జాతీయ వార్తలు

వివక్షనే ప్రశ్నించాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జనవరి 23: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్‌లాగా ఏ దళిత విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకోకుండా చూడడానికే తాము ఆ పని చేశామని శుక్రవారం ఇక్కడ అంబేద్కర్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఇద్దరు విద్యార్థులు చెప్పారు. దళిత విద్యార్థులపై జరుగుతున్న అఘాయిత్యాలను వ్యతిరేకించడం కోసమే తాము ఎలుగెత్తాల్సి వచ్చిందని వారు చెప్పారు. రామ్‌కరణ్, అమరేంద్ర కుమార్ ఆర్య అనే ఈ ఇద్దరు విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు ఆ తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. తాము బాబా సాహెబ్ అంబేద్కర్ అనుయాయులమని, రాజ్యాంగానికి, చట్టానికి కట్టుబడ్డ విద్యార్థులమని కరణ్ అంటూ హైదరాబాద్‌లో ఓ దళిత విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని, భవిష్యత్తులో ఈ తరహాలో విద్యార్థులెవరు కూడా చనిపోకుండా ఉండడం కోసమే తాము నినాదాలు చేశామని చెప్పాడు. తమ గొంతు మూగబోదని, రాబోయే రోజుల్లో రోహిత్ ఎదుర్కొన్న పరిస్థితి ఏ దశిత విద్యార్థి ఎదుర్కోకుండా చూడడానికే తాము ఈ చర్య తీసుకున్నామని ఆర్య చెప్పాడు. 50 ఏళ్ల క్రితం అంబేద్కర్‌కు ఇలాగే జరిగిందని, ఇప్పుడు మళ్లీ రోహిత్‌కు ఇదే పరిస్థితి ఎదురైందని అతను అన్నాడు. అలహాబాద్ యూనివర్సిటీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ లేదా బాబా సాహెబ్ అంబేద్కర్ యూనివర్సిటీ.. ఇలా దేశంలో ఏ యూనివర్సిటీలోనైనా సరే దళిత విద్యార్థులను వేధింపులకు గురిచేస్తూనే ఉన్నారని ఆర్య చెప్పాడు.