ఐడియా

విశ్వసుందరి పోటీకి 12 ఏళ్ల బాలిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుద్ధి వికాసం శరీర సౌష్టవం కుదురుకున్న తరువాత ఆడపిల్లల్ని ప్రపంచ సుందరి పోటీలకి విశ్వమోహిని పోటీలకి తయారుచేసి పంపించేవాళ్ళు లోగడ- కానీ విడీ విడని మొగ్గల్లాంటి చిన్నారులకు కూడా అంతర్జాతీయ అందాల (వాణిజ్య) పోటీలను వయోవర్గాలుగా చీల్చి పెట్టి- చిట్టి, చిన్న, కొత్త, ముదురు లేత అంటూ రకరకాల అందాల స్పర్థలకి ఆడపిల్లల్ని ధైర్యంగా పంపిస్తున్నారు. ‘లిటిల్ మిస్ యూనివర్స్’’ అనగా చిన్నారి విశ్వసుందరి పోటీలున్నాయిప్పుడు. దీనికి మన దేశం తరఫున ‘ఫైనల్స్’ పోటీలో పాల్గొనటానికి ఒడిషాకి చెందిన పనె్నండేళ్ళ పద్మాలయా అనే పాప ఎంపిక అయ్యింది. అమెరికాలోని జార్జియాకి బయలుదేరి వెళ్లింది. చిన్నారి పద్మాలయా నంద కటక్‌లో స్టీవర్ట్ స్కూల్లో ఇంచక్కా ఎనిదవ తరగతి చదువుకుంటోంది. ఈ బాలికని ఒఎన్‌జిసి ఇండియా కంపెనీ సత్కరించి ఎనిమిది లక్షల రూపాయల చెక్కుని ఖర్చులు కమామత్తుల నిమిత్తం అని చెప్పి బహూకరించింది. చిన్నారి పద్మాలయ నందాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ పోటీకి అమెరికాలోని జార్జియాకి మరో 16 మంది అందాల మొగ్గలు చేరుకున్నారు. అబ్బో! ఈ పోటీలు జూన్ 6 దాకా వివిధ అంశాలలో హోరాహోరీగా సాగుతాయి. జడ్జీల చూపరుల టివి ప్రేక్షకుల కనుల పండువుగా ఇవి జరుగుతాయి. ఈ నవీన బేబీ నందా పోయిన బుధవారం విమానం ఎక్కడానికి ముందు రోజు ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌గారిని కలుసుకొని ఆశీస్సులు తీసుకున్నది. కళ, సంస్కృతీ, ఉపజ్ఞ, మొదలయిన అన్ని రకాల టాలెంట్‌లని పరిశీలిస్తారు అక్కడ. అదృష్టం ఎవరిని వరిస్తుందో? అయితే, బేబీ నందా ‘కప్పు’ లేక ‘నో టప్పు’తో వెంటనే దేశానికి తిరిగిరాదు. అట్నుంచి అటు గ్రీసులో జరిగే చిన్నారి ప్రపంచ సుందరి పోటీలకి అందాలు మూట కట్టుకుని వెళ్తుంది. ఈలోగా పద్మాలయ ఇండియాలో ‘బెస్టుబాల్ గావున్’, ‘బెస్ట్ ప్రేటీన్’ లాంటి బ్యూటీ పోటీలలో విజేతగా నిలిచింది. అన్నట్లు ఈ పాపకి భరతనాట్యం కూడా వచ్చునండోయ్!