ఆంధ్రప్రదేశ్‌

విత్తన కొరతపై పత్తి రైతుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 12: ప్రస్తుత సీజన్‌లో పత్తి విత్తనాలకు తీవ్రమైన కొరత ఏర్పడగలదని రెండు రాష్ట్రాల్లోని పత్తిరైతులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం పత్తి విత్తనాల మార్కెట్‌లో 95 శాతం మేరకు మహికో - మోన్ శాంటో బయోటెక్ ఇండియా లిమిటెడ్ (ఎం ఎంబీఎల్) రైతుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకోకపోవడం, నూజివీడు సీడ్స్ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఎల్) మరియు దాని అనుబంధ సంస్థలు ప్రవర్థన్ సీడ్స్, ప్రభాత్ అగ్రిబయోటెక్‌లకు గత ఏడాది రాయల్టీ లేదా ట్రైట్ ఫీజు చెల్లింపులు జరపకపోవడంపై లైసెన్స్ రద్దు నోటీసులు జారీ చేయడం కారణంగా పత్తి విత్తనాలకు కొరత ఏర్పడగలదని భావిస్తున్నారు. ట్రైట్ ఫీజులు మరియు మొత్తంమీద విత్తన ధరలను నియంత్రించేందుకు గాను సాంకేతికత గుత్త్ధాపత్యం నియంత్రణకు సంబంధించి 2006-07లో అమల్లోకి వచ్చిన రాష్ట్ర విత్తన చట్టాల ప్రకారం ప్రభుత్వం నిర్దేశించిన ట్రైట్ రేట్లను పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా ఎన్‌ఎస్‌ఎల్ దాని అనుబంధ సంస్థలు, మరో ఆరు ఇతర విత్తన కంపెనీలు గత ఏడాది ఎంఎంబీఎల్‌ను కోరాయి. రాష్ట్ర విత్తన చట్టం ట్రైట్ ఫీజులను 2009-10 నుంచి నిర్దేశించింది. ఆయా విత్తన కంపెనీలు అప్పటికే ట్రైట్ ఫీజులను అడ్వాన్స్‌గా చెల్లించి ఉండిన నేపథ్యంలో తాము అధికంగా చెల్లించిన మొత్తాలను వాపస్ చేయాల్సిందిగా అవి ఎంఎంబిఎల్‌ను కోరాయి. ట్రైట్ ఫీజులను నిర్దేశించేందుకు ప్రభుత్వానికి గల అధికారాలను ప్రశ్నిస్తూ ఎంఎంబీఎల్ ఈ అంశంపై వివాదాన్ని రేకెత్తించింది. ప్రభుత్వం నిర్దేశించిన ట్రైట్ ఫీజులను గుర్తించేందుకు నిరాకరించింది. ఎనిమిది విత్తన కంపెనీలు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. తనకు గల గుత్త్ధాపత్య బలాన్ని మరియు మార్కెట్ ఆధిపత్యాన్ని వినియోగించుకుంటూ ఆయా కంపెనీలకు చెల్లించాల్సిన మొత్తాలను చెల్లించకుండా, ఎనిమిది సబ్ లైసెన్సీ కంపెనీల్లో మూడింటికి లైసెన్స్‌ల రద్దు నోటీసులను జారీ చేసింది. ఈ మూడు కంపెనీలు కూడా దేశానికి చెందిన అతి పెద్ద విత్తన కంపెనీకి చెందనివి కావడం గమనార్హం. విభజించి పాలించు అనే తన ఎత్తుగడలో భాగంగా మోమోశాంటో ఈ విధమైన చర్యకు పాల్పడింది. తద్వారా మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగించదల్చుకుంది. ఆమోదయోగ్య పరిష్కారం కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. మోన్‌శాంటో, నూజివీడు సీడ్స్ మధ్య మధ్యవర్తిత్వానికి నేషనల్ సీడ్ అసోసియేషన్ ముందుకు వచ్చినా మోన్‌శాంటో అందుకు తిరస్కరించింది. రాయల్టీ అంశంపై తన ధృఢవైఖరిని కొనసాగిస్తోంది. దేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అతి పెద్ద పత్తి ఉత్పత్తి రాష్ట్రాలుగా ఉన్నాయి. ఈ పంట సీజన్‌లో విత్తనాల కొరత ఏర్పడితే కొరత కారణంగా పత్తి విత్తనాలకు అధిక రేట్లు చెల్లించమోలేదా ఇతర పంటల వైపు మళ్లడమో చేస్తారు. ఇందులో ఏదీ కూడా అంత తేలికైంది కాదు మరియు ప్రతిఫలాన్ని అందించేది కాదు’ అని నేషనల్ సీడ్ అసోసియేషన్ (ఎన్‌ఎస్‌ఎఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కల్యాణ్ గోస్వామి వ్యాఖ్యానించారు.
పత్తి మొక్కలకు నష్టం కలిగించే పురుగుల్లో ముఖ్యమైంది అయిన గులాబీరంగు కాయ తొలుచు పురుగు మోన్‌శాంటో రెండో తరం బయో టెక్నాలజీ రక్షణ అయిన బోల్‌గార్డ్-2కు నిరోధకత పొందింది. దేశంలో పత్తి పండించే పలు ప్రాంతాల్లో ఈ పురుగు పత్తి పంటకు విపరీత నష్టం కలిగించడం సాధారణమైపోయింది. గత 4-5 ఏళ్లుగా హెక్టారుకు 550 కిలోల లింట్ దిగుబడి వద్దనే బీటీ కాటన్ ఉత్పాదకత నిలిచిపోయింది. 2006లో ప్రవేశపెట్టబడిన నూతన తరం సాంకేతికతలో ఈ విధమైన లోటుపాట్లు ఉన్నప్పటికీ తన పేటెంటెడ్ సాంకేతికతపై తాను వసూలు చేస్తున్న అధిక రాయల్టీలను తగ్గించేందుకు ఎంఎంబీఎల్ తిరస్కరిస్తోంది. పత్తి విత్తన మార్కెట్లో తనకున్న గుత్త్ధాపత్యం నేపథ్యంలో రాయల్టీల ద్వారా ఎంఎంబీఎల్ ఇప్పటివరకూ రూ.5,500 కోట్లను ఆర్జించినట్లు అంచనా. ఈ సాంకేతికత 49 విత్తన తయారీ కంపెనీలకు సబ్ లైసెన్స్‌గా ఇవ్వబడింది. భారతదేశంలో హైబ్రిడ్ పత్తి విత్తన కంపెనీలన్నీ దీని పరిధిలోకి వచ్చాయి. పోటీ ఇచ్చే దీటైన సాంకేతికత లేని కారణంగా పోటీదారులు సైతం ఎంఎంబీఎల్ సాంకేతికత ఉపయోగించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ గుత్త్ధాపత్యం కారణంగా ఎంఎంబీఎల్ మార్కెట్‌కు షరతులు విధించే పరిస్థితి నెలకొంది. అధిక రాయల్టీలను వసూలు చేస్తోంది. పోటీని అణిచివేస్తోంది.