విశాఖపట్నం

ఆనంద్ మృతి పట్ల సంతాపాలు....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 26:రాజకీయాల్లో నిబద్దతకు మారుపేరైన పూసపాటి ఆనంద గజపతి రాజు మృతి తీరని లోటని పలువురు నాయకులు అన్నారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచిన ఆనంద్ మృతి పట్ల పలువురు నాయకులు తమ తీవ్ర దిగ్భ్రాంతి, వారి కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ తనతో పాటు తెలుగుదేశం పార్టీ తరపున రాజకీయాల్లోకి వచ్చిన ఆనంద్ మంత్రిగా తనదైన ముద్ర వేశారన్నారు. ముక్కుసూటిగా వ్యవహరించే ఆనంద్ వంటి నాయకులను కోల్పోవడం తీరని లోటని అన్నారు. ముఖ్యంగా పూసపాటి వంశీయుల ధాతృత్వాన్ని ఒంటపట్టించుకున్న ఆనందగజపతి గొప్ప దాతగా అభివర్ణించారు.
ఎంపి సుబ్బరామిరెడ్డి
మాజీ ఎంపి, రాష్ట్ర మంత్రి ఆనంద గజపతి రాజు అకాల మరణం రాజకీయ, ఆధ్యాత్మిక రంగానికి తీనిలోటని రాజ్యసభ సభ్యుడు టి సుబ్బరామిరెడ్డి అన్నారు. ఆనంద్ మరణ వార్తతో తాను తీవ్ర దిగ్భ్రాంతిగి గురైనట్టు ఒక ప్రకటనలో తెలిపారు. ధాతృత్వంలో విశాఖ, విజయనగరం జిల్లాలకు చెందిన ప్రజల మనసుల్లో పూసపాటి వంశం చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. ఆయన మృతి పట్ల సంతాపాన్ని తెలియజేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మాజీ మంత్రి ఆనందగజపతి రాజు మృతి పట్ల జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, రాజకీయ పార్టీల నాయకులు తమ సంతాపాన్ని తెలిపారు. ఆనంద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఎమ్మెల్యేలు పిజివిఆర్ నాయుడు (గణబాబు) వాసుపల్లి గణేష్‌కుమార్, పల్లా శ్రీనివాస్, పి విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణబాబు, బండారు సత్యనారాయణ మూర్తి, ఎమ్మెల్సీ ఎంవివి మూర్తి, మాజీ ఎమ్మెల్యేలు ద్రోణంరాజు శ్రీనివాస్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు తదితరులు ఆనందగజపతి రాజు మృతి పట్ల సంతాపాన్ని తెలిపారు.