రాష్ట్రీయం

విజయోత్సవాలతో అసెంబ్లీకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి, విజయోత్సవాలతో అసెంబ్లీకి వచ్చే విధంగా ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేస్తోంది. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఫలితాలు వెలువడగానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిపే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఘన విజయం సాధించిన టిఆర్‌ఎస్, నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నిక విజయంపై భరోసాతో ఉంది. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లలో గెలుపుకోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటికే ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. గత సాధారణ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో టిఆర్‌ఎస్‌కు ఒకే ఒక సీటు వచ్చింది. అయితే ఆ తరువాత పరిస్థితి మారిపోయింది. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో చక్రం తిప్పిన తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు టిఆర్‌ఎస్‌లో చేరి, మంత్రి అయ్యారు. ఆయన నాయకత్వంలో జడ్‌పి చైర్‌పర్సన్, జడ్‌పిటీసిలు, ఎంపిటీసిలు, మండల ప్రజాపరిషత్ చైర్మన్‌లు పెద్దయెత్తున టిఆర్‌ఎస్‌లో చేరారు. కాబట్టి ఖమ్మంలో పాగా వేయడం సులభమేనని టిఆర్‌ఎస్ అధినాయకత్వం భావిస్తోంది. ఇక వరంగల్ విషయానికొస్తే టిఆర్‌ఎస్‌కు ఈ జిల్లా పెట్టని కోట. వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో ఆ విషయం మరోసారి రుజువైంది. మున్సిపల్ ఎన్నికలకు చాలా ముందుగానే కెసిఆర్ వరంగల్‌లో, ఖమ్మంలో పర్యటించారు. వరంగల్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లతో పాటు పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.
మార్చి పదవ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. అయితే ఆ లోగానే ఖమ్మం, వరంగల్ ఎన్నికలు పూర్తి చేయాలని చూస్తున్నారు. దీనికి అవసరం అయిన ఏర్పాట్లు చేస్తున్నారు. షెడ్యూల్, విడుదల నామినేషన్ల దాఖలు మొత్తం ప్రక్రియ పదిహేను రోజుల్లో పూర్తి చేస్తారు.
ఎన్నికల ప్రక్రియ గడువును కుదిస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిఎం కెసిఆర్ 18, 19 తేదీల్లో వరంగల్‌లో పర్యటించి, పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వరంగల్‌కు సంబంధించి చేపట్టే ప్రాజెక్టులపైనా, ఇతర సమస్యలపైనా ముఖ్యమంత్రి సోమవారం అధికారులతో చర్చించారు. జిల్లా పర్యటనలో వాటిపై నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఇది జరిగిన ఒకటి రెండు రోజులకు అంటే...్ఫబ్రవరి 20 తరువాత ఒకటి రెండు రోజుల్లో ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుంది. మార్చి ఆరు ఏడవ తేదీ నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే విధంగా చూస్తున్నారు. ఆ వెంటనే అసెంబ్లీ సమావేశాలు జరపాలన్నది ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచన.