రాష్ట్రీయం

వెనుకబడిన జిల్లాలు అభివృద్ధి చెందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కనిగిరి రూరల్, జనవరి 23: వెనుకబడిన జిల్లాలు గణనీయంగా అభివృద్ధి చెందాలన్నదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు లక్ష్యం అని కేంద్రమంత్రి వర్యులు వై సుజనాచౌదరి అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి ఎఎంసి ప్రాంగణంలో శనివారం జరిగిన ఎఎంసి చైర్మన్, వైస్ చైర్మన్లు దారపనేని చంద్రశేఖర్, ఐవి నారాయణ, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవ స్వీకారానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి సుజనాచౌదరి మాట్లాడుతూ పక్కనే ఉన్న గుంటూరు, కృష్ణా జిల్లాల అభివృద్ధితో పోలిస్తే ప్రకాశం జిల్లా అభివృద్ధిలో ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. గత ప్రభుత్వాలు 10 సంవత్సరాల కాలంలో సాధించని ప్రగతిని 18 నెలల కాలంలో ఎంతో ప్రగతిని సాధించామని ఆయన అన్నారు. విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా అన్ని సాధించుకునేలా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దేశాభివృద్ధిలో ప్రధాని మోదీ ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. రవాణాశాఖామంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ విభజన అనంతరం రెవెన్యూ లోటులో ఉన్నా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి వెనుకడుగు వేయడం లేదన్నారు. రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖామంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిని చూడలేని ప్రతిపక్ష నాయకులు పలు విధాలుగా విమర్శించడం విచారకరమని ఆయన అన్నారు.