వినదగు!

‘స్థితం’ కాగలగటమే ‘అద్వైత’ సిద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉన్న స్థితిలో ఉండలేకపోవటం - ఉన్నత స్థితికి చేరుకోవాలన్న ప్రయత్నం - ఈ రెండింటి నడుమా కోరికలతో పరితపించటం.. ఇదీ సంసార జంఝాటం - ఇదే జీవన చక్రం.. జీవన యానం.
సాధారణంగా ఈ జీవన యానంలో ఉన్న స్థితిని పట్టించుకోకపోవటం అంటే వాస్తవికతలో జీవించక మాయా మోహితులం అవుతుంటాం.. అంటే కోరికలతో అలమటిస్తుంటాం.. ఫలితం - అలల తాకిడిలో ఆత్మానే్వషణ ప్రారంభమై పరమాత్మ అస్తిత్వాన్ని గుర్తించటం జరుగుతుంది. ఆత్మ అస్తిత్వ ఎరుక ద్వారా పరమాత్మ చిరునామా కోసం వెతుకులాట ప్రారంభమవుతుంది. ఈ ప్రయత్నంలో చైతన్యమే మానవ అవతరణకు నేపథ్యమని స్పష్టమవుతుంటుంది. అందుకే చైతన్యం లేని దేహాన్ని కానీ, మనసును కానీ, చివరికి జ్ఞానాన్ని కానీ ఊహించుకోలేం.
చైతన్యం లేనిదే ఒక గమ్యం సాధ్యం కాదు.. ఒక ఆదర్శం పుట్టుకురాదు.. ఒక ఆలోచన పురుడు పోసుకోదు... ఒక ఆచరణ నడక ప్రారంభించదు. అంటే చైతన్యంతోనే మన జీవన గమనం ఈ చైతన్యాన్ని పదార్థ జగతి నుంచి తప్పించగలిగితే మోహావేశం కరిగిపోతుంది.. కోరికల రూపంలో ఎగసిన అల నేలను తాకుతుంది. సంయమన వర్తనం సుసాధ్యమవుతుంది. దీనే్న మనం వైరాగ్యం అనుకుంటుంటాం. కానీ ఇది వైదొలగటమే తప్ప చైతన్య రహిత స్థితి కాదు... ప్రాపంచిక ఆరాటం నుండి వైదొలగటం మాత్రమే! అందుకే కృష్ణుడు ఆరాటం అన్నది మళ్లీ మొదలును చేరటానికి కాకూడదంటాడు. అంటే ప్రాపంచికకత అనే సుడిగుండంలో చిక్కుకోక ఆవలి తీరంలా అనిపించే మరలిరాని తీరాన్ని - పర ప్రాంగణాన్ని చేరటానికే మన చైతన్యం ఉపకరించాలన్నది కృష్ణ ఉవాచ. గీతలోని పురుషోత్తమ యోగంలో కనిపించే ‘వినివృత్తకామాః’ ‘సుఖదుఃఖ సంజ్ఞై’ అన్న పదాల అర్థ వివరణ ఇదే.
పదార్థ చైతన్యాలైన మాయామోహాలు, కీర్తికాముకతలు, సుఖదుఃఖాల నుండి వైదొలగటం వల్ల పురుషోత్తమ స్థానం సంప్రాప్తమవుతుంది. ఆ పురుషోత్తమ తత్వాన్ని సూర్యతత్వం, చంద్రతత్వం, అగ్నితత్వం సైతం ఆక్రమించలేవు... భర్తీ చేయలేవు.. అతిక్రమించలేవు. అంటే పురుషోత్తమ తత్వానికి మించిన మరో తత్వం లేదని. ఆధ్యాత్మికత్వం మనకు అందించేది ఈ పురుషోత్తమ తత్వాన్ని. ఆధ్యాత్మిక ప్రయాణం మనల్ని మరలిరాని ఆ అమర లోకాన్ని చేర్చుతుంది.
మానవతత్వం పరిపూర్ణ ఆత్మతత్వంగా పరిణమించటమే పురుషోత్తమ తత్వం. మానవతత్వం పురుషోత్తమ తత్వంగా పరిణమించిన తర్వాత మరల మరల కోల్పోయేదేమీ లేదు. అంటే, అక్కడ ‘స్థితం’ కాగలిగితే స్థిరత్వమే! కారణం పురుషోత్తమ తేజస్సు అనేది ఇంద్రియ తేజస్సు, మానసిక తేజస్సు, జ్ఞాన తేజస్సులకు మించింది కాబట్టి. అంటే ఇంద్రియ తత్వానికి, మానసిక తత్వానికి, జ్ఞానతత్వానికి అతీతమైన తత్వం పురుషోత్తమ తత్వం. అంతేకాదు అది ద్వంద్వాతీత స్థితి.. అద్వైత సిద్ధి.
* * *
ఇంతకీ పురుషోత్తమ తత్వం ఎటువంటిది? అంటే - ‘గామవిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా’ పరమాత్మ స్వతస్సిద్ధ తత్వంతో అంటే అతీత శక్తితో ఈ వస్తు ప్రపంచమైన భూమండలంలో ప్రవేశించే పాంచభౌతిక తత్వానే్న కాక సకల చరాచరాల అస్తిత్వానికి మూలమవుతోంది, కేంద్ర మవుతోంది. ఆ పరమా త్మ చైతన్యం సోకనిదే ఈ భూమండల చైతన్యానికి అవకాశం ఉండటం లేదు. పైగా-
‘పుష్యామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః
చంద్రబింబం సైతం ఆ పరమాత్మ ప్రతిబింబమే! ఆ పరమాత్మ చైతన్యంలోని రసతత్వమే చంద్రతత్వంగా ప్రతిఫలిస్తూ ఔషధీయ తత్వానికి మూలమవుతోంది. అంటే సకల జీవరాశి మనుగడకు అవసరమైన అనారోగ్య స్థితులను ఆరోగ్యపరచగల ఔషధీయ చైతన్యమూ ఆ పరమాత్మ చైతన్యంలోనిదే! అవును, ప్రాణాట్రీట్ అనే గికతత్వం పరవాత్మ అస్తిత్వంలోనే అంతర్లీనమై ఉంది.
అందుకే అన్నిటా ఉన్నది తానేనంటాడు కృష్ణుడు. భూమి తేజస్సంపన్నతకు మూలం తానేనంటాడు. భూమండలంలోని ప్రాణి సంతతి మనుగడకు ఆలంబన తానేనంటాడు. అలాగే అనారోగ్యకర శక్తులను తుదముట్టించే ఔషధీయ తత్వమూ తానేనంటాడు. అంటే, ఈ చరాచర సృష్టి చైతన్యంలోని వివిధ అంశలు ఆ పరమాత్మ చైతన్యంలోని పాయలే!
అసలు భూమండలంలోని సకల ప్రాణికోటి పదికాలాలపాటు ఆయుష్మంతమై ఉండాలంటే జఠరాగ్ని జీర్ణశక్తి కూడబలుక్కుని సమర్థవంతంగా క్రియాత్మకంగా సాగాలి.
‘అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రీత
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్’
ఆకలితో భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య రూపాలలో అంటే వివిధ రూపాల ఆరగించిన ఆహారం అరగటానికి కారణమూ తానేనంటాడు కృష్ణుడు. అంటే మనలోని జీర్ణక్రియ సక్రమంగా సాగుతూండటానికి స్విచ్ పరమాత్మలోనే ఉన్నట్లు.
మొత్తానికి సూర్య తేజస్సు, చంద్ర తేజస్సు లేనిదే భూమండల ప్రాణి సంతతికి మనుగడ లేదు.. మానవ జీవితమే లేదు. ఇలా భూమండల అస్తిత్వానికి, ఆవిర్భావానికి ఆది స్థితి ఆ పరమాత్మనే. ఆ పరమాత్మ తేజస్సే భూలోక నైపుణ్యానికి వలసిన వనరు. ఆ పరమాత్మ చైతన్యమే మూలం. ఆ ‘పరం’ లేనిదే ఈ ‘ఇహం’ లేదు. ‘ఇహం’లోని ఆత్మ ‘అహం’కారమంతా ‘పరం’లోని పరమాత్మ అంశనే! కాబట్టి భూ ఆవరణలోని మానవ చైతన్యానికీ, జీవ చైతన్యానికీ, ప్రాణ చైతన్యానికీ, వృక్ష చైతన్యానికీ - అవి క్రియాత్మకంగా తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవటానికీ - మూల చైతన్యం పరమాత్మనే!
ఇంతకీ ఈ భూకక్ష్యలోనిదంతా ‘సంసార’ తాపత్రయమే. భూక్షేత్రంలోని భూతతత్వమంతా క్షరమే! క్షరత్వం కానిది అక్షరత్వం. కాబట్టి భూమండల అస్తిత్వానికి ఒక ఇరుసున క్షరత్వమూ, మరొక ఇరుసున అక్షరత్వమూ తప్పనిసరి. ఈ క్షర, అక్షర తత్వాలకు అతీతం పోనీ విలక్షణం పరమాత్మ తత్వం.
ప్రత్యగాత్మ తత్వం పురుషోత్తమ తత్వం భిన్నాలు కాదు... ద్వంద్వాలు కాదు. అది అద్వైత గికతత్వం. వ్యావోహం లేని మానవతత్వంలోనే ఈ గికత్వం నెలకొనేది. అంటే నిత్య సాధకుడే ‘సర్వాత్మ’. ఆ సర్వాత్మకే పురషోత్తమత్వం సిద్ధించేది. ఈ ఆత్మజ్ఞానమే సర్వజ్ఞత్వం. ఈ జ్ఞాన ప్రకాశనం వల్లనే కర్మ పరిసమాప్తి. ఈ జ్ఞానయోగమే కర్మయోగం. శ

డా.వాసిలి వసంతకుమార్ 93939 33946