బిజినెస్

వికసించిన వ్యాపార ‘పద్మా’లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 25: భారతీయ వ్యాపార, వాణిజ్య రంగాల అభివృద్ధికి విశేష కృషి చేసిన పలువురు పారిశ్రామికవేత్తలను సోమవారం కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులతో గౌరవించింది. వీరిలో రిలయన్స్ గ్రూప్ వ్యవస్థాపక అధినేత, ధీరుభాయ్ అంబానీకి మరణానంతరం దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ దక్కింది. గుజరాత్‌లోని ఓ కుగ్రామంలో పాఠశాల ఉపాధ్యాయుని కుమారుడిగా జన్మించిన ధీరజ్‌లాల్ హీరాచంద్ అంబానీ.. ఆ తర్వాత భార్య, పిల్లలతో ముంబయికి చేరి రిలయన్స్ గ్రూప్‌నకు అంకురార్పణ చేశారు. 1966లో అహ్మదాబాద్ సమీపంలో నరోడా వద్ద విమల్ బ్రాండ్ పేరుతో బట్టల వ్యాపారాన్ని ప్రారంభించిన అంబానీ.. టెక్స్‌టైల్ నుంచి ఆయిల్, టెలికామ్ ఇలా విభిన్న రంగాలకు విస్తరించారు. 1978 జనవరిలో బాంబే, అహ్మదాబాద్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లలో రిలయన్స్ చేరింది. 1980లో పాలిస్టర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయగా, 1990లో పెట్రోకెమికల్స్, చమురుశుద్ధి, టెలికమ్యూనికేషన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లోకి రిలయన్స్ విస్తరించింది. 1976-77లో రిలయన్స్ వార్షిక టర్నోవర్ 70 కోట్ల రూపాయలుగా ఉంటే, ధీరుభాయ్ అంబానీ మరణించే నాటికి 75,000 కోట్ల రూపాయలను తాకడం గమనార్హం. నేడు రిలయ్స గ్రూప్ సంస్థలు లక్షలాది మందికి జీవనోపాధిని కల్పిస్తున్నాయంటే అందుకు ధీరుభాయ్ శ్రమే మూలం. కాగా, పద్మవిభూషణ్ ప్రకటించడాన్ని కుమారులు ముఖేశ్, అనిల్ అంబానీలు స్వాగతించారు. ప్రభుత్వా నికి కృతజ ఞతలు తెలిపారు. ఇక షాపూర్జీ పల్లోంజి మిస్ర్తి గ్రూప్ చైర్మన్ అయిన పల్లోంజి షాపూర్జీ మిస్ర్తికి పద్మభూషణ్ సొంతమైంది. 2015లో ఫోర్బ్స్ ప్రకటించిన భారతీయ సంపన్నుల్లో 14.7 బిలియన్ డాలర్ల సంపదతో ఐదో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్ర్తి.. ఈయన చిన్న కుమారుడే కావడం గమనార్హం. అంతేగాక 109 బిలియన్ డాలర్ల విలువైన టాటా గ్రూప్ హోల్డింగ్ సంస్థ టాటా సన్స్‌లో 18.4 శాతం వాటా కూడా ఉంది. అలాగే మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ చైర్మన్ రవీంద్ర చంద్ర భార్గవను కూడా పద్మభూషణ్ వరించింది. కేబినెట్ సెక్రటేరియట్‌లో, ఇంధన మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేసిన భార్గవ.. 1981లో మారుతి సుజుకిలో చేరారు. ప్రస్తుతం దేశీయ ఆటోరంగ దిగ్గజంగా వెలుగొందుతున్న మారుతి.. కార్ల అమ్మకాల్లో దూసుకెళ్తున్నది తెలిసిందే. ఇందుకు భార్గవ చేసిన కృషి అందరికీ ఆదర్శం. మాస్టర్ కార్డ్ అధ్యక్షుడు, సిఇఒ అజయ్‌పాల్ సింగ్ బంగా, దేశీయ ఔషధరంగ దిగ్గజం సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ శాంతిలాల్ సంఘ్వీ, సిఎ టెక్నాలజీస్ భారతీయ వ్యవహారాల చైర్మన్ సౌరభ్ శ్రీవాస్తవకు పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. అజయ్ బంగా 2009లో మాస్టర్ కార్డ్‌లో చేరగా, అంతకుముందు సిటిబ్యాంక్, పెప్సికో సంస్థల్లోనూ పనిచేశారు. అలాగే 1982లో సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్‌ను దిలీప్ సంఘ్వీ స్థాపించగా, నేడు ఆ సంస్థ స్థాయి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ర్యాన్‌బాక్సీ విలీనంతో ప్రపంచస్థాయి ఔషధ పరిశ్రమగా ఎదిగింది. దీనంతటికి కోల్‌కతా విశ్వవిద్యాలయం నుంచి కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన సంఘ్వీనే కారణమని ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. ముఖేశ్ అంబానీ తర్వాత భారత్‌లో అత్యంత సంపన్ను డిగా దిలీప్ సంఘ్వీకి రికార్డూ ఉంది. ఇక సౌరభ్ శ్రీవాస్తవ.. 4.5 బిలియన్ డాలర్ల విలువైన, అమెరికాకు చెందిన బహుళజాతి సాఫ్ట్‌వేర్ సంస్థ అయిన సిఎ టెక్నాలజీస్ భారతీయ వ్యవహారాల చైర్మన్‌గా పనిచేస్తున్నారు. ఈయనకు పద్మశ్రీ అవార్డు లభించగా, ఐఐఎస్ ఇన్ఫోటెక్‌ను స్థాపించారు. ఇప్పుడిది భారత్‌లోని టాప్-20 సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ఒకటిగా ఉంది. 50కిపైగా స్టార్టప్‌లను ప్రారంభించిన, పెట్టుబడులు పెట్టిన అనుభవం ఈయనది. పలు భారత, బ్రిటిష్ సంస్థల బోర్డుల్లో ఈయన అనేక హోదాల్లో పనిచేశారు, చేస్తున్నారు.