మెయన్ ఫీచర్

విద్యా కళారంగాల ప్రక్షాళన జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ రెండేళ్ల పాలనా కాలంలో నరేంద్ర మోదీ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది సాంస్కృతిక, కళా రంగాలు, చలనచిత్ర పరిశ్రమ, సాహిత్య సంగీత నాటక అకాడమీలు, విద్యావిధానం, పాఠ్యాంశాల రూపకల్పన. వీటిల్లో ఎటువంటి వౌలికమైన మార్పులు జరగలేదు. గత అరవై సంవత్సరాలుగా వస్తున్న విద్యా విధానాలే గతానుగతికంగా కొనసాగుతున్నాయి. తమిళనాడులో ద్రవిడ ప్రభుత్వాలు ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో సంస్కృత, హిందీ పదాలు కనబడకుండా చేశారు. ఆకాశవాణి మేరు ‘వానోలి నిలయం’ అయింది. లక్ష్మణన్ పేరు ఎలకుమారన్‌గా మార్చారు. శ్రీ అనే అక్షరానికి బదులు తిరు-మేల్ అనే పదాలు వాడారు. అలాగే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఇక్కడ తెలంగాణ రచయితల గ్రంథాలనుండి పాఠ్యాంశాలను ప్రవేశపెట్టారు. కాని భారత ప్రభుత్వం మాత్రం అలా చేయలేకపోయింది.
భారతదేశంలోని కళాకారులను సాహితీ వేత్తలను గుర్తించి గౌరవించే నిమిత్తం సంగీత, సాహిత్య, నాటక అకాడమీలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటికి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రాష్టప్రతి పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంతవరకు రాష్ట్ర అకాడమీ బెజవాడ గోపాలరెడ్డి అధ్యక్షతన చాలా కాలం పనిచేసింది. దేవులపల్లి రామానుజరావు, ఇది వెంకటకృష్ణమూర్తి, అకాడమీ కార్యదర్శులుగా పనిచేశారు. తర్వాత ఈ అకాడమీలను రద్దు చేసి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో కలిపేశారు. కేంద్ర సాహిత్య అకాడమీకి వసంతరావు వెంకట్రావు, భద్రిరాజు కృష్ణమూర్తి, పోరంకి దక్షిణామూర్తి, అక్కిరాజు రమాపతిరావు, ఎన్ గోపీ వంటివారు రీజినల్ కన్వీనర్లుగా వ్యవహరించారు. కేంద్రం అకాడమీ అధ్యక్షుడిగా మొన్నటి వరకు సునీల్ గంగోపాధ్యాయ ఉండేవారు. వారి అనంతరం ప్రస్తుతం తివారీ అధ్యక్ష స్థానంలో ఉన్నారు. వారికి దక్షిణ భారతీయులను గూర్చిన పరిజ్ఞానం ఉండే అవకాశమే లేదు. కె. శ్రీనివాసరావు ఇక్కడి సాహితీవేత్తలను పరిచయం చేయవలసిందే.
ఇక అకాడమీ ఫెలోషిప్‌లు ఉంటాయా? లోగడ విశ్వనాథ సత్యనారాయాణ, గుంటూరు శేషేంద్రశర్మ, సి. నారాయణరెడ్డిలకు ఈ ఫెలోషిప్‌లు లభించాయి. ఇదొక జాతీయ స్థాయి గౌరవం. ఇందిరాగాంధీ రాజకీయంగా బలహీనంగా ఉన్నప్పుడు సామ్యవాదులు ఆమెతో ఒక ఒప్పందం చేసుకున్నారు. ‘‘రాజకీయంగా మీకు మేం మద్దతునిస్తాం. సాహిత్య కళా రంగాలపై మాకు ఆధిపత్యాన్ని కొనసాగించనివ్వండి,’’ అని కోరారు. అందుకు ఆమె అంగీకరించారు. ఈ నేపథ్యం తెలిస్తే తప్ప ప్రస్తుతం నడుస్తున్న సాహిత్య రాజకీయాలు అర్థం కావు.
తెలుగు భాషా సాహిత్యాలపై వీరికి గౌరవం లేదు. ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించారు. నన్నయ, తిక్కన, పోతన వంటి పూజనీయులైన కవులను అవమానించారు. బైరాగి అనే రచయిత ‘నూతిలో గొంతుకలు’ అనే రచ న చేశాడు. దానికి అంతగా గుర్తింపు రాలేదు. ‘ఆగమ గీతి’ అనే మరో పుస్తకం రాశాడు. దానికి అకాడమీ పురస్కారం ఇప్పించారు. మధురాంతకం రాజారాం దేశభక్తుడుగా ఉన్నంత వరకు ఆయనను సామ్యవాదులు పట్టించుకోలేదు. ఆయన కథలను జాగృతి వంటి పత్రికలు ప్రాధాన్యత ఇచ్చి పురస్కారాలు అందజేశాయి కూడా. ఇది ప్రయోజనం లేని పని అని గ్రహిం ఆయన అభ్యుదయ రచయితల సమితితో సాన్నిహిత్యం పెంచుకున్నారు. వెంటనే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది!
అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులుగా దేవులపల్లి కృష్ణశాస్ర్తీ వంటివారు ఉండేవారు. వారివల్ల తమకు ఒరిగేది ఏమీ ఉండదని భావించి అలాంటివారిని తొలగించారు. 1944, డిసెంబరు 30న విజయవాడలో జరిగిన అరసం సభలకు ప్రారంభకులుగా సజ్జాద్ జాహీర్ వచ్చారు. అలాగే 1947 జనవరిలో మద్రాసులో జరిగిన సభలకు కె.ఎ. అబ్బాస్ వచ్చారు. 1947లో దేశ విభజన జరిగిన తర్వాత కూడా వీరికి జ్ఞానోదయం రాలేదు. 1925 నాటి లండన్ తీర్మానానికే కట్టుబడి వ్యవహరించారు. దేశభక్తులను ఫాసిస్టులు, నాజీలు, హిట్లరు భక్తులు అని తిట్టారు. ఇస్కారా, ప్రావదా వంటి రష్యన్ పత్రికల నుండి స్ఫూర్తి పొందారు. 1925 లండన్ డిక్లరేషన్ ప్రాతిపదికపై తమ మానిఫెస్టోను తెలుగులో ప్రకటించారు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. 1942 డిసెంబరు 24న ఏలూరు నవ్య సాహిత్య పరిషత్తు వార్షిక సమావేశాలు జరిగాయి. సామ్యవాద రచయితలు, అభ్యుదయ రచయితల సంఘం స్థాపించడానికి ముందు పూర్వరంగంగా ఈ పాత సంస్థనే ఆశ్రయించుకున్నారు. ‘ప్రతిభ’ పత్రిక సప్తమ సంపుటాన్ని తమదిగా మార్చుకున్నారు.
1942 డిసెంబరు ఏలూరు సమావేశాల తీర్మానం నుండి కొన్ని సంక్షిప్త వాక్యాలు.. ‘‘అవసరం ప్రారంభమైనప్పుడు ఇదొక సాహిత్య సంస్థ అని చెప్పారేకానీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాకు అనుబంధమని చెప్పలేదు. ఈ కారణం చేత తర్వాతి కాలంలో చదలవాడ పిచ్చయ్యపై రచయితలు తిరగబడ్డారు. తెలికిచర్ల వెంకటరత్నం, పిల్లలమర్రి వెంకట హనుమంతరావు, దేవులపల్లి కృష్ణశాస్ర్తీ, పి.వి. రాజమన్నారు వంటి అధ్యక్షులుగా పనిచేసిన వారు సంస్థకు దూరమయ్యారు. చదలవాడ పిచ్చయ్య కూడా తర్వాత రాజీనామా చేశారు’’-( 31-12-1948 ఆంధ్రపత్రిక-వారపత్రిక నుండి..).
తెలుగులో చలం, గురజాడలను ఈ సంస్థవారు దత్తత తీసుకున్నారు. విశ్వనాథ వంటివారిని తీవ్ర పదజాలంతో అవమానించారు. ‘మానవుడు పుట్టింది దేనికి? అంటే ‘సంభోగించడానికి’ అన్నాడు చలం. ఇతని చేత శ్రీశ్రీ తన పుస్తకానికి పీఠిక రాయించుకున్నాడు. నజురుల్ ఇస్లాం (విద్రోహి) మైకేల్ మధుసూదన దత్తు (రాముడు కాదు ఇంద్రజిత్తు హీరో అంటూ మేఘనాధ వథ అనే గ్రంథాన్ని రాసాడు), ఫైజ్ జాఫ్రీ, ముక్దుమ్ మొహిద్దీన్, యశ్‌పాల్ వంటివారు సంప్రదాయ సాహిత్యంపై తిరుగుబాటు చేశారు. ఈ పరంపరను అభ్యుదయ రచయితల సంఘం 1962 వరకు కొనసాగించింది. ఈ సంస్థ బలహీనమైన తర్వాత విప్లవ రచయితల సంఘం, దిగంబర రచయితల సంఘం పుట్టుకొచ్చాయి. కారం దంచిన రోకలితో భారతదేశాన్ని దంచాలని దిగంబరుడు రాశాడు. వైష్ణవులను పంగనామాల పొట్టేళ్లుగా అభివర్ణించారు. వీరి గొడవ కొంతకాలం సాగింది. ఐతే అం దులో మహాస్వప్నం వంటివారు జారిపోయి పుట్టపర్తి సాయిబాబా భక్తులయ్యారు.
కేంద్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం కేంద్ర పురస్కారాలు తిరుగుబాటు రచయితలు, రచయిత్రులు స్వాధీనం చేసుకున్నారు. చరిత్ర నిర్మాణం రొమిల్లా థాఫర్, బిపిన్ చంద్ర, ఆర్‌ఎస్ శర్మ, అరుంధతీ రాయ్, రాహుల్ సాంకృత్యాయన్, వకుళా భరణం రామకృష్ణ వంటి వారి చేతులలోకి పోగా కేంద్ర అకాడమీలను నెహ్రూ-ఇందిరల ఆశీస్సులతో సామ్యవాదులు స్వాధీనం చేసుకున్నారు. రాచమల్లు రామచంద్రారెడ్డి, కొడవటి గంటి కుటుంబరావు, కాళీపట్నం రామారావు, చేకూరి రామారావు, కె. శివారెడ్డి, ఆరుద్ర, రాచపాలెం చంద్రశేఖర రెడ్డి, కాత్యాయనీ విద్మహే, ఓల్గా, అబ్బూరి ఛాయాదేవి ఇలా అరవై సంవత్సరాలు సామ్యవాదులు పురస్కారాలు తామే వడ్డించుకుంటూ వచ్చారు. అడ్డం వచ్చిన కౌతం విశ్వనాధ రెడ్డి వంటి వారిని బెదిరించారు. ఎవరెవరికి ఏయే బలహీనతలున్నాయో గమనించి ఆయా వ్యక్తులను, భద్రిరాజు కృష్ణమూర్తి వంటి వారిని సంతృప్తి పరచి తమ పని గుట్టు చప్పుడు కాకుండా నెరవేర్చుకున్నారు.
నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అకాడమీలు బాగుపడతాయని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. మోదీ పాలనలో అసహనం పెరిగింది అనే నినాదంతో యాభై మంది విద్రోహ రచయితలు, రచయిత్రులు తమ పురస్కారాలను తిరస్కరించిన నాటకంలో పాల్గొన్నారు. వారు ఎందుకు తిరస్కరించారు అనేది కాదు, అసలు వీరికి పురస్కారాలు ఎలా వచ్చాయి? అన్నదే ప్రశ్న. దేశవ్యాప్తంగా జరిగిన ఈ దుర్మార్గాన్ని ఎదుర్కోవడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్లిప్త వైఖరి ప్రదర్శిస్తున్నది. అరవై సంవత్సరాల దోపిడీ- దుర్మార్గం తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయింది. ఈ పురస్కార తిరస్కార రచయితలపై రెండు ప్రాథమిక ఆరోపణలు ఉన్నాయి. తాము ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారో తదనుగుణమైన జీవితం లేకపోవడం. అంటే ‘నన్ను చూడకు, నా కవిత చదువు’ అనే ధోరణిలో బతకడం. ప్రముఖ తిరుగుబాటు రచయితలు సినీరంగంలో చేరి విలాసవంతమైన జీవితం గడపడం. ఇది వారిని నమ్ముకున్న పాఠకులను దిగ్భ్రాంతికి గురి చేసింది. సోవియట్ యూనియన్ విచ్ఛిత్తి తరువాత సైద్ధాంతికంగా సామ్యవాద రచయితలు గందరగోళంలో పడ్డారు. నేతాజీ, వివేకానంద, అరవిందలను అశ్లీల భాషలో తిట్డం పొరపాటేనని తర్వాత కాలంలో జాతికి క్షమాపణ చెప్పారు. ఐనా లాభం ఏముంది? అంతా గత జలసేతు బంధనం. ఇవ్వాళ ప్రపంచవ్యాప్తంగా రష్యా, క్యూబా, పోలెండ్, వియత్నాం వంటి రాజ్యాల్లో వారు ఆశించిన రాజ్యాలు లేవు. చైనా మరో పెట్టుబడిదారీ నమూనా సమాజ వ్యవస్థకు సిద్ధపడ్డది. వ్యక్తి స్వంత ఆస్తిని అంగీకరించింది. కుటుంబ వ్యవస్థను అంగీకరించింది. ఇది సామ్యవాద మూల సిద్ధాంతాలకు విరుద్ధం.
తెలుగులో ఓల్గాలు, మిసిసిపీలు ఎలా పురస్కారాలు అందుకుంటున్నారు? నరేంద్ర మోదీ, రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, మహేశ్ శర్మలు ఈ సాహిత్య దౌర్జన్యాన్ని అరాజకత్వాన్ని ఇంకెంతకాలం సహిస్తారు? సాహిత్య అకాడమీ చేయించే పనుల్లో మోనోగ్రాఫ్‌ల రచన ఒకటి. మహాపురుషులు, భారతీయ సాహిత్య నిర్మాతల జీవితాలను వంద పుటలుగా పరిచయం చేసిన వివిధ భారతీయ భాషలలో ప్రచుంచడం దీని పరమార్ధం. ఇందులో ఎందరో అయోగ్యులపై మోనోగ్రాఫ్‌లు వ్రాయించి, యోగ్యులను విస్మరించారు. అంతేకాదు, చిన్నయ సూరిని నిరంతరం ద్వేషించే బూదరాజు రాధాకృష్ణ వంటి వారికి చిన్నయసూరిపై మోనోగ్రాఫ్ వ్రాయించారంటే అది ఎంత దివ్యంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు.
సైద్ధాంతికంగా మార్క్సిస్టులు పెద్ద పొరపాటు చేశారు. ఒక వ్యక్తిని సత్కరించడం అంటే వారి భావజాలాన్ని ఆమోదించడం అని అర్థం. బైరప్పను గౌరవించడం ద్వారా భారతీయ సంప్రదాయ సాహిత్యాన్ని, మహాభారతాన్ని అవమానించినట్లయింది. యు.ఆర్. అనంతమూర్తిని గౌరవించడం అంటే సూడో సెక్యులరిజాన్ని గౌరవించినట్లయింది. వోల్గాను గౌరవించడం అంటే భారతీయ కుటుంబ వ్యవస్థను ఎగతాళి చేసినట్లవుతుంది. దళిత స్పృహ, స్ర్తివాదం, మైనారిటీవాదం, ఉపప్రాంతీయవాదం, కులవాదం, ఇటీవల ఎక్కువగా వ్యాప్తిలో ఉన్నాయి. ఇవన్నీ జాతీయ జీవన మూలాలను సవాలు చేస్తున్నాయి కాబట్టి ఈ ఉద్యమానికి మార్క్సిస్టు అరాజక శక్తులు మద్దతు ప్రకటించాయి. అరాజకం ఒక ప్రత్యేక వాదం. వర్ణ, లింగ చైతన్యం పెరిగే కొద్దీ వర్గ చైనత్యం కనుమరుగవుతుంది. ఈ మూల సూత్రం సామ్యవాదులు మరచిపోయి తాము ఎక్కిన కొమ్మను తామే నరుక్కుంటున్నారు. పి. సాంబశివరావు, అక్కిరాజు రమాపతిరావు వంటి జ్ఞాన వృద్ధులు లోగడ ఈ పురస్కార ప్రక్రియలపై నిరసన వ్యక్తం చేశారు. లోగడ ప్రకటించిన కేంద్ర సాహి త్య అకాడమీ పురస్కారాల కుంభకోణంపై మోదీప్రభుత్వం సిబిఐ చేత విచారణ జరిపితే చాలా విషయాలు వెలుగులోకి వస్తాయి.

-ముదిగొండ శివ ప్రసాద్