ఆంధ్రప్రదేశ్‌

వారూ వీరూ భాయ భాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఫిబ్రవరి 12: కడప జిల్లా ఇసుక టెండర్లలో అధికార, ప్రతిపక్ష నాయకులు సిండికేట్‌గా మారి కొన్నిరీచ్‌లను ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే అధిక ధరలకు కోట్‌చేస్తూ టెండర్లు దక్కించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే కొన్నిచోట్ల ఎక్కువ ధరకు కోట్‌చేయగా, మరికొన్ని చోట్ల అతి తక్కువ ధరకు టెండర్లు వేసి రీచ్‌లను దక్కించుకున్నారు. జిల్లాలో 12 రీచ్‌లకు గురువారం టెండర్లు పిలువగా, క్యూబిక్ మీటర్ రూ.110 మొదలుకుని రూ.702 వరకు టెండర్లు వేశారు. ప్రభుత్వం నిబంధనలు మేరకు క్యూబిక్ మీటరుకు రూ.500లకు మించకుండా కోట్‌చేయాల్సి వుంది. ప్రభుత్వం అమ్మకం ధర క్యూబిక్ మీటరు రూ.550లు ఉండగా, టెండరు దారులు రూ.700 పైబడి ధర కోట్‌చేసి రీచ్‌లను కైవసం చేసుకున్నారు. ఇటువంటి రీచ్‌లను దక్కించుకున్న వారు క్యూబిక్ మీటరుకు రూ.1000కి పైబడి అమ్మకాలు సాగించే అవకాశముంది. కొంతమంది అధికార, ప్రతిపక్షనేతలు సిండికేట్ అయి ఇసుక టెండర్లు దక్కించుకునేందుకు మాస్టర్‌ప్లాన్ వేశారు. అధికధరకు కోట్‌చేస్తే ఖచ్చితంగా టెండరు తమకే ఖరారవుతుందని, తద్వారా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసి కోట్లరూపాయల్లో లాభాలు ఆర్జించవచ్చనేది వారి వ్యూహంగా ఉంది. గత ఏడాది ప్రభుత్వమే స్వయంగా డ్వాక్రాసంఘాల ద్వారా దాదాపు 20లక్షల క్యూబిక్ మీటర్లను ఇసుకను అమ్మకాలు చేయగా, రూ.60కోట్లమేర ఆదాయం సమకూరింది. డ్వాక్రాసంఘాలను డమీలుగా మార్చి కొందరు అధికారపార్టీ నేతలు ఇసుక అమ్మకాలను తమ స్వాధీనంలోకి తీసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ ఏడాది పాలసీ మార్చింది. అయితే నూతన పాలసీలోని నేతలు సిండికేట్‌గా మారి వివిధ రీచ్‌లకు టెండర్లను కోట్ చేశారు. మేదరపేట, ఏటూరు, జ్యోతి, శేషమాంబపురం, అనిమెల, టంగుటూరు, కాలువపల్లె, కోనంతరాజుపురం, బుగ్గపట్నం, హనుమనగుత్తి, పొన్నతోట, కుమ్మరాంపల్లి, కొండాపురం, ఓబన్నపేట, చెరువుకింద పల్లె, కోమరునిపల్లె, ములపాక, బాలరాజుపల్లి, ఓబులంపల్లె, ఉలవలపల్లె, పైడికాలువ, గంగవరం, కుప్పంరాజుపల్లెల్లో ఇసుక రీచ్‌లను ప్రభుత్వం గుర్తించింది. తాజాగా 12 రీచ్‌లకు టెండర్లు పిలవగా, ఒక రీచ్‌ను సాంకేతిక కారణాలతో నిలిపివేశారు. వల్లూరు మండలం చెరువుకిందపల్లె రీచ్‌కు క్యూబిక్ మీటరు ధర రూ.354లు, అనిమెల రీచ్‌కు రూ.110లు, వేంపల్లె మండలం కుమ్మరాంపల్లె రీచ్‌కు రూ.320లు, కొండాపురం మండలం బుగ్గపట్నం-2 రూ.344లు, ఎర్రగుంట్ల మండలం హనుమనగుత్తి-2 రూ.126లు, కొండాపురం మండలం నేదరపేట రీచ్‌కు రూ.362లు, అదే మండలం సుగమంచిపల్లె రీచ్‌కు రూ.360లు, అదే మండలానికి చెందిన బుగ్గపట్నం -3 రీచ్‌కు రూ.422లు, రాజంపేట మండలం బాలరాజుపల్లె రీచ్‌కు రూ.646లు, అదే మండలం మందారం రీచ్‌కు అధిక ధర రూ.702ల చొప్పు కోట్‌చేసి టెండర్లు దక్కించుకున్నారు. టెండరుదారు గరిష్టంగా క్యూబిక్‌మీటరుకు రూ.550లోపు ధరతో ఇసుక విక్రయించాల్సివుంది. మందారం, బాలరాజుపల్లె రీచ్‌లు అధిక ధరకు కోట్‌చేయడం వెనుక మతలబు ఏమిటో అధికారులకు అంతుబట్టడం లేదు. మొత్తమీద కడపజిల్లాలో ఇసుక పుణ్యమా అని అధికార, ప్రతిపక్ష నేతలు ఏకం కావడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.