భక్తి కథలు

కాశీఖండం93

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు మనం ఎంత అదృష్టం చేసికొన్నామో! పూర్ణచంద్ర సంకాశ మనోహర వదనా! (పూర్ణచంద్రాననా!). ఆ రీతిగా కాకుంటే వినడానికిన్నీ ఆశ్చర్యకర విషయం. శివుడు ఇప్పుడిక్కడికి ఈ విధంగా విజయం చేసి వున్నాడు’’.
అనంతరం ఆ పరమేశ్వరుని బహు ప్రకారాల ప్రస్తుతించి, ఆ దేవుడివల్ల అతని భిక్షాటన వృత్తాంతమంతా ఆలకించి ఆశ్చర్యం పొంది లక్ష్మీదేవికి సన్నచేశాడు. అపుడు ఆ జగన్మాత అంతిపురికి అరిగి, పిమ్మట-
చరణ కమలాలనుండి జాలువాతున్న చిక్కని కాంతి కృత్రిమమైన సంజ ఎరుపుని మరలించగా, మొలనూలి కింకిణులు క్వణక్వణ రవాలు మన్మథుడి అట్టహాసాన్ని పరిహాసమాడుతూ వుండగా, ఎడము లేకుండ బలిసి పిక్కటిల్లిన వక్షస్స్థలం భారంవల్ల సన్నని కౌను తీగ జవ్వు జవ్వున వూగుచుండగా, బిగువుగా కట్టిన కేశపాశం అదురుకి జారగా రాలిన పువ్వులు తుమ్మెదలకి విందులు పెట్టగా, సహజాలైన త్వరపాటు, తత్పరత, సంతోషం తళుక్కున మెరుస్తూ వుండగా, నవరత్న ఖచితం అయిన తెడ్డు (గరిట) కైకొని లక్ష్మీదేవి ఏతెంచి చంద్రశేఖరుడి పాణిపాత్రలో అమృత దివ్యాన్ని వడ్డించింది.
ఈ వడువు లక్ష్మీదేవి చేత ‘మనోరథవతి’ అను పేరున ప్రసిద్ధి చెందిన భిక్షని కైకొని విష్ణువు చూపిన భయభక్తి విశ్వసాలకు మెచ్చి, అతను కోరిన వరాలు ప్రసాదించి, యథాప్రకారం బ్రహ్మహత్యతోనే అరుదేర లోకాల్లో సంచరిస్తూ వున్నాడు.
ఒకనాడు సకల దుఃఖ పరంపరల్ని హరింపజేసే ప్రభావ స్ఫురణకి జననియున్ను, ఏ తీర్థం హలాహల విషచ్ఛ విని కప్పిన కంఠం కలవాడికి గృహణియో, ఏ తీర్థం, మనోరథాలని తీర్చే కళకి ఆకరం అయిన విశాలాక్షి అనే కల్పవల్లికి ఆలవాలమో, ఏ తీర్థం సమస్త తీర్థాల్లో లభ్యంకాని ప్రధాన సౌఖ్యానికి- మోక్షానికి- వాసస్థానమో, ఉపకంఠసీమల్లో సమీప స్థలంలో పరచుకొని వున్న ఆకాశగంగలోని బంగారు తామర పువ్వుల సువాసనల్ని వెదచల్లు ఆకాశీ నగరానికి ప్రీతితో ఆ మహాభైరవుడు అరుదెంచాడు.
ఈ క్రియ ఆ దేవుడు విశే్వశ్వర దేవుడి నివాస స్థలం ప్రవేశించిన వెంటనే బహిః ప్రదేశంలోనే వుండి హాహాకారాలతో మొరపెట్టుతూ ఆ బ్రహ్మ హత్య పాతాళ లోకంలో పడిపోయింది. అతడి పాణితలంలో వున్న బ్రహ్మ కపాలం కూడా వూడి ధరణీస్థలిని పడింది. అది ఆదిగా ఆ భైరవస్వామి ఆనందంతో ఆ ఆనంద కాననంలో నివసించాడు. ఆ కపాల మోచన తీర్థం తన్ను సేవించిన జనులకి పాపభంజనం చేస్తూ పుణ్య ప్రదం అయింది.
ఈ భైరవాఖ్యానాన్ని చదివినా, చెవులారా విన్నా, మహా పాపాలు తొలగిపోతాయి అని చెప్పి కుమారస్వామి మరల అగస్త్య మునితో ఈ పగిది వాకొన్నాడు.
‘‘అగస్త్య మునీశ్వరా! బ్రహ్మదేవుడు తాను సర్వ దేవతలకన్నా అధికుడిని అని గర్విస్తే తన చేతి గోటి కొనతో అతడి శిరస్సుని గిల్లివేశాడు. రూపం తాల్చి బ్రహ్మహత్య తన వెంబడి రాగా సకల జగాలు సంచరించాడు. వైకుంఠంలో లక్ష్మీ నారాయణులు సమర్పింన అమృత భిక్షాన్నం కడుపార ఆరగించాడు. కాశీక్షేత్ర సమీపంలోని పొలిమేరలో తన చేతి బ్రహ్మకపాలాన్ని పగులగొట్టాడు. మన్మథవైరి అయిన శూలపాణి చేత కాశీ క్షేత్ర పాలకుడు అయాడు. బ్రహ్మకపాలం పగులవేసిన తావులోనే కాపురం వున్నాడు. ఈ క్రోధ భైరవుడు కాశీ పుణ్యక్షేత్రానికి ఏడుగడ సుమా!

-ఇంకాఉంది

శ్రీపాద కృష్ణమూర్తి