రాష్ట్రీయం

విద్య, వైద్యానికే తొలి ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 26: రానున్న బడ్జెట్‌లో విద్య, వైద్యం, సాంఘిక సంక్షేమ శాఖలకే పెద్ద పీట వేస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. రెండు రోజులుగా ఆయన వివిధ మంత్రిత్వశాఖ అధికారులతో చర్చలు జరపుతూ బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందిస్తున్నారు. వైద్య విభాగానికి సంబంధించి కాంట్రాక్టు పద్ధతిలో 501 మంది డాక్టర్లను, వెయ్యి మంది నర్సులను నియమించాలని కూడా బడ్జెట్ ప్రతిపాదనల సందర్భంగా నిర్ణయించారు. అదే విధంగా నూతన పారిశుద్ధ్య విధానానికి అనుగుణంగా నిధులను పెంచాలని నిర్ణయించారు. వైద్యశాఖ, దేవాదాయ శాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా ఆయుష్, యోగా, నేచురోపతి కేంద్రాలను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన హాస్టళ్లలో మెస్ చార్జీలను 10 శాతం పెంచాలని నిర్ణయించారు. స్కాలర్‌షిప్‌లను ఏ నెలకు ఆ నెల చెల్లించేలా కూడా బడ్జెట్ కేటాయింపులు ఉండాలని అన్నారు. 2016-17 విద్యాసంవత్సరానికి హాస్టళ్లు అన్నింటినీ రెసిడెన్షియల్ హాస్టళ్లుగా మార్చాలని కూడా నిర్ణయించారు. ప్రైవేటు భవనాల్లో నడుస్తున్న హాస్టళ్లు అన్నింటికీ స్వంత భవనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొత్త స్కాలర్‌షాప్‌లకు సంబంధించి విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరంలో చేరిన వారికి సెప్టెంబర్ మాసంలో రెన్యువల్ చేయాల్సిన స్కాలర్‌షిప్‌లు జూలై 1వ తేదీ నుండి మొదలుపెట్టాలని, స్కాలర్‌షిప్‌లను ఏ నెలకు సంబంధించినవి అదే నెలలో చెల్లించాలని నిర్ణయించారు. వీటితో పాటు అనేక శాఖలకు సంబంధించిన వివిధ అంశాలపై కూడా పూర్తి స్థాయిలో సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సమీక్ష నిర్వహించారు.