బిజినెస్

‘వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిని పెంచండి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: వ్యక్తిగత ఆదాయంపై పన్ను మినహాయింపు పరిమితిని 2.5 లక్షల రూపాయల నుంచి 4 లక్షల రూపాయలకు పెంచాలని పారిశ్రామిక సంఘం అసోచామ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అలాగే విద్య, వైద్య ఖర్చుల కోసం చేసే పొదుపు, ఇతరత్ర పన్ను అలవెన్సులకు కూడా అదనంగా ప్రోత్సాహకాలివ్వాలని మోదీ సర్కారును డిమాండ్ చేసింది. తాము చేసిన ఆమ్ ఆద్మీ సర్వేలో 87 శాతం మంది వ్యక్తిగత ఆదాయంపై పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుతమున్న 2.5 లక్షల రూపాయల నుంచి 4 లక్షల రూపాయలకు పెంచాలని కోరినట్లు సోమవారం అసోచామ్ తెలిపింది.