విలన్ పాత్రలో శివాజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శే్వతామీనన్, మహత్ రాఘవేంద్ర, చైతన్య ఉత్తేజ్, సోనియా అగర్వాల్ ప్రధాన తారాగణంగా పర్సా రమేష్ మహేంద్ర దర్శకత్వంలో కల్వకుంట్ల తేజేశ్వరరావు రూపొందిస్తున్న చిత్రం ‘షీ’ (ఈజ్ వెయిటింగ్). మహేశ్వర ఆర్ట్స్ పతాకంపై రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ దగ్గరలోని మొయినాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర నిర్మాత తేజేశ్వరరావు మాట్లాడుతూ, ప్రస్తుతం మూడో షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోందని అన్నారు. ఈ షెడ్యూల్‌ను ఫిబ్రవరి 15నాటికి పూర్తిచేస్తామని, మిగిలిన పాటలు బెల్జియంలో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఐటెం పాటకోసం ఓ సెట్‌ను నిర్మిస్తున్నామని, శివాజి ఓ నెగెటివ్ పాత్రలో నటిస్తున్నారని తెలిపారు. దీక్షాపంత్, రవిప్రకాష్ లాంటి నటులు ఈ సినిమాలో నటిస్తున్నారని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సినిమాను వేసవి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. 50 సినిమాలలో హీరోగా నటించిన తాను వైవిధ్యమైన పాత్రలు చేస్తున్నానని, కామెడీ కూడా జోడించి విలనిజం వున్న పాత్రలోనూ నటిస్తున్నానని నటుడు శివాజీ తెలిపారు. కార్యక్రమంలో శే్వతామీనన్, కవిత, దీక్షాపంత్, రవిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
దర్శకుడు పర్సా రమేష్ మహేంద్ర మాట్లాడుతూ, మన సంస్కృతి సంప్రదాయాలకు భయాన్ని జోడించి తెరకెక్కిస్తున్న స్వచ్ఛమైన ప్రేమ కథగా షీ వుంటుందని, మహత్ రాఘవేంద్ర నటన హైలెట్‌గా సాగుతుందని, పంచభూతాలపై పాట చిత్రీకరణ అందరికీ నచ్చుతుందని తెలిపారు. కవిత, రమాప్రభ, పోసాని, సూర్య, ధన్‌రాజ్, చిత్రం శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు:కాసర్ల శ్యామ్, రామ్ పైడిశెట్టి, సాయి సిరి, సంగీతం: భోలె, కెమెరా: అనిత్, నిర్మాత: కల్వకుంట్ల తేజేశ్వరరావు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పర్సా రమేష్ మహేంద్ర.