అక్షర

వినూత్నంగా ‘రఘువంశం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాళిదాసుని రఘువంశము
(ప్రథమసర్గము)
-చింతగుంట సుబ్బారావు
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో

మహాకవి కాళిదాసు విరచిత రఘువంశ కావ్యాన్ని అనేక మంది కవి పండితులు ఆంధ్రానువాదంగావించారు. మల్లినాథసూరి వ్యాఖ్యానానికి అనువాదాలు కూడా చేసారు. వావిళ్లవారి ప్రచురణలు కూ డా బహుప్రసిద్ధం. ప్రస్థుత గ్రంథం చింతగుంట సుబ్బారావుగారిచే రచింపబడినది. వృత్తిరీత్యా నివృత్తి ఆంగ్ల భాషోపన్యాసకులు. ఎనభై సంవత్సరాల అనుభవాల్ని, 36 పుస్తకాలు వ్రాసిన నైపుణ్యాన్ని, పాండిత్యాన్ని గలపోసి వ్రాసిన గ్రంథం ఓ ప్రత్యేకతనే సంతరించుకొన్నదనటం అతిశయోక్తికాదు.
స్థాలీపులాకన్యాయాన్న ఏ శ్లోకాన్ని తీసుకొన్నప్పటికీ, రచయిత పారవశ్యంతో భావార్థాన్ని అందించిన వైనం అనన్య సామాన్యమే. తొలి శ్లోకమైన ‘విగర్ధావివ..’ని త్రిమూర్తుల జంటలు స్థుతిగా అన్వయించిన తీరు వీరి ప్రతిభకు తార్కాణం. పదాలకి అర్ధం వివరిస్తూ, సందర్భానుసారంగా లోతైన విశే్లషణను ఇచ్చారు. పాఠకులకు అధిక సమాచారాన్ని ఇచ్చి పఠనాసక్తిని పెంచుతూ వీరి రచన కొనసాగింది.
వాక్కు నాద రూపమైనది, అక్షర రూపమైనదనీ భావార్ధాన్ని చెప్తూనే మహేశ్వరయాత్ర ఆవిర్భావాన్ని వివరిస్తూ వాటికి పంచభూత తత్త్వాలకున్న సంబంధాన్ని వివరించారు. ‘సాగర’ శబ్దం వచ్చిన సందర్భంలో ‘సగరుని’ కథను క్లుప్తంగా అందించారు. ఈ విధంగా కేవలం అర్ధం ఇవ్వటం కాకుండా విశేష వివరణ దాదాపుగా అన్ని శ్లోకాలలోనూ అగుపడుతుంది.
ధనం, దానం, విద్యల ప్రస్తావన వచ్చినప్పుడు వాటి నిర్వచనాలు వాటి ప్రాశస్థ్యాన్ని ఎంతో చక్కగా వివరించారు.
వైవస్వతుని ప్రసక్తి వచ్చిన ఘట్టంలో 14 మనువులను పేర్కొనటం ‘ఇందు క్షీరనిధాలిత...’ అన్నప్పుడు, క్షీరసాగర మధనకథ, అందు ఉద్భవించిన 14 అమూల్య వస్తు శక్తిసంపదలను కవి పేర్కొన్నారు.
ఈ రచయిత లోగడ అందించిన కుమార సంభవానికి భావార్థాన్ని చదివిన పాఠకుల కోర్కెపై ఈ రచనను చేపట్టినట్లు రచయిత సుబ్బారావుగారు ముందుమాటలో పేర్కొన్నారు. ‘కాళిదాసుని రఘువంశ’ భావార్థాన్ని చదివినవారికి వీరి పూర్వరచనలు చదవాలనే కుతూహలం తప్పక కల్గుతుంది.

-బి.ఎస్.శర్మ