విశాఖపట్నం

పెద్ద నోట్ల రద్దుపై విపక్షాల నిరసన గళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి(నెహ్రూచౌక్), నవంబర్ 28:ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేవరకు ఏకపక్షంగా రద్దుచేసిన 500, 1000 నోట్లను అనుమతించాలని, రెండు వేల నోట్లు రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం వామపక్షాల ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ వైసీపి అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు మాట్లాడుతూ విదేశాల్లోను స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లకుబేరుల డబ్బు సుమారు 80 లక్షల కోట్ల రూపాయలు మూలుగుతున్నప్పటికీ వారి జాబితాను వెల్లడించకుండా వారికి కొమ్ము కాస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేకపాలన కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయంతో ఉన్నపళంగా పెద్దనోట్లు రద్దుచేయడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు వేల నోటు వలన ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదని ఆ నోట్లు నల్లకుబేరులకు దాచుకోవడానికి అనుకూలంగా ఉంటుందన్నారు. పెద్దనోట్లు రద్దుచేయడం వలన గత మూడు వారాలుగా పేద, మధ్యతరగతి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు.
సిపిఎం నాయకులు ఏ బాలకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రత్యేక హోదాపై ప్రజల దృష్టిని మళ్లించడానికి పెద్దనోట్ల రద్దును తెరపైకి తీసుకొచ్చారన్నారు. ఎన్నిక సమయంలో నరేంద్ర మోదీ ప్రజలకు ఇచ్చిన హామీప్రకారం నల్లకుబేరులను వెలికితీసి పేద ప్రజలకు పంచాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఐ, సిపిఎం, వైసిపిల ఆధ్వర్యంలో పార్టీ జెండాలతో పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి తహశీల్దార్ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి పట్టణ ప్రధాన కార్యదర్శి సూరిశెట్టి రమణ అప్పారావు, జాజులు రమేష్, కుండల రామకృష్ణ, నారపిన్ని చంద్రశేఖర్, పిడి గాందీ, వేడువాక నారాయణరావు, ఒమ్మి రాముయాదవ్, సిపిఐ నాయకులు మేకా సత్యనారాయణ, కోరుబిల్లి శంర్రావు, శ్రీరాందాస్ అబ్బులు, కర్రి సూర్యనారాయణ, ఏఐటియుసి నాయకులు కోన లక్ష్మణ, కనిశెట్టి సురేష్‌బాబు, బుద్ద శ్రీనువాసరావు, బుగిడ నూక అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
నర్సీపట్నంలో
నర్సీపట్నం: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రెండువేల రూపాయల నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో చిల్లర నోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సి.పి. ఐ, సి.పి.ఎం. పార్టీల నాయకులు, కార్యకర్తలు ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఈ సందర్భంగా సి.పి.ఐ.కు చెందిన 15 మంది, సి.పి.ఎం.కు చెందిన ఇద్దరు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సి.పి.ఐ. జిల్లా సహాయ కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కూడలి వద్ద రాస్తారోకో చేశారు. ఈవిషయం తెలుసుకున్న పట్టణ సి.ఐ. ఆర్.వి. ఆర్.కె.చౌదరి సిబ్బందితో ఆర్టీసి కూడలికి చేరుకుని రాస్తారోకోకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. సి.పి.ఐ. నాయకులు ఆందోళన కొనసాగించడంతో బాలేపల్లి వెంకటరమణ, జి.గురుబాబు, రుత్తల బుజ్జి, శివలంక కొండలరావుతోపాటు మరో 10 మందిని అరెస్ట్ చేశారు. అలాగే సి.పి.ఎం. ఆధ్వర్యంలో చిల్లరి నోట్లును అందుబాటులోకి తీసుకురావాలని, అప్పటి వరకు పాత నోట్లను అనుమతించాలని డిమాండ్ చేస్తూ సి.పి.ఎం. ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ చేస్తున్న సి.పి.ఎం. నాయకులు డి.సత్తిబాబు, ఆర్.ఎ.నాయుడులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. వైసిపి ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక సి.బి.ఎం. కాంపౌండ్ నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీ కృష్ణాబజార్, అబీద్ సెంటర్, శ్రీకన్య కూడలి మీదుగా పెదబొడ్డేపల్లి జంక్షన్ వరకు సాగింది. తిరిగి ఆర్టీసీ కూడలికి చేరుకుని అక్కడ వారంతా మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సి.పి. నియోజకవర్గం కన్వీనర్ పెట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ పెద్దనోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తక్షణమే చిల్లర నోట్లను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో పార్టీ నాయకులు కోనేటి రామకృష్ణ,రుత్తల సత్యనారాయణ, రాయపురెడ్డి నాగేశ్వరరావు, అంకంరెడ్డి జమీలు, సుర్ల సత్యనారాయణ, గొలుసు నర్సింహమూర్తి, గుడిబండ నాగేశ్వరరావు, లచ్చబాబు, పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
* రైతులకు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సూచన
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, నవంబర్ 28: జిల్లాలో ప్రభుత్వపరంగా పాడి రైతులకు అందజేసిన వివిధ ప్రభుత్వ పథకాలు క్షీరసాగరం, సునందిని, సుఫలం, ఊరూర పశుగ్రాస క్షేత్రాలు మొదలైనటువంటి పథకాలు అర్హులైన అంతా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. సోమవారం జిల్లాప్రజాపరిషత్ సమావేశ మందిరంలో విశాఖ జిల్లా అభ్యుద్య పాడి రైతుల అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాల ఉత్పత్తిలో రెండు అంకెల అభివృద్ధి తీసుకురావడానికి ప్రభుత్వం అనేక విధి విధానాలు నిర్వహించిందన్నారు. క్రెడిట్ లింకేజ్ రైతు ఉత్పాదక సంఘాల గురించి ఇప్పటికే పాడి రైతులతో చర్చించామన్నారు. పాడి రైతులు సూచనలు, అధికారులు సలహాలు గురించి పూర్తిగా అవగాహన కల్పించడం కోసం ఎటువంటి సదస్సులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. అభివృద్ధి, లక్ష్యసాధన దిశగా ఆలోచించి మళ్ళీ 2,3 తేదీల్లో ఇటువంటి సదస్సులు నిర్వహిస్తామని అలాగే ప్రణాళిక పరంగా మనం ముందుకు వెళ్ళడమే ముఖ్య ఉద్దేశమన్నారు. జెసి-2 డి.వెంకటరెడ్డి మాట్లాడుతూ పాడి రైతులకు అవసరాలకు అనుగుణంగా ప్రణాళికబద్ధంగా బ్యాంకు రుణాలు మంజూరుకు అన్ని చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. పశువుల వసతి గృహం ఇప్పటికే కొయ్యూరు మండలం నల్గొండ గ్రామంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. పశుసంవర్ధకశాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ పశువుల్లో ఉత్పాదికశక్తి లాభదాయకంగా ఉంచుకోవడానికి జిల్లాలో 14,040 మంది పాడి రైతులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని, అలాగే పాడి పశువులకు అంటువ్యాధులు రాకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్టు జెడి తెలిపారు. పశుగ్రాస భద్రతలో భాగంగా ఊరూర పశుగ్రాస క్షేత్రాలు పశుగ్రాసాన్ని నిల్వ చేసుకోవడానికి సైలో టవర్లు, ఆజోల పెంపకం, సైలో బంకర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నాబా ర్డు ఏజిఎం ప్రసాద్ మాట్లాడుతూ పశుసంవర్ధకశాఖ నుండి వచ్చిన జాబితాలను పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందజేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుత సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులను మాత్రమే రుణాలు మంజూరు చేయనున్నట్టు తెలిపారు. ఎల్‌డిం శరత్‌బాబు, ఏడి మురళి, నిట్‌క్యాప్ రమణమూర్తి తదితర అధికారులు సూచనలు, సలహాలు ఇచ్చి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సదస్సులో డిఆర్‌డిఏ ఏపిడి మోహన్‌రావు, పశుసంవర్ధక శాఖ డిడిలు, ఏడిలు జిల్లాలోని 200 మంది పాడి రైతులు పాల్గొన్నారు.

2019లోనూ టిడిపిదే విజయం

సబ్బవరం, నవంబర్ 28: 2019 జరిగే సాధారణ ఎన్నికల్లోనూ తమ తెలుగుదేశం పార్టీ తిరుగులేని విజయం సాధిస్తుందని, వైఎస్‌ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రతిపక్షంలోనే కూర్చుంటాడని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి జోస్యం చెప్పారు. సోమవారం మండలంలో జనచైతన్యయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన స్థానిక రోడ్లు, భవనాలశాఖ అతిథి గృహంలో విలేఖర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ ప్రముఖ దినపత్రికలో వచ్చిన ఎన్నికల సర్వేపై ఆయన స్పందిస్తూ ఇలాంటి సర్వేలు గతంలో కూడా వచ్చాయని అవన్నీ సత్యంగానిలిచాయన్నారు. అయితే తమ ఊహాజనితంగా మాట్లాడం లేదని, తమ పార్టీ నిరుపేదలు, మహిళల కోసం అమలు చేస్తున్న అనేక రకాలయిన సంక్షేమ పథకాలే రాబోయే ఎన్నికల్లో విజయానికి సోపానాలు కాగలవన్నారు. పెద్దనోట్ల ప్రభావం ప్రజలపై ఏ మాత్రం ఉండదని అన్నీ సర్దుకుంటాయన్నారు. నల్లకుబేరుల వద్ద ధనం ఇప్పుడే వెలుగులోకి వస్తోందన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి రాజకీయ అవగాహనా రాహిత్యం వల్ల ఆ పార్టీ మనుగడ ఇప్పటికే తగ్గిపోయిందన్నారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన టెక్నాలజీతో సామాన్యుడు సైతం ఆధునికత వైపు దృష్టిసారిస్తున్నాడన్నారు. మహిళలకు, రైతులకు రుణమాఫీలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆయన చేసిన సేవలు ప్రజలకు గుర్తుండిపోతాయన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకపోయినప్పటికీ ప్రత్యే క మైన ప్యాకేజీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలుగా ఆదుకుంటుందనే విశ్వాసం ఉందన్నారు. ఈ సమావేశంలో మండల టిడిపి నేతలు బుచ్చిరాజు,కోరాడ శ్రీనివాసరావు, దొడ్డిప్రకాశరావు, భరిణికాన సాయినాథరావు, గండి దేముడు, కె.గడ్డప్ప పాల్గొన్నారు.

క్రీడలతో మానసిక ఉల్లాసం
ప్రారంభమైన జాతీయ పోలీసు వాలీబాల్ క్రీడా పోటీలు
లాంఛనంగా ప్రారంభించిన హోం మంత్రి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, నవంబర్ 28: అఖిల భారత పోలీస్ వాలీబాల్ క్లస్టర్ చాంపియన్ షిప్ 2016 పోటీలు విశాఖ పోర్టు స్టేడియంలో సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ముఖ్యఅతిథిగా పోలీసు వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసానికి దోహదం చేస్తాయని అన్నారు. ముఖ్యంగా వృత్తి పరంగా విపరీతమైన ఒత్తిడికి గురయ్యే పోలీసు సిబ్బందికి క్రీడలు, యోగా వంటివి ఎంతో మేలుచేస్తాయన్నారు. దేశ వ్యాప్తంగా 37 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి పోలీసు జట్లు పోటీల్లో పాల్గొనడం ముదావహమని అన్నారు. అలాగే ప్రతి నిత్యం యోగా సాధన చేయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని, మానసిక ఒత్తిడి దూరమమవుతుందని అన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ క్రీడలకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. మూడు రోజుల కిందట నగరంలో జాతీయ జూనియర్ అథ్లెటిక మీట్ నిర్వహించుకున్నామని తెలిపారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా విశాఖలో జాతీయ క్రీడలను నిర్వహించామన్నారు. క్రీడలకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు. డిజిపి ఎన్ సాంబశివరావు మాట్లాడుతూ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో జాతీయ స్థాయి పోలీసు క్రీడలను నిర్వహించుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. క్రీడా పోటీలు ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ జిల్లాలకు చెందిన పోలీసు జట్లు పలు విన్యాసాలను ప్రదర్శించారు. మోటార్ సైకిళ్లు, జీపులతో ఎపి పోలీస్ బెటాలియన్ సిబ్బంది నిర్వహించిన విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచాయి. అలాగే అసోం పోలీస్ జట్టు ఆధ్వర్యంలో రత్నాశ్వర్ నియోగ్ తన జట్టు సభ్యులతో 32 టన్నుల బరువుగల వ్యానును అవలీలగా లాగి ఆహుతులను అలరించారు. గతంలో ఇదే ఫీట్‌తో రత్నాశ్వర్ లిమ్కాబుక్ రికార్డును కైవసం చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూర్తి, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ మూర్తి, పల్లా శ్రీనివాస్, పి విష్ణుకుమార్ రాజు, గిడ్డి ఈశ్వరి, నగర పోలీసు కమిషనర్ టి యోగానంద్, ఐజి ఆర్‌కె మీనా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

నయనానందం అనంతుని
కొండమెట్ల దీపోత్సవం
పద్మనాభం, నవంబర్ 28 : గోస్తనీ నదీ తీరాన పద్మనాభం పుణ్యక్షేత్రంలో అత్యంత ఎత్తయిన గిరిపై కొలువుదీరి ఉన్న శ్రీఅనంత పద్మనాభ స్వామి కొండ మెట్ల దీపోత్సవం సోమవారం సంధ్యావేళలో అత్యద్భుతంగా నిర్వహించారు. ప్రత్యేకతను సంతరించుకున్న ఈ దీపోత్సవాన్ని వీక్షించడానికి ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అనంతుని గిరి దిగువ భాగం నుంచి పైవరకు సుమారు 1285 మెట్లకిరువైపుల భక్తులు దీపాలంకరణ చేసి హైందవ సంప్రదాయ విశిష్టతను వ్యాపింపజేశారు. అయితే భక్తులు ఉదయానికే పద్మనాభంకి చేరుకొని అనంతుని గిరి మెట్టుమెట్టుకి పసుపు, కుంకుమ బొట్లు పెడుతూ అధిరోహించి అనంతునికి విశేష పూజలు చేశారు. సాయంత్రం కుంతీ మాధవస్వామి ఆలయం నుంచి శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీ అనంత పద్మనాభ స్వామిని గరుడ వాహనంపై తోడ్కొని వచ్చి గిరి మొదటి పావంచా వద్ద పూలమాలలతో ఏర్పాటు చేసిన పచ్చని పందిరిలో ఆశీనులను చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు సీతారామాంజనేయస్వామి ఆచార్యులు విశేష పూజలు చేసిన అనంతరం భక్తులు స్వామిని దర్శించుకొని కొండను అధిరోహించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త అశోకగజపతిరాజు సతీమణి సునీల్ గజపతి రాజు స్వామికి పూజులు చేసి సాంప్రదాయం ప్రకారం అయిదున్నర గంటలకు జేగంట మోగగానే సునీల్ గజపతిరాజు కార్తీక దీపాన్ని వెలిగించారు. అనంతరం అప్పటి వరకు వేచి ఉన్న భక్తులు దీపాలు వెలిగించారు. ఒక్కసారిగా దీపకాంతులు ఆకాశాన్ని అంటాయి. అనంతరం మంత్రి గంటా శ్రీనువాసరావు స్వామికి పూజులు చేశా రు. సుమారు రెండు లక్షల మంది భక్తులు వచ్చారని ఆలయ అధికారులు తెలిపారు. పద్మనాభం పురవీధులు భక్తులతో కిక్కిరిసి పోయాయి. అయితే భోగాపురానికి చెందిన టి.ఉష కొండ మెట్లు ఎక్కుతుండగా జారి పడిపోవడంతో కాలికి తీవ్ర గాయాలయ్యాయి. చికత్స నిమిత్తం 108 వాహనం ద్వారా విజయనగరం ఆసుపత్రికి తరలించారు.

పోలవరంతో ఏపీకి నీటి సౌకర్యం పుష్కలం
సబ్బవరం, నవంబర్ 28: పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల రైతులకు సాగునీటితోపాటు ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు తాగునీటి కొరత కూడా తీరుతుందని జిల్లా తెలుగుదేశంపార్టీ (రూరల్) అధ్యక్షులు, ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు అన్నారు. సోమవారం మండలంలోని పెదగొల్లలపాలెంలో నిర్వహించిన జన చైతన్యయాత్రలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును కాంగ్రెసు పార్టీ హయాం లో ప్రారంభించినప్పటికీ ముడుపుల బాగోతంతోనే పనులు నిలిచిపోయాయన్నారు. కానీ ప్రస్తుత ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు పట్టువదలని విక్రమార్కుడిలా ఆ ప్రాజెక్టుపనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అంకితం చేయాలని చూస్తున్నారని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఉత్తరాం ధ్ర జిల్లాలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సబ్బవరం విద్యాహబ్ వల్ల ప్రపంచ చిత్రపటంలో స్థానం సంపాదించారన్నారు.అంతకు ముందు పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ళలో సుమారు 5కోట్ల రూపాయల అభివృద్థి పనులు చేపట్టామన్నారు.రైతులకు ఎంతో ప్రయో జం చేకూర్చే రాయపురాజు చెరువుపూడిక తీత ఆధునీకరణ పనులకోసం 1.70కోట్ల రూపాయలు ఎన్టీపిసి సిఎస్‌ఆర్ నిధులతో పనులు ప్రారంభిస్తే మధ్య లో కాంట్రాక్టర్ పనులు నిలిపేశాడని, మళ్ళీ రైతుల భాగస్వామ్యంతోనే ఆ పనులు పూర్తిచేస్తామన్నారు.ఈ పర్యటనలోజడ్పీటిసి గేదెల సత్యనారాయణ, గండిదేముడు, తెలుగుదేశంపార్టీనేతలు మోపాడ గంగరాజు, దాసరి రమణ, అమృతపురం ఎంపిటిసి సింగంపల్లి శ్రీనివాసరావు, బొబ్బరి కన్నారావు, కోరాడ శ్రీనివాసరావు, దొడ్డిప్రకాశ్, బుచ్చిరాజు, భరిణికాన సాయినాధరావు, గవర అప్పారావు, కె.గడ్డప్ప, కరణం రామనాయుడులు పాల్గొన్నారు.

వచ్చే నెల చూసుకుందాం
*ఈసారికి అరువుపై రేషన్*యంత్రాంగం వినూత్న చొరవ*కార్డుదారులకు ఊరట
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, నవంబర్ 28: పెద్దనోట్ల రద్దు నేపధ్యంలో దేశంలోనే కాకుండా జిల్లాలోనూ నోట్ల కొరత తీవ్రస్దాయికి చేరిన పరిస్దితుల్లో సామాన్య ప్రజానీకాన్ని ఆదుకునేందుకు జిల్లా యంత్రాంగం వినూత్న రీతిలో చొరవ చూపించింది. డిసెంబర్ నెల రేషన్ సరుకులను అరువుపై ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఈలెక్కలన్నీ జనవరిలో చూసుకోవచ్చునన్న ఉద్దేశ్యంతో ఈనిర్ణయాన్ని చేపట్టడం విశేషం. అయితే కార్డుదారులపరంగా చూస్తే ఈ నిర్ణయం ఎంతో ఊరటను, పూర్తి వెసులుబాటును అందించనుందనే చెప్పాలి. వాస్తవానికి పెద్దనోట్ల రద్దుతో దాదాపుగా మార్కెట్ కుదేలైన పరిస్దితి కన్పిస్తోంది. చాలాచోట్ల చిన్ననోట్లు లేక కొంతమంది వ్యాపారాలు కూడా మానుకున్నారు. మరోవైపు జనం వద్ద కూడా అత్యవసర ఖర్చులకు తప్ప ఇతరత్రా కొనుగోళ్లకు పెద్దగా నగదు లేకుండా పోయింది. నిర్ణయం వెలువడి వారాలు గడుస్తున్నా పరిస్దితి పూర్తిగా అదుపులోకి రాకపోవటంతో ఈవారంలో ఈపరిస్ధితులు సాధారణ స్ధాయికి చేరే అవకాశాలు తక్కువగా ఉన్న పరిస్దితుల్లో వచ్చే నెల మొదట్లో ఎలా అన్న ప్రశ్న ప్రతి కుటుంబాన్ని వెంటాడుతోంది. ఇలాంటి పరిస్దితుల్లో జిల్లా యంత్రాంగం చొరవ చూపి సామాన్య కుటుంబాల్లో ప్రధానంగా ఆధారపడే రేషన్‌సరుకుల విషయంలో భారీ వెసులుబాటును కల్పించింది. ప్రస్తుతం నోట్ల పరిస్దితి ఆస్తవ్యస్ధంగా ఉండటంతో జనం వద్ద కూడా అంతగా నగదు లేని పరిస్దితుల్లో రేషన్ దుకాణాల్లో డిసెంబర్ నెల రేషన్‌ను అరువుపై ఇవ్వాలని కీలకమైన నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాకు సంబంధించి పరిశీలిస్తే పది నుంచి 13లక్షల కుటుంబాలకు పైగా వెసులుబాటు కలగనుంది. దానికి మించి నోట్ల ఇబ్బందులను తొలగించటమే కాకుండా ఆమేరకు రేషన్ దుకాణాల్లో డిసెంబర్ నెలకు సంబంధించి రేషన్‌సరుకులు, ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఇతర వస్తువులను తీసుకునే వెసులుబాటు కలగటంతో ఈనెల జరుగుబాటుకు సామాన్య కుటుంబాలకు ఢోకా లేకుండా పోయింది. జిల్లా జాయింట్ కలెక్టరు పి కోటేశ్వరరావు, డిఎస్‌ఓ డి శివశంకర్‌రెడ్డిలు గత రెండురోజుల నుంచి ఈ విధానంపై పూర్తిస్ధాయి అధ్యయనం నిర్వహించి ఈ కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. డిసెంబర్ నెల రేషన్‌సరుకులను కార్డుదారులందరికి అరువుపై అందించి ఆ మొత్తాలను జనవరిలో సర్దుబాటు చేసుకుంటారు.
డిఎస్‌ఓగా సయ్యద్ యాసిన్
అనంతపురం డిఎంగా శివశంకర్‌రెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, నవంబర్ 28: జిల్లా పౌరసరఫరాల అధికారిగా సయ్యద్ యాసిన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన విజయవాడలోని సివిల్ సప్లయిస్ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టరుగా పనిచేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఇక్కడ డిఎస్‌ఓగా పనిచేస్తున్న డి శివశంకర్‌రెడ్డిని అనంతపురం జిల్లా సివిల్ సప్లయిస్ మేనేజరుగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. గత మూడుసంవత్సరాలుగా డిఎస్‌ఓగా పనిచేస్తున్న శివశంకర్‌రెడ్డి సమర్ధుడైన అధికారిగా పేరుగాంచారు. పౌరపంపిణి వ్యవస్ధ సక్రమంగా నడిచేందుకు ఆయన హయాంలో పలు కీలక చర్యలు చేపట్టారు.

ఎస్సీ బాలికల వసతిగృహంలో కలుషిత ఆహారంతో
25 మంది విద్యార్థినులకు అస్వస్థత
భీమడోలు, నవంబర్ 28: భీమడోలు గ్రామంలోని ఎస్సీ బాలికల వసతిగృహంలో సోమవారం సాయంత్రం కలుషిత ఆహారం తిని 25మంది విద్యార్ధినులు ఆస్వస్ధతకు గురికాగా భీమడోలు ప్రాధమిక ఆరోగ్యకేంద్రంలో వారికి చికిత్స చేశారు. ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఆసుపత్రికి వచ్చి విద్యార్ధినులకు ధైర్యం చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్సీ బాలికల వసతిగృహంలో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు 140 మంది విద్యార్ధినులు ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం విద్యార్ధినులకు వసతిగృహంలో ఎగ్ బిర్యానీ ఆహారంగా ఇచ్చారు. కురెళ్లగూడెం గ్రామంలోని ఒక కుటుంబానికి చెందిన వారు ఫంక్షన్ ఏర్పాటుచేసుకోవటంతో అక్కడ నుంచి విద్యార్ధినులకు బిర్యానీ, పాలక్‌ఫన్నీరు కూరను పంపారు. సాయంత్రం సమయంలో విద్యార్ధినులు తిన్నారు. సోమవారం పాఠశాలకు వెళ్లిన విద్యార్ధినులు సాయంత్రం తిరిగి హాస్టల్‌కు రాగా కొంతమంది ఆస్వస్ధతకు గురయ్యారు. హుటహుటిన వారిని పక్కనే ఉన్న సామాజిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. వీరిలో 15మందికి సైలెన్లు పెట్టగా, పదిమందికి సాధారణ చికిత్స అందించి పంపించివేశారు. ఉంగుటూరు ఎమ్మెల్యేతోపాటు ఎఎంసి ఛైర్మన్ పుల్లయ్యనాయుడు, జడ్పీటీసీ పెద్దిరాజు, యలమర్తి నాని, యుగంధర్, పలువురు ప్రజాప్రతినిధులు ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. బయట వ్యక్తులు పంపే ఆహారాన్ని తీసుకోవద్దని ఎమ్మెల్యే గన్ని వార్డెన్ అరుణకు సూచించారు. ఆసుపత్రి వైద్యులు డాక్టరు నిర్మలాగ్లోరి, రామలక్ష్మి తదితరులు వైద్యసేవలు అందించారు.

భక్తులతో పోటెత్తిన
సోమారామం
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, నవంబర్ 28: పంచారామక్షేత్రాల్లో ఒకటైన శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చారు. కార్తీకమాసంలోని ఆఖరి సోమవారం కావడంతో భక్తులు కిటకిటలాడారు. ఆలయం ముందు బారులు తీరారు. అన్నదానం వద్ద కూడ భక్తులు ఇక్కట్లు పడ్డారు. స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరించి తరించారు.
భీమవరం మున్సిపాల్టీలో మురుగునీటి శుద్దికి ఎస్‌టిపిలు
ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించిన ఛీఫ్ ఇంజనీర్
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, నవంబర్ 28: జిల్లాలోని సూయిజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఎస్‌టిపి)లను ఏర్పాటుచేసే తొలి పురపాలక సంఘం భీమవరం కానుంది. ఈ ఎస్‌టిపిలతో మురుగునీరు శుద్ది చేసిన తర్వాతే బయటకు విడుదల చేస్తారు.దీంతో భీమవరం పురపాలక సంఘం కాలుష్య రహిత పట్టణంగా మారనుంది. కాలుష్యాన్ని నియంత్రించేందుకు ముందు నీటి నుంచి ఈ చర్యలు ప్రారంభించారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఛైర్మన్ కొటికలపూడి గోవిందరావులు సంయుక్తంగా పట్టణాన్ని అభివృద్ధి చేసే దిశలో ఉన్న నేపధ్యంలో ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి వారి సలహాలు, సూచనలు అమలుచేసేందుకు వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. గతంలోనే యనమదుర్రు డ్రెయిన్ కాలుష్యం అయిపోయిందని, ఇందులో తాను కూడా నీటిని తాగి దాహార్తిని తీర్చుకున్న వాడినని, ఇటువంటి డ్రెయిన్ కాలుష్యం కావడం వల్ల భీమవరం పట్టణంతో పాటు కింది గ్రామాలు కాలుష్యమయిపోయాయని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇదిలా ఉండగా సోమవారం ఛీఫ్ ఇంజనీర్ (పబ్లిక్ హెల్త్) మోజెస్ కుమార్ భీమవరం పట్టణానికి వచ్చారు. ఆయనను మున్సిపల్ ఛైర్మన్ కొటికలపూడి గోవిందరావు, వైస్ చైర్మన్ ముదునూరి సూర్యనారాయణరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. కమిషనర్ సిహెచ్ నాగనర్సింహారావు ఆయనను కలిసారు. పట్టణంలోని 82 ఎకరాలను పరిశీలించారు. ఇక్కడ మంచి గృహ నిర్మాణం రానున్నందున ముందుగానే ప్రణాళికాబద్దంగా ఎస్‌టిపిని ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. పాత యనమదుర్రు డ్రెయిన్‌ను పరిశీలించి తప్పని సరిగా ఇక్కడ మరొకటి ఏర్పాటు చేయాలన్నారు. త్రీటౌన్ ఏరియాలో మరొకటి ఏర్పాటుచేస్తే పట్టణంలో మురుగునీరు శుద్ది చేసిన తర్వాత విడుదల చేయడానికి బాగుంటుందని తెలిపారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమిషనర్ సిహెచ్ నాగనర్సింహరావును ఆదేశించారు. అలాగే పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. చినరంగనిపాలెంలో సైఫన్‌ను పరిశీలించారు. ఆయన వెంట ఇఇ కార్తీక్, ఎంఇ ప్రభాకర్, డిఇ శ్రీకాంత్ ఎఇలు ఉన్నారు.
ఆన్‌లైన్ విధానంలో పటిష్టమైన కోడింగ్
కలెక్టర్ భాస్కర్
ఏలూరు, నవంబర్ 28: జిల్లాలో డిజిటల్ సంతకాలను ఫోర్జరీ చేసి అక్రమాలకు పాల్పడకుండా ఆన్‌లైన్ విధానంలో పటిష్టమైన కోడింగ్ ఏర్పాటుచేస్తామని కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ చెప్పారు. స్ధానిక కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా స్ధాయి అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన బయోమెట్రిక్ హాజరు, మీకోసం, ఆన్‌లైన్ ఫైల్స్ తదితర అంశాలపై సమీక్షించారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్ది ఆక్రమాలకు ఏవిధంగా పాల్పడవచ్చోనన్న ఆలోచించేవారు కూడా అధికమయ్యారని, డిజిటల్ కీ ద్వారా ఫైల్స్‌ను పరిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయాలను కొంతమంది ఫోర్జరీ చేసి అక్రమాలకు పాల్పడకుండా ఉండేలా ఆన్‌లైన్‌లో ప్రత్యేక కోడింగ్ విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. జిల్లాలో ప్రతినెల కనీసం లక్ష ఫైల్స్ ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని ఆదేశించినప్పటికీ నవంబర్ నెలవరకు కేవలం 70వేల ఫైల్స్ మాత్రమే ఆన్‌లైన్ అయ్యాయని, రాబోయే మూడురోజుల్లో 30వేల ఫైల్స్‌ను ఆన్‌లైన్ చేయడానికి కీలకమైన 20 శాఖల అధికారులు ప్రత్యేకశ్రద్ద వహించాలన్నారు. రిజిస్ట్రారు కార్యాలయంలో రెండువేల ఫైల్స్ ఆన్‌లైన్ చేయాల్సి ఉండగా కేవలం 48 ఫైల్స్ మాత్రమే ఆన్‌లైన్ చేశారని, తమ పలుకుబడి, సామ్రాజ్యాలు ఎక్కడా కూడా వదులుకోవడానికి రిజిస్ట్రారు కార్యాలయంలో ఇష్టపడటం లేదని, పర్సంటేజీలపై ఉండే శ్రద్ద ఫైల్స్ డిజిటలైజేషన్ చేయటంలో చూపించాలని జిల్లా రిజిస్ట్రార్‌ను కలెక్టరు ఆదేశించారు. బయోమెట్రిక్ హాజరు విధానంలో కూడా పలుశాఖల్లో తొలి రోజుల్లో కన్నా నేడు హాజరుశాతం తగ్గిపోతోందని, ముఖ్యంగా ఐటిడిఎ పరిధిలో నూరుశాతం హాజరు ఉండాలని కానీ 45శాతం మంది మాత్రమే బయోమెట్రిక్ హాజరు వేస్తున్నారన్నారు. ఏలూరులోని పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగంలో ఈనెల 23వ తేదీన 25మంది ఉద్యోగులకు 22 మంది బయోమెట్రిక్ హాజరు వేస్తే తర్వాత మూడురోజుల్లో 8,7,6 మంది ఉద్యోగులు మాత్రమే బయోమెట్రిక్ హాజరు వేసారని, సడన్‌గా ఉద్యోగులందరికి అనారోగ్యం చేసిందా అని ఆయన ప్రశ్నిస్తూ వెంటనే దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని కమిషనర్ సాయిశ్రీకాంత్‌ను ఆదేశించారు. గనులశాఖలో వేలాది ఫైల్స్ ఆన్‌లైన్ చేయాల్సి ఉండగా కేవలం మూడుఫైల్స్ మాత్రమే ఆన్‌లైన్ చేయడమేమిటని, పొగరబోతుతనంతో వ్యవహరిస్తే ఏమిచేయాలో తనకు బాగా తెలుసునని గనులశాఖ ఎడి మోహనరావును హెచ్చరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టరు పి కోటేశ్వరరావు, జెసి-2 షరీఫ్, డిఆర్వో కట్టా హైమావతి, హౌసింగ్ పిడి ఇ శ్రీనివాసరావు, డిఎస్‌ఓ డి శివశంకర్‌రెడ్డి, ఎస్‌డిసి ఆర్‌వి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పొగాకు మార్కెట్టులో పోటీతత్వం కరవు
పొగాకు బోర్డు ఎక్స్‌టెన్షన్ మేనేజర్ మిత్ర
దేవరపల్లి, నవంబర్ 28: జాతీయ, అంతర్జాతీయ పొగాకు మార్కెట్టులో కంపెనీల్లో పోటీతత్వం లేకపోవడం వల్ల ఆ పొగాకు రైతు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉందని పొగాకు బోర్డు ఎక్స్‌టెన్షన్ మేనేజర్ బిఎన్ మిత్ర పేర్కొన్నారు. మండలంలోని సంగాయిగూడెంలో పొగాకు పంట నియంత్రణ, ఉత్తమ యాజమాన్య పద్ధతులపై సోమవారం రైతులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. దేవరపల్లి పొగాకు వేలం కేంద్రం నిర్వహణాధికారి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సదస్సులో మిత్ర మాట్లాడుతూ పొగాకు మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రైతులు బోర్డు అనుమతించిన మేరకే పొగాకు ఉత్పత్తి చేయాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం నియంత్రణ విధిస్తోందని, దీనికితోడు పర్యావరణ ఆంక్షలు, వైద్య వర్గాల నివేదికలు పరిశ్రమకు అడ్డుకట్టగా ఉన్నాయన్నారు. పొగాకు వేలం ఆఖరి దశలో కొన్ని కంపెనీలు ఎక్కువ రేటు ఇస్తున్నాయని, దీనిని రైతులు గమనించాలని హితవు పలికారు. రాజమహేంద్రవరం రీజనల్ మేనేజర్ శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ పొగాకు పంటలో ప్రస్తుతం నల్లకాడ తెగులు ఆశించిందని, దీని నివారణకు తీసుకోవాల్సిన చర్యలను గూర్చి వివరించారు. పొగాకు వేలం కేంద్రం రైతు సంఘం అధ్యక్షుడు కరుటూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సామాగ్రిని సబ్సిడీపై ఇవ్వాలన్నారు. ఐటిసి అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ డ్రిప్ ఇరిగేషన్ సిస్టం ద్వారా నీటి వినియోగం తగ్గుతుందని, దీనివల్ల అధికోత్పత్తి సాధించవచ్చునన్నారు. సమావేశంలో పిఎస్‌ఎస్ రైతు ప్రతినిధి కె సీతారామరాజు, జిపిఐ ప్రతినిధి కాంతారావు, వేలం నిర్వహణాధికారి వైవి ప్రసాద్ మాట్లాడుతూ రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గూర్చి వివరించారు. రైతునేత గద్దే వెంకట్రామారావు, ఆచంట గోపాలకృష్ణలు మాట్లాడుతూ బోర్డుకు ఛైర్మన్‌ను నియమించాలని కోరారు. అంతకు ముందు గాంధీనగరం, సంగాయిగూడెం గ్రామాల్లో పొగాకు తోటలను అధికారులు పరిశీలించారు. కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ జిఎల్‌కె ప్రసాద్, సంగాయగూడెం, గాంధీనగరం గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.
కొండచిలువ హతం
ద్వారకాతిరుమల, నవంబర్ 28: ప్రధాన రహదారిపైకి వచ్చిన ఒక కొండ చిలువ స్థానికులను హడలెత్తించింది. దీంతో కొందరు ధైర్యంచేసి దానిని హతమార్చారు. ఈ ఘటన మండలంలోని గున్నంపల్లిలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన కొందరు రైతులు ఉదయం పొలం పనులకని వెళుతున్నారు. ఈ సమయంలో గున్నంపల్లి శివార్లలోకి వెళ్లేసరికి హఠాత్తుగా రోడ్డుపైకి వచ్చిన కొండ చిలువను చూసి వారంతా భీతిల్లారు. అయితే రైతులు కొందరు ధైర్యంచేసి దానిని కడతేర్చారు. సుమారు 7 అడడుగుల పొడవున్న దీనిని చూసేందుకు స్థానికులు ఆసక్తిచూపారు.
విషజ్వరంతో బాలిక మృతి
జీలుగుమిల్లి, నవంబర్ 28: మండలంలోని కామయ్యపాలెంలో పఠాన్ హసీనా(14) విషజ్వరంతో సోమవారం మృతి చెందింది. కామయ్యపాలెం జడ్పీ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న హసీనా జ్వరంతో బాధ పడుతుండటంతో అశ్వారావుపేటలోని ప్రయివేటు ఆసుపత్రికి తీసుకు వెళ్ళినట్టు తండ్రి లాల్ తెలిపారు. హసీనా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో విజయవాడ ప్రయివేటు ఆసుపత్రికి తీసుకు వెళ్ళినట్టు అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్టు చెప్పారు. బాలిక మృతికి పాఠశాల ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు.

ప్రమాదవశాత్తు కాలువలో పడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
ద్వారకాతిరుమల, నవంబర్ 28: ప్రమాదవశాత్తు కాలువలో పడిన ఒక ఇంజినీరింగ్ విద్యార్థి మృతిచెందాడు. సోమవారం ఉదయం మండలంలోని నారాయణపురం వద్ద కాలువలో ఈ యువకుని మృతదేహం కనిపించింది. ద్వారకాతిరుమల ఎస్సై టి నాగవెంకటరాజు తెలిపిన వివరాల ప్రకారం..నల్లజర్ల మండలం అనంతపల్లికి చెందిన కలం పిచ్చిబాబు (21) పెద తాడేపల్లిలోని శ్రీ వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 26వ తేదీ ఉదయం 11గంటలకు బయటకు వెళుతున్నానని ఇంటి వద్దచెప్పి తన ద్విచక్ర వాహనంపై వెళ్లిపోయాడు. రాత్రయినా ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రులు, బంధువులు చుట్టుపక్కల గాలించారు. అయితే కాలువ పక్కన యువకుని బైకు మాత్రమే కనిపించింది. దీంతో ఆదివారం కుటుంబ సభ్యులు అనంతపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే..ఆ యువకుని మృతదేహం కాలువలో కొట్టుకుంటూ వచ్చి నారాయణపురం వద్ద తేలింది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు ద్వారకాతిరుమల పోలీసు స్టేషన్లో ఫిర్యాదుచేయగా ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని ఇతనిని పిచ్చిబాబుగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
రేపు బడి రుణం తీర్చుకుందాం ర్యాలీలు
ఏలూరు, నవంబర్ 28: బడి రుణం తీర్చుకుందాం అవగాహనా ర్యాలీలు ఈనెల 30వ తేదీన జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, జిల్లా కేంద్రంలో బడిపిల్లలతో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ చెప్పారు. స్దానిక కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా అధికారుల సవ