చూపిస్తుంటే, ఇంకొక మార్గం మరోజన్మ సంప్రాప్తమయ్యే బాటని చూపిస్తుంటుంది. ఇక్కడ మరుజన్మ లేని మార్గాన ఆత్మ పయనం కావటం అంటే హిరణ్య గర్భాన్ని చేరటం.. మరో జన్మ సంప్రాప్తమయ్యే మార్గాన ఆత్మ ప్రయాణం అంటే మరోమారు మాతృగర్భాన్ని చేరటం.
పాంచ భౌతిక దేహం మరణంతో పార్థివ దేహమే అవుతుంది.. అయితే కొన్ని పార్థివ దేహాలు జీవాన్ని కోల్పోనట్లు కాంతిమంతంగా ఉంటాయి.. ఇంకొన్ని పార్థివ దేహాలు జీవాన్ని కోల్పోయి కాంతి విహీనంగా తయారవుతాయి. ఇక్కడ గిక ప్రజ్ఞా ఫలితవే కాంతిమంత దేహం.. ఆ పూర్ణ ప్రజ్ఞ వల్లనే మరో జన్మ లేకపోవటం.
గిక ప్రజ్ఞ లేని దేహాల మృత్యువు ఆసన్నమైన కొన్ని గంటలలోనే కళాహీనంగా మారిపోతాయి.. ఆ దేహాల నుండి నిష్క్రమించిన ఆత్మలు మరోమారు పునర్జన్మకు రాక తప్పదు. మరుజన్మ లేకపోవటం, మరోజన్మ సంప్రాప్తం కావటం అనే ఊగిసలాట లేనివారే పరిపూర్ణ యోగ ప్రజ్ఞామూర్తులు. ఈ ఆత్మలు ఆది స్థితి అంశలుగా శాశ్వతత్వాన్ని పొందుతాయే తప్ప మరో మారు ఏ భువి గర్భాన్ని ఆశ్రయించటం జరగదు.
* * *
‘ఆది’ స్థితిని భగవద్గీత -
‘బీజం మాం సర్వభూతానాం విద్ధి సనాతనమ్’ అని సప్తమాధ్యాయంలో కృష్ణుని ద్వారా పరికిస్తుంది. సకల ప్రాణుల సనాతన బీజం అని దీని అర్థం. అంటే అనాదికాల ప్రవృత్త ఆదిస్థితే మనం చెప్పుకునే ‘ఆరిజిన్’. అంటే మన మానవావతరణ అంకురార్పణ జరిగేది ‘మూల’మైన ఈ ‘ఆది’ నుండే. ఈ మూలమే మన మానవ జన్మకు మూల కారణం.
ఈ ‘ఆరిజిన్’ ఎటువంటిదంటే-
‘పుణ్యోగంధః పృథివ్యాం’ - పంచ భూతాత్మక పృథ్విలోని పవిత్ర గంధం
‘తేజశ్చాస్మి విభావసౌ’ - పవిత్రాగ్నిలోని తేజస్సు
‘జీవనం సర్వభూతేషు’ - సర్వప్రాణుల జీవ ప్రాణం
‘తపశ్చాస్మి తపస్విషు’ - తపస్వులలోని తపస్సంపన్నత
‘ప్రభాస్మి శవిసూర్యయోః’ - సూర్యచంద్రులలోని కాంతి
‘రసోహ మప్సు’ - జలరాశి సారమైన రసం
‘శబ్దః ఖే’ - ఆకాశ తత్వంలోని శబ్దం
‘పౌరుషం నృషు’- మానవ జన్మలోని పురుషకారం.
మానవ అవతారంలోని పౌరుషం, అనంత శూన్యంలోని శబ్ద సౌందర్యం, అపార జలసార రసం, చీకటి వెలుగుల కాంతి, పంచభూత మూలగంధం, అగ్ని తేజస్సు, ప్రాణులలోని జీవం, తపస్వుల గికత - ఈ ఆరిజిన్.
ఈ ఆది స్థితిఉత్కృష్ట తత్వం ఎలాంటిదంటే ‘్ధర్మా విరద్ధో భూతేషు కామోస్మి’ - ప్రాణుల ధర్మ విరుద్ధం కాని ఇచ్ఛ ఈ ఆరిజిన్. ఇంత వివరించిన తర్వాత కూడా ఇంకా సులభతరం చేస్తూ తొమ్మిదవ అధ్యాయంలో చాలా సింపుల్‌గా ‘బీజ మ వ్యయమ్’ అంటూ ఆరిజిన్ విరాడ్రూప విస్తృతిని సంక్షిప్తీకరిస్తాడు గీతాచార్యుడు. అవ్యయమైన బీజం అని, వినాశం లేని మూలం అనీ ఆది స్థితిని సూక్ష్మంగా నిర్వచిస్తాడు. ఇంతకీ ఈ గీతాచార్యుడు పురుషోత్తముడైన యోగిపుంగవుడే.. కాబట్టి పరిపూర్ణ యోగ జీవనులకి ఇవన్నీ ‘మూల’ సంపదలే! ‘ఆది’ ఆవిష్కరణలే!
అమృతం - మృతం, అసత్ - సత్‌లు కూడా ఆది స్థితిలోని అంతరంశలే.
‘అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమ్’ - దివ్య స్థితికి ఆలంబనమైన అమృతం, మానవ స్థితిని అపహరించే మృత్యువు, దృశ్యమాన సత్, అదృశ్య అసత్‌లు సైతం ఆది స్థితి అంతర్లయలే!
* * *
మృత్యు శయ్య నుండి ప్రతి ఒక్కరూ అటు స్వర్గాన్ని కానీ, ఇటు నరకాన్ని కానీ చేరుకోవలసిందే అని అంటుండటం మనం వింటుంటాం.. అంటే స్వర్గప్రాప్తి కానీ, నరక ప్రాప్తి కానీ మానవ జన్మ పరిసమాప్తి ఫలితమే!?
మనం ఎంతలా పుణ్యాన్ని మూటగట్టుకుంటే అంతలా స్వర్లోకమైన దేవలోకాన్ని చేరి అక్కడి భోగ సంపన్నతతో తలమున్కలవుతూ, పుణ్యాన్ని కరిగించుకుంటూ మళ్లీ మానవ లోకాన్ని చేరక తప్పదంటుంది మన గీత. ఇదే పునరపి జననం పునరపి మరణం సిద్ధాంతం. అయితే ఈ స్వర్గ - నరకాల ప్రస్తావన లేకుండా, పర స్థితికి సంబంధించి ఎటువంటి నిర్థారణకు రాకుండా, సాధనా మగ్నమైన వారే అసలైన యోగులు. స్వర్గ నరకాల పరంగాను వారి నిర్వికారతే, నిర్లిప్తతే వారి యోగక్షేమం అవుతుంది.
యోగులది జ్ఞాన పూర్వక సాధన అవుతుంటే భక్తులది అజ్ఞానపూర్వక శ్రధ్ధ అవుతోందంటాడు గీతాచార్యుడు. ‘యజంత్య విధి పూర్వకమ్’ - భక్తుల పూజాదికాలు అజ్ఞానపూర్వక విధి విధానాలు అవుతున్నాయనీ, ‘మామభిజానంతి’ - సకల చరాచర సృష్టికి మూలమైన ఆది స్థితిని ‘యధార్థం’గా తెలుసుకోలేక పోతున్నామనీ, అందువల్లనే మానవ సంతతి జనన మరణ భ్రమణం నుండి తొలగలేకపోతున్నదనీ అంటాడు. అంటే భక్తులు శ్రద్ధాళువులు అయినప్పటికీ యదార్థాన్ని తెలుసుకోలేక పోతున్నారనీ, యోగులు నిత్య సాధనా మార్గావలంబకులయి యదార్థాన్ని దర్శించ గలుగుతున్నారనీ అర్థం.
అసలు, ‘శుభాశుభఫలై రేవం మోక్ష్యసే కర్మబంధనైః’ - కర్మ ఫలాలను శుభాలనీ, అశుభాలనీ విభిన్నంగా చూడకుండా అభిన్నంగా కర్మలు చేసుకుంటూ పోవటమే యోగ సాధకుల జీవన మార్గం. ఇటువంటి యోగ సాధకులే ‘సన్న్యాసయోగ యుక్తాత్మా విముక్తో’ - అంటే, విముక్త యుక్తాత్మలు.
ఈ సాధికార జీవనం సంసార జీవనమే అయినప్పటికీ ఇటువంటి యోగ సాధకుల జీవనం సన్యాస జీవనం క్రిందే లెక్క. కారణం వీరిది ‘సమోహం సర్వభూతేషు’ అంటే సకల ప్రాణికోటిని సమంగా చూడగలగటం వీరి సమదర్శనం. ‘నమో ద్వేష్యోస్తి న ప్రియః’ - వీరు ద్వేష తత్వానికి, ప్రేమ తత్వానికి అతీతులు. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే - యోగి అందరివాడు, అందనివాడు, వినాశనం లేనివాడు, శాశ్వతుడు, అమృతుడు.

- డా. వాసిలి వసంతకుమార్ 9393933946