ఆంధ్రప్రదేశ్‌

వాస్తుతో శుభమస్తు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అద్భుతంగా అమరావతి నిర్మాణం చతురస్రాకారంలో భవనాల డిజైన్ వాటర్ ఫ్రంట్ సిటీగా రాజధాని
కృత్రిమ జలపాతాలు, వాటర్‌పార్కులు డ్రైవర్ రహిత వాహనాలకు ప్రాధాన్యం నీటి మడుగులో మ్యూజియం
లండన్ పబ్లిక్ పార్క్ తరహాలో ఉద్యానవనం నార్మన్ ఫోస్టర్ ప్రతినిధి వెల్లడి రాజధానిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్

విజయవాడ, మార్చి 25: నవ్యాంధ్ర రాజధాని అమరావతిని వాస్తును పరిగణనలోకి తీసుకుని నిర్మిస్తున్నారు. వీలైనంతవరకూ వాస్తుకు సరిపడేలా నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ విషయాన్ని నార్మన్ ఫోస్టర్ ప్రతినిధి హర్ష్ థాపర్ వెల్లడించారు. వెలగపూడిలోని అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అమరావతి పరిపాలనా నగరం స్థూల ప్రణాళికపై ప్రిన్సిపల్ సెక్రటరీ (సిఆర్‌డిఎ) అజయ్ జైన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా థాపర్ మాట్లాడుతూ వాస్తుకు సరిపడే విధంగా ఉత్తరం - దక్షిణ దిశగా ఎలైన్‌మెంట్ చేస్తున్నామన్నారు. ప్రతి భవన నిర్మాణం వీలైనంత వరకూ చతురస్రాకారంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎక్కడా వృత్తాకారంలోనూ లేదా వంకరటింకరగానూ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దక్షిణం నుంచి ఉత్తరం వైపునకు భవనాల ఎత్తును వాస్తుకు అనుగుణంగా ఉండేలా నిర్మిస్తున్నారు. దీనికి తోడు పురాతన దేవాలయాలకు సంబంధించిన నిర్మాణ శైలిని కూడా వినియోగించుకోనున్నట్లు వెల్లడించారు. ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో 9 బ్లాక్‌లుగా నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. 13 జిల్లాల సంస్కృతులను, ప్రత్యేకలను అనుసంధానం చేయనున్నామన్నారు. మానవ రహిత వాహనాలు, నడకకు, సైక్లింగ్‌కు వీలుగా ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. విజయవాడలో ఉండే ఉష్ణోగ్రతలు, ఉక్కపోతను దృష్టిలో ఉంచుకుని, వాటిని నియంత్రించే దిశగా అధ్యయనం చేస్తున్నారు. నిర్ణీత దూరాల్లో బస్‌స్టాప్‌ల ఏర్పాటు, కృత్రిమ జలపాతాలు, రిజర్వాయర్ల ఏర్పాటు చేస్తున్నారు. నది నుంచి 3.5 కిలోమీటర్ల దూరంలో అసెంబ్లీ, తదితర భవనాల నిర్మాణం చేపట్టనున్నారు. కృత్రిమ జలపాతాలకు, వాటర్‌పార్క్‌లకు దాదాపు 0.18 టిఎంసి నీరు కావాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 27 కిలోమీటర్ల వాటర్ ఫ్రంట్ సిటీగా అమరావతిని అభివృద్ధి చేయనున్నారు. 900 ఎకరాల్లో పరిపాలనా నగరాన్ని నిర్మిస్తుండగా, రివర్ ఫ్రంట్ ఏరియా పబ్లిక్ కోసం ఓపెన్‌గా ఉంటుంది. అసెంబ్లీ భవనం ముందు నీటి మడుగులో మ్యూజియం ఏర్పాటు, లండన్‌లోని పబ్లిక్ పార్క్ తరహాలో పెద్ద పార్క్‌ను కూడా నిర్మించేందుకు ప్రతిపాదిస్తున్నారు.

చిత్రం... అమరావతి డిజైన్లపై పవర్ పాయింట్
ప్రజెంటేషన్ ఇస్తున్న నార్మన్ ఫోస్టర్ ప్రతినిధి

అమరావతి డిజైన్లపై శనివారం నార్మన్ ఫోస్టర్ ప్రతినిధి ఇస్తున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను తిలకిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్, రాష్ట్ర మంత్రులు