డైలీ సీరియల్

బడబాగ్ని 15

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలా అని మరణవాగ్మూలం కూడా రిజిస్టర్ అయిందట. ఇంకేం ప్రాబ్లం సాల్వ్ అయినట్లే.. హంతకుడు ఎటూ ఆత్మహత్య చేసుకు మరణించాడు.. మరణించే ముందు తనే చేశానని ఒప్పుకున్నాడు.. సో కేసు క్లోజ్ అయినట్టే.. మన అజిత్ నిరపరాధిగా బయటపడ్డట్టే.. కానీ అవవసరంగా మధ్యలో ఆ రాహుల్ ఎంట్రీ వలన మిస్లీడ్ అయ్యాం.... సో.. రేపు కోర్టులో ఈ పాయింట్స్‌మీద అజిత్ నిరపరాది అని వాదిస్తూ అసలు హంతకుడు ఆత్మహత్య చేసుకు మరణించాడు కనుక కేసు కొట్టివేయబడుతుంది.. చీయరప్’’ సింపుల్‌గా అన్నాడు లాయర్ భగవాన్.
‘‘సర్.. మీరేమీ అనుకోనంటే నాకు కొన్ని అనుమానాలున్నై.. తీరుస్తారా..’’ మొహమాటపడుతూ అడిగాడు అనే్వష్.
‘‘అనుమానాలా, దేని గురించి..’’ ముఖం చిట్లిస్తూ అన్నాడాయన.
‘‘యిప్పుడు, మనం.. హత్య చేసినవాడు మరణించాడు కనుక కేసు క్లోజ్ అనుకుంటే హత్య చేసినవాడు ఆయుధం, అంతేకాని చేయించినవాడు కదా అసలు దోషి.. అసలు నేరస్థుడు.. మరి వాడిని పట్టుకుని శిక్షించకుండా వదిలేస్తే సమస్య పరిష్కారం ఎక్కడ అయినట్లు..
అసలువాడెవరో మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశాడో తెలియాలి కదా.. యిప్పుడు రాహుల్ దోషి అనుకుంటే అతనికి అజిత్ మాత్రమే టార్గెట్.. సో, వాడిని యిరికించడం కోసం అమర్‌ని హత్య చేసాడనుకుందాం. కానీ మధ్యలో అరుణ్ ఏం చేశాడు? వాడినెందుకు చంపాలనుకున్నాడు? నేనేం చేసాను, నన్ను ఎందుకు లారీతో గుద్ది చంపాలనుకున్నాడు? సో.. కొంచెం లోతుగా ఆలోచిస్తే యిదంతా చేసినది రాహుల్ కాదేమో అనిపిస్తోంది... బట్ ఎవరో ఉన్నారు..
తెరవెనుక ఉండి ఇదంతా చేస్తున్నారు.. అసలు దోషి వాడు... కానీ ఎలా తెలుసుకోవడం.. పోనీ మమ్మల్ని టార్గెట్ చేసిన కారణం తెలిస్తే ఎవరు అన్నది ఈజీగా తెలుసుకోవచ్చు.. కాని కారణం ఏమిటో ఎంత ఆలోచించినా అంతు చిక్కడంలేదే.. ఎవరికీ మా మీద అంత పగ బట్టే అవసరం.. ఎంత ఆలోచించినా ఇక్కడే ఆగిపోతోంది..’’ బాధగా నుదురు రాసుకుంటూ అన్నాడు అనే్వష్.
‘‘అవును.. నువ్వు చెప్పేది నిజమే.. కానీ ఇదంతా ఆ రాహులే ఎందుకు చేసుండకూడదు? వాడెటూ కాస్త తేడాగానే ఉన్నాడు.. ఏమో ఇదంతా థ్రిల్ కోసమో చేసాడేమో.. మరి నువ్వేమో ఎంత ఆలోచించినా మీ మీద పగ.. చంపాలన్నంత ద్వేషం ఉన్న వాళ్ళెవరూ లేరు అంటున్నావు.. అసలు ఓ విషయం బాగా ఆలోచించు.. గుర్తుతెచ్చుకు చెప్పు..ఎవరిమీదైనా ఏ కేసులో అయినా మీరు సాక్షులుగా.. ఐ మీన్ ఐ విట్నెస్‌గా ఉన్నారా? యింకా క్లియర్‌గా చెప్పాలంటే.. ఎవరైనా ఎవరినైనా హత్య చేస్తున్నపుడు చూడటం.. ఫొటోలు.. వీడియో గట్రా లాంటివి తియ్యడం...’’ అనే్వష్‌ని నిశితంగా చూస్తూ ఒక్కొక్కమాట పట్టి పట్టి అడిగాడు లాయర్ భగవాన్.
‘‘్భలేవారే సార్.. అలాంటిదేమైనా ఉంటే మాకు తెలియకుండా ఎలా ఉంటుంది.. నిజంగా మేమే కనుక అలాంటిది చూసి ఉంటే బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్స్‌గా కేసు పెట్టి వాళ్లని చట్టానికి పట్టించి... శిక్ష పడేటట్టు చేయకుండా ఉంటామా? అలా ఎందుకడిగారు? ఒకవేళ అలాంటిదేమైనా కారణం అయి ఉంటుందంటారా? కానీ నాకు తెలిసి అలాంటిదేమీ లేదే.. అయినా మిగతా వాళ్లని కూడా అడిగి చూస్తా... కానీ మేం నలుగురూ ఇక్కడికొచ్చాకే ఒకరికొకరికి పరిచయమైనా.. వచ్చిన కొన్నాళ్లకే మంచి స్నేహితులమైపోయాం.. నాకు తెలిసి మా మధ్య రహస్యాలంటూ ఏమీ లేవు.. ఒకవేళ అటువంటిదేమైనా ఉంటే తప్పకుండా మిగతావాళ్లతో షేర్ చెయ్యకుండా ఉండం.. అయినా మీరడిగారు కాబట్టి అరుణ్, అజిత్‌లను అడుగుతా..
‘‘సరే.. సరే.. ఊరికే అడిగా.. దాని గురించి అంతగా ఆలోచించకు.. లీలగా ఏదో రిలీఫ్ కనబడింది ఆయన ముఖంలో.
‘‘అయినా నువ్వన్నట్లు చంపినవాడు తను చనిపోతూ చంపినది తనే కానీ తననెవరో బ్లాక్‌మెయిల్ చేసి అదంతా చేయించారు అని చెప్పడం ఎంతవరకు నమ్మదగిన విషయం.. అసలు వాడిని దేనికోసం బ్లాక్‌మెయిల్ చే...
‘‘సరే.. చనిపోయే ముందు ఎంతటి వెధవ అయినా అబద్ధం చెప్పడు.. అందులోనూ తను చంపినట్లు ఒప్పుకుని ఇంకా అలా చెప్పవలసిన అవసరం.. ఇంద్రజిత్‌కు ఎంతమాత్రం లేదు.. అదీకాక తనే పోయాక యింక తనని ఎవరు ఎందుకు బ్లాక్‌మెయిల్ చేసి ఉంటారు అని మనం తలలు బద్దలు కొట్టుకోవడంలో ఉపయోగం ఎంతమాత్రం లేదు.
యిప్పుడు మన సమస్య.. యింకా మాకు లైఫ్ థ్రెట్ వుంది.. అది ఎవరివలన.. అది తెలియాలంటే అలాంటి అవసరం ఎవరికి ఉంది?’’ లాయర్ మాట పూర్తికాకుండానే విసుగ్గా అన్నాడు. అంతటి లాయర్ ఒక్కక్షణం ఖంగుతిన్నాడు. ముఖంలో భావాలు మారిపోయాయి.. అయితే అనుభవజ్ఞుడు కనుక వెంట నే సర్దుకున్నాడు. ‘‘నువ్వేమీ వర్రీ అవకు.. రేపు ఆ రాహుల్‌ని క్రాస్ ఎగ్జామిన్ చేసి.. కిందా మీద పెట్టి అన్ని నిజాలూ వాడి చేత కక్కిస్తా చూడు.. నువ్వు నిశ్చింతగా వుండు, పాపం అరుణ్ ఎలా ఉన్నాడో.. అతనిని ఒంటరిగా ఉంచలేదు కదా.. అసలే యింకా పూర్తిగా కోలుకోలేదు.
‘‘లేదు సర్.. యింకోసారి మళ్లీ అలాంటి అవకాశం ఇస్తానా.. ఆ రాస్కెల్స్‌కి.. అరుణ్ దగ్గర కమల్ ఉన్నాడు...’’
‘‘ఎందుకయ్యా ఆ మీడియావాడితో.. యింతుంటే అంత చేస్తారు.. అవునూ అతను మీకెలా పరిచయం? ఇంతకుముందెప్పుడూ అతని గురించి చెప్పలేదే?’’ అయిష్టంగా అన్నాడు.

-ఇంకాఉంది

- మీనాక్షి శ్రీనివాస్