రాష్ట్రీయం

విశాఖ అభివృద్ధికి అమెరికా చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 12: భారత్- అమెరికా మధ్య పరస్పర సహకారం కొనసాగుతుందని భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్ ఆర్ వర్మ అన్నారు. విశాఖ స్మార్ట్ సిటీ మాస్టర్ ప్లాన్ తయారీతోపాటు, అవసరమైన నిధుల సమీకరణకు ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ స్టేట్ ట్రేడ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (యుఎస్‌టిడిఏ) మధ్య శుక్రవారం విశాఖలో ఒప్పందాలు కుదిరాయి. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రిచర్డ్ మీడియాతో మాట్లాడుతూ భారత్‌తో పెద్ద ఎత్తున వ్యాపార సంబంధాలు పెంపొందించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఏడాదికి 500 బిలియన్ డాలర్ల వ్యాపారాన్ని సాగించేందుకు అమెరికా సిద్ధమన్నారు. భారత్‌లో వ్యాపారాభివృద్ధికి అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయని రిచర్డ్ తెలిపారు. అమెరికాకు చెందిన 24 కంపెనీలు భారతదేశంతో వ్యాపారాలు చేసేందుకు ముందుకొస్తున్నాయని చెప్పారు. అలాగే భారత దేశంలో మూడు నగరాలను స్మార్ట్ సిటీలుగా ప్రకటించిన నేపథ్యంలో వీటికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు అమెరికాకు చెందిన కెపిఎంజి, అయికాం, ఐబిఎం సంస్థలు భాగస్వాములయ్యాయని రిచర్డ్ తెలియచేశారు. స్మార్ట్ సిటీ మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో స్థానిక ప్రజల అభిప్రాయాలను సేకరిస్తామన్నారు. అమెరికా సాంకేతక పరిజ్ఞానంతో ఏర్పాటైన ప్రాజెక్ట్‌లను ఈ స్మార్ట్ సిటీల్లో నెలకొల్పుతామన్నారు. స్థానిక ప్రజల అవసరాలను ముందుగా తెలుసుకుని, వాటి ప్రాధాన్యతలను మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరుస్తామని తెలిపారు. మాస్టర్ ప్లాన్ తయారీలో వస్తున్న న్యాయపరమైన అంశాలను అధిగమించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వర్తక, వాణిజ్య విషయాల్లోకి వస్తే భారతదేశంలోని పన్నుల విధానం తమకు అనుకూలంగా ఉంటుందన్న ఆశాభావాన్ని రిచర్డ్ వ్యక్తం చేశారు. అమెరికా కామర్స్ డిపార్ట్‌మెంట్‌ను విశాఖలో ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తీర ప్రాంతంలో వ్యాపారాభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు.
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళుతున్న భారత విద్యార్థులను అవమానిస్తున్నారని రిచర్డ్ దృష్టికి మీడియా తీసుకువెళ్లగా.. ఇందులో కొన్ని సమస్యలు తలెత్తిన మాట వాస్తవమేనని, వీటిని సానుకూలంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భద్రతా పరంగా ఎదురయ్యే సమస్యల కారణంగా విద్యార్థులు ఇబ్బందిపడ్డారని, ఇందులో తమ విధానాలను ఎవ్వరూ తప్పుపట్టనవసరం లేదని రిచర్డ్ స్పష్టం చేశారు.
రక్షణ రంగంలో పరస్పర సహకారం
రక్షణ రంగానికి సంబంధించి భారత్, అమెరికాలు పరస్పర సహకారాన్ని అందించుకుంటాయని ఆయన స్పష్టం చేశారు. జెట్ టెక్నాలజీని భారత్‌కు అమెరికా అందిస్తోందని ఆయన చెప్పారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీలో అమెరికా మరింత సహకరిస్తుందని ఆయన తెలియచేశారు. అమెరికా ఎంబసీని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తారా.. అని అడిగిన ప్రశ్నకు రిచర్డ్ సమాధానం చెపుతూ బడ్జెట్, ఉద్యోగుల కేటాయింపులను బట్టి ఆ అంశాన్ని పరిశీలిస్తామని తెలియచేశారు.