మహబూబ్‌నగర్

విద్యారంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యారంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం
* ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాదించాలి
* జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, జనవరి 23: విద్యారంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి వెల్లడించారు. శనివారం జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని మహబూబ్‌నగర్‌లోని ఎంవి ఎస్ జూనియర్ కళాశాలలో లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ టికె శ్రీదేవి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ రాధ ఆమర్, జేసి రాంకిషన్‌లతో పాటు పలువురు అధికారులు విద్యార్థులతో సహపంక్తి భోజనం చేశారు. కలెక్టర్ కొందరు విద్యార్థులకు భోజనాన్ని తినిపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ టికె శ్రీదేవి మాట్లాడుతూ జిల్లాలో విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో నాణ్యమైన విద్యాను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ఏడాది ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో వందశాతం ఉతీర్ణత సాధించాలని సూచించారు. అధ్యాపకులు మంచి విద్యను అందించాలని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం డి6గీ విద్యార్థులకు వరం లాంటిదని విద్యార్థుల హక్కులను ఎల్లవేళల పరిరక్షిస్తామన్నారు. జిల్లాలో డిగ్రీ విద్యార్థులకు సరైన భోజన వసతి లేక విద్యార్థులు కళాశాల మధ్యలోనే మానివేయడం అత్యంత బాధకరమని దినిని అదిగమించడానికి మధ్యాహ్న భోజన పథకాన్ని పరీక్షల సమయాన్ని దృష్టిలో పెట్టుకుని 40 రోజుల పాటు డిగ్రీ విద్యార్థులకు భోజనం పెట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో 21 డిగ్రీ కళాశాలల్లో 10075 మందికి భోజనం అందిస్తామని రాష్ట్రంలో మహబూబ్‌నగర్ జిల్లాలోనే ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. కలెక్టర్ ప్రత్యేక నిధుల నుండి రూ.70 లక్షల రుపాయలు కేటాయించామని మిగితా ఖర్చు అక్షయ ఫౌండేషన్ బరిస్తుందని వెళ్లడించారు. ఈ సమావేశంలో డి ఆర్ ఓ భాస్కర్, ప్రిన్సిపల్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

రైతులకు ఉద్యానవన శాఖ బాసటగా నిలవాలి
* కలెక్టర్ శ్రీదేవి
ఆంద్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, జనవరి 23: రైతులకు ఉద్యానవన శాఖ అధికారులు బాసటగా నిలవాలని జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి ఆదేశించారు. శనివారం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో ఉద్యానవన, పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ టికె శ్రీదేవి మాట్లాడుతూ ఉద్యానవన శాఖ ప్రధానంగా కూరగాయలు, పాలి హౌస్‌లు, ఫాపాండ్స్, తోటల సాగుతో పాటు వివిధ రకాల విత్తనాలకు, పందిరి కూరగాయాలకు రాయితీలు కల్పిస్తున్నందున అధికారులు ప్రత్యేక దృష్టి సారించి రైతులు సద్వినియోగపర్చుకునే విధంగా చర్యలు తీసుకొవాలని తెలిపారు. ఉద్యానశాఖ పథకాలను యుద్దప్రతిపాదికన గ్రౌండింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రౌండింగ్ అయిన పథకాలను సత్వరమే ఆన్‌లైన్‌లో ఆప్‌లోడ్ చేయాలని అవసరమైన అనుమతులు పొందాలని తెలిపారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ రైతులు అధికంగా ఉన్నారని ఉద్యానవన పథకాలను వారికి చేర్చాల్సిన భాద్యత అధికారులదేనని స్పష్టం చేశారు. దళిత పారిశ్రామికవేత్తలను ప్రొత్సహించడానికి ప్రభుత్వం టి-ప్రైడ్ సబ్సిడిలు అనేక ప్రొత్సాహలు కల్పిస్తుందన్నారు. ఉద్యానవన, పరిశ్రమల శాఖ అధికారులు సమన్వయంతో పని చేసి టి-ప్రైడ్‌ను వినియోగించుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. పరిశ్రమలను పెట్టుకునేందుకు ముందుకు వచ్చే వారి కోసం ఈ పథకాన్ని వర్తింప జేయాలని సూచించారు. ఉద్యానవన శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కింది స్థాయి సిబ్బందితో నిరంతరం సమీక్ష సమావేశాలు నిర్వహించి పథకాలను వేగవంతం చేయాలని పథకాలలో లభ్దిదారుల ఎంపికలో పారదర్శకతను వందశాతం పాటించాలన్నారు. క్షేత్రస్థాయిలో జరిగిన అభివృద్ధిపై ఫోటోలతో కూడిన నివేదికను అందించాలని ఆదేశించారు. 20.20.3 మీటర్ల ప్రమాణాలతో నిర్మించే ఫాంపాండ్స్‌ను ప్రొత్సహించాలని తెలిపారు. గ్రీన్ హౌజ్‌ల కోసం దరఖాస్తులు చేసుకున్న రైతులకు బ్యాంకు అధికారులతో మాట్లాడి సత్వరమే రుణాలు మంజూరు అయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లకు అవసరమైన సాగు విస్తీర్ణణాన్ని పెంచాలని సూచించారు. ఈ సమావేశంలో ఉద్యానశాఖ డిడి సరోజిని, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సమశేఖర్‌రెడ్డి, ఏడిలు సోమిరెడ్డి, సువర్ణ, ఏపిడి కస్థూరి, వెంకటేశ్వర్లు, పరిశ్రమల శాఖ ఏడి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

మహిళా ప్రత్యేక కోర్టును ప్రారంభించిన హైకోర్టు జడ్జి
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, జనవరి 23: మహబూబ్‌నగర్‌లోని జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఎ.రామలింగేశ్వర్‌రావు మహిళా ప్రత్యేక కోర్టును ప్రారంభించారు. అదేవిధంగా మధ్యవర్తిత్వ కేంద్రాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జుడిషియల్, ఆఫీసర్స్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యి జిల్లాలో కేసుల పూర్వపరాలను అడిగి తెలుసుకున్నారు. కోర్టులలో నెలకొన్న సమస్యలపై కూడా హైకోర్టు న్యాయమూర్తి ఆరా తీశారు. అంతేకాకుండా నారాయణపేటలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, నిర్వాసితులకు సంబంధించిన పలు కేసులకు సంబంధించిన పరిహారం చెక్కులు పెండింగ్‌లో ఉన్నాయని ఆరు నెలలుగా జడ్జి లేని కారణంగా కేసుల పురోగతి జరగడం లేదని గద్వాల ఇంచార్జి జడ్జి ఉండడంతో నారాయణపేటలో కేసులు ముందుకు పోవడం లేదని ఈ విషయంపై సినియర్ న్యాయవాది మనోహర్‌రెడ్డితో పాటు పలువురు న్యాయవాదులు హైకోర్టు న్యాయవాది దృష్టికి తీసుకువచ్చారు. దింతో ఆయన స్పందిస్తూ ఫిబ్రవరి రెండు, మూడవ వారంలో రైతులకు సంబందించిన కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అక్కడే ఉన్న జిల్లా జడ్జి శివనాగిరెడ్డికి ఈ విషయంపై దృష్టి సారించాలని న్యాయమూర్తి తెలిపారు. మహిళలపై అత్యాచారాలకు సంబందించిన కేసులను త్వరిత గతిన చేదించి నింధితులకు శిక్ష పడేలా మహిళా కోర్టు ఎంతగానో ఉపయోగపడుతుందని పలువురు న్యాయమూర్తులు అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కోర్టుల జడ్జిలు భూపతి, రాధదేవి, నిరంజన్, శ్రీలత, సూర్యనారాయణ, రామలింగం, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు నిబంధనాలను తూచా తప్పకుండా పాటించాలి
* జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్
ఆంద్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, జనవరి 23: రోడ్డు నిబంధనాలను తూచా తప్పకుండా పాటించాలని జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్ అన్నారు. శనివారం మహబూబ్‌నగర్‌లోని రాయల్ ఫంక్షన్ హల్‌లో 27వ రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా హజరయ్యారు. అంతకుముందు పట్టణంలో డ్రైవర్లు, వాహనదారులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ రోడ్డు నిబంధనాలను ప్రతి ఒక్కరు పాటించాల్సిందేనని చట్టాలను ఎవరూ కూడా ఉల్లంఘిస్తే వారు శిక్షర్హులేనని అన్నారు. జిల్లాలో ప్రమాదాలు ఆరికట్టడానికి పోలీసు శాఖ తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రజలు కూడా అందుకు సహకరించాలని కోరారు. జిల్లాలో పలు సందర్భాల్లో జరుగుతున్న ప్రమాదాలు బాధ కలిగిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా డ్రైవర్లు, మధ్యం సేవించి వాహనాలు ఎట్టి పరిస్థితుల్లో నడపరాదని అందుకే జిల్లా కేంద్రంలో డ్రక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని విస్తృత పరిచామని దింతో కొంత ఫలితాలను సాధించామన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు జాగ్రత్తలు సూచించాలని హెల్మెట్ దరించి వాహనాలు నడపాలని వాహనదారులు సీట్ బెల్టును కూడా వినియోగించుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరిగి మృతి చెందిన వారి కుటుంబాలు రోడ్డు పాలు అవుతున్నారని వాహనాలు నడిపేముందు ఓ సారి కుటుంబసభ్యులపై ఆలోచించుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ కృష్ణమూర్తి, ఆర్టిఓ కిష్టయ్య, సిఐలు సోంనారాయణసింగ్, సీతయ్య, ట్రాఫీక్ సిఐ తదితరులు పాల్గొన్నారు

డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం దేశానికే ఆదర్శం
* ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి
వనపర్తి, జనవరి 23: డిగ్రీ విద్యార్తులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం విజయవంతంగా చేసి దేశానికే ఆదర్శమని ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాద్యక్షులు నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి ప్రభుత్వ పురుషుల, మహిళా డిగ్రీకళాశాలలో మద్యాహ్న భోజనం ప్రారంభం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత 60యేళ్లుగా అనుభవించిన బాధలను కేసి ఆర్ ఆద్వర్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ద్వారా నిర్మూలించగలిగామని, ఇక మీదట బంగారుతెలంగాణ పునః నిర్మాణంతోపాటు విద్యార్థులు, నిరుద్యోగుల బంగారు జీవితానికి ప్రభుత్వం కృషిచేస్తుందని ఆయన చెప్పారు. బాధ్యతతో పనిచేయడం ప్రభుత్వాలకు తెలుసుకానీ, బాధ్యతతోపాటు మనసుతోకూడా పనిచేయడం కేసిఆర్ కేసిఆర్‌కే చెల్లుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులు బస్సు అసౌకర్యాల వల్ల ఉదయం టిఫిన్లు, భోజనాలు చేయకుండా కళాశాలలకు వస్తున్నారని, దీంతో మధ్యాహ్నం వేళల్లో నీరసానికి గురై చదువుల్లో వెనకబడుతున్నారని, ఆలాంటి పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం డిగ్రీ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం ప్రారంభించినట్లు చెప్పారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని మెరుగైన ఫలితాలు సాధించాలని ఉన్నతులుగా ఎదగాలని కోరారు. ఈకార్యక్రమంలో ఆర్డీవో రాంచందర్, ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ చంద్రశేఖర్‌రెడ్డి, రఘునాథ్‌రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ పలుస రమేష్‌గౌడ్, కౌన్సిలర్లు లోక్‌నాథ్‌రెడ్డి, వాకిటి శ్రీ్ధర్, ఆవుల రమేష్, రమేష్‌నాయక్, సతీష్, నాయకులు లక్ష్మయ్య, మహేష్, చటమోని రాము తదితరులు హాజరయ్యారు. అనంతరం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో కలిసి నిరంజన్‌రెడ్డి, ఆర్డీవో చైర్మెన్‌లతోపాటు పలువురు మధ్యాహ్న భోజనం చేశారు.

జిల్లాలో ఘనంగా నేతాజీ 119వ జయంతి వేడుకలు
* నేతాజీ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళ్ళు అర్పించిన కలెక్టర్
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, జనవరి 23: స్వాతంత్య్ర సమరయోదుడు నేతాజీ సుభాష్‌చంద్రబోస్ 119వ జయంతి వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్‌లో నేతాజీ చౌరస్తాలో ఆయన విగ్రహానికి ఎబివిపి నాయకులతో పాటు వివిధ సంఘాల నాయకులు పలువురు పోలీసు అధికారులు పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి, జాయింట్ కలెక్టర్ రాంకిషన్‌లు ఎంవిఎస్ కళశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నేతాజి సుబాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. స్వాతంత్య్రోద్యమంలో నేతాజీ దేశం కోసం చేసిన ఆజాద్ హిందుఫౌజ్ సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటీష్ వారిని గడగడలాడించారని కొనియాడారు. సుభాష్‌చంద్రబోస్ పోషించిన పాత్ర నిరుపమానమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి నాయకులు విష్ణువర్థన్, నాగరాజు, కిరణ్, శివ, నిఖిల్, రాఘవేందర్, మహేష్, వెంకటేష్, నరేష్‌లు పాల్గొన్నారు.

కేజ్రివాల్ దిష్టిబొమ్మ దగ్ధం
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, జనవరి 23: ఎబివిపిపై అసత్య ఆరోపణలు చేస్తూ దేశభక్తి, జాతీయ భావాలతో కూడిన విద్యార్థి సంస్థను దుర్భాషాలాడిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్‌ను తక్షణమే బర్తరప్ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం మహబూబ్‌నగర్‌లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆద్వర్యంలో కేజ్రివాల్ దిష్టిబొమ్మను దగ్థం చేశారు. ఎబివిపి కార్యాలయం నుండి ఢిల్లీ సిఎం కేజ్రివాల్ దిష్టిబొమ్మను ఎబివిపి విద్యార్థులు ఊరేగించి తెలంగాణ చౌరస్తాలో దగ్థం చేశారు. ఈ సందర్భంగా ఎబివిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ హెచ్‌సియూలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మృతిని వక్రీకరించడమే కాకుండా దేశభక్తి, జాతీయభావంతో దేశం కోసమే పని చేస్తున్న ఎబివిపిపై విమర్శలు చేసిన కేజ్రివాల్‌ను తక్షణమే బర్తరప్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై రాష్టప్రతి జోక్యం చేసుకుని ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుండి ఆయనను తప్పించాలని కోరారు. కేజ్రివాల్‌ను బర్తరప్ చేయాలని తెలంగాణ నుండి ఢిల్లీకి రాష్టప్రతిని కలిసేందుకు ఎబివిపి కార్యకర్తలు బయలుదేరారని ఆయన తెలిపారు. రోహిత్ ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణాలు ఏఎస్‌ఏ, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘాలే కారణమని ఆయన ఆరోపించారు. విద్యార్థి మృతిపై తక్షణమే సమగ్ర విచారణ జరపాలని సిబి సి ఐడిచే విచారించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలలో పాకిస్తాన్ తొత్తులుగా పని చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి నాయకులు విష్ణువర్థన్, నాగరాజు, నిఖిల్, శివ, నరసింహ, కిరణ్, సాగర్, చందు, వెంకటేష్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.