హైదరాబాద్

విజయోత్సవాల్లో టిఆర్‌ఎస్ నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఫిబ్రవరి 5: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెస్‌లకు ప్రజలు మరోసారి చుక్కులు చూపించారని టిఆర్‌ఎస్‌కెవి జిల్లా అధ్యక్షుడు బి.కృష్ణయ్య, వికారాబాద్ జడ్పిటిసి ముత్తహర్‌షరీఫ్ అన్నారు. శుక్రవారం రాత్రి పట్టణంలోని ఎన్టీయార్ కూడలిలో ఎన్నికల్లో టిఆర్‌ఎస్ విజయదుందుభి మోగించిన సందర్భంగా టపాసులు పేల్చి, మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షాలు చేసిన దుష్ప్రచారాన్ని నమ్మలేదని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన 18 నెలలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దూసుకుపోతోందని పేర్కొన్నారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకే కాకుండా ఇవ్వని హామీలను సైతం అమలు చేస్తున్న ఘనత సిఎం కేసిఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. వృద్ద, వితంతుల పింఛన్‌ను రూ.200 నుంచి వెయ్యి రూపాయలకు పెంచారని, వికలాంగుల పింఛన్‌ను రూ.500 నుండి 1500 రూపాయలకు పెంచారని వివరించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన యువతుల వివాహానికి కళ్యాణలక్ష్మి, షాదీముబారఖ్ పేరిట 50వేల రూపాయలు ఇచ్చే మహత్తర పథకాన్ని ప్రవేశపెట్టారని వివరించారు. వచ్చే దఫాలోనూ కేసిఆరే సిఎం ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌వి జిల్లా మాజీ అధ్యక్షుడు మంచన్‌పల్లి సురేష్, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటయ్య, నాయకులు మద్గుల్‌చిట్టంపల్లి గోపాల్, గోపి పాల్గొన్నారు.
టిఆర్‌ఎస్ విజయంపై హర్షం
తాండూరు: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అఖండ విజయంపై తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ కొట్రిక విజయలక్ష్మీ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్, మంత్రివర్గానికి ప్రజలు పూర్తి విశ్వాసాన్ని ప్రకటించారని చెప్పారు. కౌన్సిలర్లు, నాయకులతో కలిసి సంబరాలు నిర్వహించారు. మంత్రి మహేందర్‌రెడ్డి నివాసం ముందు నాయకులు బాణసంచా పేల్చుతూ హంగామా చేశారు.
ఘట్‌కేసర్‌లో..
ఘట్‌కేసర్: గ్రేటర్ ఎన్నికలలో టిఆర్‌ఎస్ భారీ మెజారిటీ సాధించటంతో ఘట్‌కేసర్ మండల టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. గ్రేటర్ ఎన్నికలలో టిఆర్‌ఎస్ పార్టీకి ఉహించని మెజారిటీ సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుండటంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై భారీ ర్యాలీ జరిపారు. కార్యకర్తలు మిఠాయిలు పంచుకున్నారు. అంబేద్కర్ విగ్రహం ఆవరణలో బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. టిఆర్‌ఎస్ జిల్లా నాయకుడు బొక్క ప్రభాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రవేశ పెట్టిన ప్రజా సంక్షేమ పథకాలే భారీ మెజారిటీ, సీట్ల కైవసానికి కారణమని అన్నారు. టిఆర్‌ఎస్ నాయకులు కొంతం అంజిరెడ్డి, జగన్మోహన్‌రెడ్డి, బర్ల హరిశంకర్, బూడిద కృష్ణమూర్తి, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.