సబ్ ఫీచర్

విచక్షణ నేర్పని విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘విద్య’ వినయాన్ని పెంచి, ఆలోచనాశక్తినీ, వివేకాన్నీ, విచక్షణా జ్ఞానాన్నీ రేకెత్తిస్తుందనీ, ‘విశ్వవిద్యాలయాలు’ విజ్ఞాన కేంద్రాలనీ ఒకప్పటి భావన. చాలా కాలం క్రిందటే ఆ భ్రమలు తొలగిపోయినప్పటికీ- ఏదో ఆశ. ఇప్పుడు విశ్వవిద్యాలయాలు రాజకీయ కేంద్రాలు. కుల విద్వేషాలకీ, మత రాజకీయాలకీ ప్రధాన కేంద్రాలు. అటువంటి విశ్వవిద్యాలయాలనుంచీ, కళాశాలలనుంచీ బయటికి వచ్చిన వారినుండి సంస్కారం, విశాల దృక్పధం ఆశించడం వట్టి భ్రమ.రాజకీయ నాయకులు తాము మానవతావాదులమనీ, లౌకికవాదులమనీ గొంతెత్తి అరుస్తున్న మహానుభావులూ సమాజాన్నీ, దేశాన్నీ తమ అర్థంలేని ప్రసంగాలతో, ఉద్యమాలతో భ్రష్టుపట్టిస్తున్నామని ఎన్నటికీ గ్రహించలేరు. రాక్షసంగా అత్యాచారాలు చేసేవారికీ, ఉగ్రవాదంతో మానవ జీవితాలు అల్లకల్లోలం చేసే వారికీ, ఉద్యమాల పేరుతో విధ్వంసం, అరాచకాన్ని సృష్టించే విద్యావంతులకీ, అల్లరిమూకలకీ- శిక్షలు విధించినపుడల్లా- ఈ మానవతావాదులూ, లౌకిక వాదులూ చేసే రెచ్చగొట్టే ఉపన్యాసాలు చట్టా న్నీ, ధర్మాన్నీ కూడా హేళన చేస్తున్నాయి. చదువూ, సంధ్యలు లేనివాళ్ళు తప్పుచేస్తే శిక్ష పడటం న్యాయం అనుకుంటారు కానీ చదువుకున్న ఈ సంస్కారులకి అటువంటి అల్ప విషయాలు పట్టవు. వీరి దృష్టిలో అత్యాచారాలకీ, అన్యాయాలకీ గురయ్యేవారు ఏమైపోయినా ఫర్వాలేదు. నేరస్తులని మాత్రం శిక్షించకూడదు. మానవతావాదం అప్పుడు గుర్తొస్తుంది ఈ మహానుభావులకి. ఈ అన్యాయాన్ని ఎదిరించి మాట్లాడిన వారూ, ఇదేమి న్యాయమని ప్రశ్నించినవారూ మత ఛాందస వాదులు. ఇంతకంటే ఆటవిక న్యాయం ఇంకెక్కడుంది?
ఏ వ్యక్తిఅయినా మరణించడం అందునా ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. ఆ మరణించిన వారి కుల గోత్రాలు శోధించనక్కర్లేదు. దళితులకి అన్యాయం జరిగిందంటూ గగ్గోలుపెడుతున్న రాజకీయ పార్టీలు కానీ, మానవతావాదులు కానీ, సుశీల్‌కుమార్‌పైన దాడి జరిగి, అతను ఆస్పత్రిపాలైనపుడు ఎందుకు స్పందించలేదు? ఈ రాజకీయ పార్టీలన్నీ ఎందుకు నోరుమూసుకున్నాయి? ఈ ప్రొఫెసర్లందరూ ఎందుకు కిమ్మనలేదు? కేజ్రీవాల్‌లూ, అభిషేక్‌యాదవ్‌లూ, విద్యావేత్తలూ అప్పుడెందుకు నోరు మెదపలేదు? కానీ అప్పుడు గుర్తుకురాని ఉద్యమాలూ, విశ్వవిద్యాలయ అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం ఇప్పుడెందుకు హఠాత్తుగా గుర్తుకు వచ్చాయి? న్యాయం అందరికీ సమానమని ఈ మేధావులు ఉపన్యాసాలిస్తారుగా? అంటే ఉగ్రవాదులూ, దళితులూ, మావోయిస్టులూ, నరహంతకులూ ఎన్ని భయంకరమైన నేరాలుచేసినా వారిని వదిలెయ్యాలి. శిక్షలనుండి వారికి రిజర్వేషన్ కల్పించాలి. అగ్రవర్ణాల వారినీ, ఆడవారినీ, పసివాళ్ళనీ బలిచెయ్యాలి. ఎంత గొప్ప న్యాయం?
అంబేద్కర్ నామస్మరణ చేస్తున్న వారందరూ నిజంగా ఆయన ఆశయాలు పాటిస్తున్నారా? అగ్రవర్ణాల అహంకారాన్నీ, నిరంకుశత్వాన్నీ పదే పదే విమర్శించే మేధావులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవడం మంచిది. అంబేద్కర్‌కి చేయూతనిచ్చి, అతడు ఉన్నతపథాలకి చేరుకోవడానికి కారణం అగ్రవర్ణాల వారే. ఎందరో అగ్రవర్ణాలవారు అంటరానితనాన్ని నిర్మూలించడానికి అహర్నిశలూ పాటుపడ్డారు. వారెవరూ ఈ మేధావులకి గుర్తుకి రారెందుకు? దళితులమని చెప్పుకుంటున్నవారు తమలో తాము కులభేదాలు పాటించడం లేదని చెప్పగలరా? వారిలోవారు కులాంతర వివాహాలకి అంగీకరిస్తున్నారా? అందువల్ల మేధావులూ- సమసమాజ స్థాపన కంటే కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కాదు. అరాచకశక్తులని వెనకేసుకు రావడమూ కాదు. చేతనైతే విద్యార్థులమధ్య సుహృద్భావాన్ని పెంపొందించడానికీ సమస్యలు సామరస్యంగా పరిష్కరించబడి విద్యాలయాల్లో ప్రశాంత వాతావరణం ఏర్పడటానికి కృషిచేయండి. అది చేతకాకపోతే- ఆదర్శాలు వల్లిస్తూ, ఆచరణలో పెట్టకుండా కాలం గడిపెయ్యండి. సమాజం కాస్త బాగుపడుతుంది.

- మహీధర్ సుగుణ