జాతీయ వార్తలు

వ్యక్తిగతంగా రానక్కర్లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఊరట లభించింది. ట్రయల్ కోర్టు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి వారికి మినహాయింపునిస్తూ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే ట్రయల్ కోర్టులో జరుగుతున్న నేర విచారణలో జోక్యం చేసుకోవడానికి మాత్రం నిరాకరించింది. ట్రయల్ కోర్టులో ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 20న ఉంది. సోనియా, రాహుల్‌కు వ్యక్తిగత హాజ రు నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ ఏ దశలోనయినా, ఎప్పుడయినా వారి హాజరు అవసరం అనుకుంటే మేజిస్ట్రేట్ వారిని కోర్టుకు పిలువొచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఫిర్యాదుదారు అయిన బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి సోనియా, రాహుల్‌లకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని వ్యతిరేకించినప్పటికీ, ఈ కేసులోని ప్రత్యేకమైన వాస్తవాలు, పరిస్థితుల వల్ల పిటిషన్‌దారుల హోదా కారణంగా వారు ట్రయ ల్ కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజ రు కావడం వల్ల అనుకూలతకన్నా ప్రతికూలతే ఎక్కువగా ఉంటుందని తాము భావిస్తున్నట్లు న్యాయమూర్తులు జె.ఎస్.ఖేహార్, సి.నాగప్పన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యా ఖ్యానించింది. అందువల్ల ట్రయ ల్ కోర్టు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి పిటిషనర్లకు మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది. సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్, ఎ.ఎం. సింఘ్వీ, ఆర్.ఎస్.చీమా.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తదితరుల తరపున చేసిన వాదనలు విన్న తరువాత సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. సోనియా, రాహుల్‌లు తమకు వ్యతిరేకంగా ట్రయల్ కోర్టులో విచారణను నిలిపివేయాలని దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన తరువాత సుప్రీంకోర్టు తిరిగి అందులో జోక్యం చేసుకోవడం సమంజసమని తాము భావించడం లేదని సుబ్రహ్మణ్య స్వామి అంతకుముందు వాదించారు.