అక్షర

వస్తు వైవిధ్యం తొణికిసలాడిన కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అద్దంలో అటువైపు (కథలు)
-డా.యండమూరి
సత్యకమలేంద్రనాథ్
వెల: రు.120/-
ప్రచురణ: నవ సాహితి
బుక్‌హవుస్
ఏలూరు రోడ్డు, రామమందిరం వద్ద
విజయవాడ- 520 002
ఫోను: 0866-2432885

ఈ కథా సంపుటిలోని కథలలో అధిక భాగం ఇంతకుముందు పత్రికలలో ప్రచురింపబడినవేనని, పుస్తకానికి ముందుమాట రాసిన ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ తెలిపారు.
కథలలో వస్తు వైవిధ్యం బాగా ఉంది. కార్పొరేట్ స్కూళ్లలోనూ, కాలేజిలలోనూ పిల్లలు ఎటువంటి మానసిక ఒత్తిడికి లోనవుతుంటారో తెలిపే కథ ‘రాబందు’. విద్యాలయాలను జైళ్లతో పోల్చిన విధానం బాగుంది. మధ్యలో చదువుమానేసి ఇంటికి వస్తున్న పిల్లలవల్ల సైకియాట్రిస్టులకు ప్రాక్తీసు బాగా పెరుగుతున్నదన్న సంగతి ఆలోచించతగ్గది.
‘అద్దంలో అటువైపు’ కథ, డాక్టర్లకు కూడ కొన్ని స్వంత బాధ్యతలు, కుటుంబ సమస్యలు ఉంటుంటాయనే సంగతిని తెలియజేస్తుంది. కథ బాగుంది.
ఇల్లంటే నాలుగు గోడలు, తలుపులు, కిటికీలు మాత్రమే కాదు, అంతకుమించిన అనుబంధం కూడ ఉంటుందని తెలియజెప్పే కథ ‘పేయింగ్ గెస్ట్’. వెనుకటితరం వాళ్ల ఆలోచనలకూ, ఇప్పటి వాళ్ల ఆలోచనలకూ ఉన్న వైరుధ్యాన్ని ఈ కథ వెల్లడిస్తుంది. కార్పొరేట్ హాస్పిటల్సులో జరుగుతున్న దోపిడీ గురించి ‘్ధన్వంతరీ క్షమిస్తావా?’ కథ వివరిస్తుంది. వైద్య వృత్తిలో విలువలు తగ్గిపోతున్న సంగతిని ఈ కథలో ఆసక్తికరంగా తెలిపారు.
పుస్తకంలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది ‘అమ్మ’ కథ. చిన్న కథలోనే అద్భుతమైన భావాన్ని ఒలికించటం ఇందులో కనిపిస్తుంది. కథ ముగింపు బాగుంది. మానవ సంబంధాలలో మరో కొత్త కోణాన్ని దర్శింపజేసే ‘మేలిముసుగు’ కథ బాగుంది. తను చదువుకొని వృద్ధిలోకి రావటానికి అన్నివిధాలా తోడ్పడిన తన గ్రామ ప్రజలను చిన్నచూపు చూసిన ఇంజనీరు కథ.
‘ఊరు బతికే ఉంది’. రచయిత తీసుకున్న ఇతివృత్తం బాగుంది గాని, కథలో స్పష్టత లోపించింది. సహజత్వానికి మరీ దూరంగా ఉన్న కథగా ‘మన్మధలీల’ను చెప్పుకోవాలి.

-ఎం.వి.శాస్ర్తీ