వాసిలి వాకిలి

జనన మరణాల మధ్య..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను-
ఒక వర్తమాన చిరునామా!
ఒక శాశ్వత చిరునామా!
వర్తమానం ఒక రూపావిష్కరణ.. భౌతికం.
శాశ్వతం ఒక అరూపావిష్కరణ.. అధిభౌతికం.
భౌతిక చిరునామా దేహానిది, మనసుది.
అధిభౌతిక చిరునామా దేహాతీతం, మానసాతీతం.
అసలు -
వర్తమాన చిరునామా జనన మరణాల మధ్యన.
శాశ్వత చిరునామా మరణ జననాల మధ్యన.
పుట్టుకకు ముందు, మరణించిన తర్వాత ‘నేను’ ఉండే స్థితే శాశ్వత చిరునామా. అది విస్తృత స్థితి.. అది ఆద్యంత స్థితి.. అది విశ్వప్రాణ క్షేత్రం.
అంటే-
వర్తమాన చిరునామాలో ‘నేను’ది మానవ ప్రాణ క్షేత్రం.
శాశ్వత చిరునామాలో ‘నేను’ది విశ్వ ప్రాణ క్షేత్రం.
విశ్వ ప్రాణ క్షేత్రం అంటే ప్లెంటీఆఫ్ ప్రాణా లెవల్స్ - అది సంపూర్ణ క్షేత్రమే కానీ అందులోనూ అనేకానేక అరలున్నాయి.. అన్ని మెట్లు ఎక్కవలసిందే - స్టెప్స్ ఫర్ ప్రాణా, స్టెప్స్ ఆఫ్ ప్రాణా, స్టెప్స్ ఇన్ ప్రాణా - ప్లెంటీ ఆఫ్ ప్రాణా లెవల్స్‌ను అందుకోవటమే సెల్ఫ్ రియలైజేషన్ - ఈ భృక్తం రహితం కావటమే యోగసాధన.
‘నేను’ను దేహపరంగా ఈథర్ బాడీ రక్షిస్తున్నట్లుగా, భూమిని ఓజోన్ పొర రక్షిస్తున్నట్లుగా విశ్వ ప్రాణ క్షేత్రాన్ని మాయావరణం రక్షిస్తుంటుంది. అంటే, వర్తమానానికి, శాశ్వతానికి మధ్యన ‘మాయ’ తప్పదన్నమాట. ఈ మాయను ఛేదించటం ఒక్క గిక ప్రజ్ఞ వల్లనే సాధ్యం.
ఇక్కడ ‘వాయ’ అంటే మాయం కావటం.. అంటే రూపం అరూపం కావటం.. అంటే, మరణించటం. రూపం అరూపంగా పరిణమించే దిశలో, దశలో మాయది పైచేయి అవుతుంది. ప్రాణం నిలకడ, ప్రాణం పోకడల మధ్యన మాయ అనేక హొయలు పోతుంటుంది. మృత్యు ప్రయాణం అంటే మృత్యు ప్రస్థానం సాగే సిల్వర్ లైట్‌లో.
‘నేను’ సంపూర్ణ ప్రాణ ప్రజ్ఞను అందుకోవాలంటే - ‘మాయ’ను గిక సాధనతో దాటవలసిందే.. నిత్య సాధనతో అరాపంగా ప్రస్థానిస్తుండవలసిందే. అప్పుడే ‘నేను’కు ‘విశ్వజ్ఞత’ ‘నేను’లో ‘ప్రాణ ప్రతిష్ఠ’. అదే ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ. అంటే, గిక సాధనతో ప్లెంటీ ఆఫ్ ప్రాణా లెవల్స్‌న చేరుకోగలిగితే, అందుకోగలిగితే శాశ్వతమయ్యేది ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ. రూప రహిత ప్రజ్ఞ అరూప అస్తిత్వం నుండి భౌతిక ప్రకృతిని చేరుతుండటం, ప్రాకృతిక పరిణామానికి ప్రజ్ఞాన్వితం అవుతుండటం ఫిజికల్ ఇమ్మోర్టాలిటీకి మరో ముఖమే!
* * *
మానవ ప్రాణ క్షేత్రమే విశ్వ ప్రాణ క్షేత్రంగా పరిఢవిల్లాలనేది యోగ లక్ష్యం. ‘నేను’గా ప్రతి యోగీ అనవరతం పరితపించేది, తపస్సుగా సాధనగా జీవితాన్ని కొనసాగించేది ఆ ప్లెంటీ ఆఫ్ ప్రాణా లెవల్స్‌తో ఈ మానవ క్షేత్రం దివ్య క్షేత్రం కావాలనే! అంటే, మానవ ప్రాణ క్షేత్రం శాశ్వత విశ్వ ప్రాణక్షేత్రం కావాలనే!
దాదాపు నూట పది సంవత్సరాల క్రితం 1910 జూన్ 13, 14 తారీఖుల్లో మాస్టర్ సి.వి.వి. తన తనయుడు చందు మరణించగా చేసిన ‘ప్లెంటీ ఆఫ్ ప్రాణా’ ట్రాన్స్ ప్రయోగం సంపూర్ణ విశ్వ ప్రాణ ప్రజ్ఞను మానవ యోగ ప్రజ్ఞగా మలచుకుని ఆ విశ్వ ప్రాణ కుంభాన్ని మానవ కుండలినిలో ప్రతిష్ఠించాలనే!
అలా, ప్లెంటీ ఆఫ్ ప్రాణా లెవల్స్‌ను చందూ చందూ కుండలినికి చేర్చే ప్రయత్నంలో అనేక మాయావరణలను దాటవలసి రావటం జరిగింది. రెండు రోజుల్లో రెండు పదుల సార్లు మృత్యువును ఛేదించి చందూ ప్రాణాన్ని నిలిపే ప్రయత్నంలో మాస్టర్ సి.వి.వి. యోగ ప్రజ్ఞకు అందిన విషయం మానవ ప్రాణ భూమిక విశ్వప్రాణ కుండలినిని సంపూర్ణంగా అందుకోవటానికి కావలసిన విధంగా సిద్ధం కాలేదని. ఆ మృత్యు ఛేదన పట్టుదలతో ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ పరంగా చేసిన ప్రయోగాలే భృక్తరహితం తారక రాజయోగంగా మనముందుంది.
అప్పటి నుండి, మానవ ప్రాణ క్షేత్రానికి విశ్వ ప్రాణ క్షేత్రానికి మాస్టర్ యోగం అనుసంధానం అయింది.
* * *
ప్లెంటీ ఆఫ్ ప్రాణా లెవల్స్ అంటే అన్‌లిమిటెడ్ ప్రాణాకు నిలయమైన విశ్వ ప్రాణ క్షేత్రం అంటే ‘విశ్వకుండలిని’ అనే.
లిమిటెడ్ ప్రాణా లెవల్స్‌కు వాసమైన మానవ ప్రాణ క్షేత్రం అంటే ‘మానవ కుండలిని’ అనే.
విశ్వ మండలినిది అధిభౌతికత... మానవ కుండలినిది భౌతికత. విశ్వకుండలిని ప్లానెటరీ ఫోర్సెస్‌ను భూమి వైపు ఆముఖం చేసి ఉంటుంది. మానవ కుండలిని వైపు ఆముఖంగా ఉన్న ఆ ప్లానెటరీ ఫోర్సెస్ ‘నేను’ను చేరుకునేది యోగ సాధనతోనే.
ఈ దిశగా మాస్టర్ యోగాన్ని ‘హయ్యర్ డైరెక్ట్ లైన్’ అనీ, ‘డైరెక్ట్ లింక్’ అనీ అంటుంటాం. అంటే, జూళషఆ జశళ చ్యిౄ జౄజఆళఒఒ యూజజశ ఆ్య దఖ్ఘౄశ ఛ్యిౄ చ్యి చ్యితీ యచి ఔళశఆక యచి -్ఘశ్ఘ.
‘నేను’ అంటే ఒకవైపు ప్రాణం.. మరొక వైపు జీవం. ‘నేను’ అంటే ప్రాణ చైతన్య, జీవ చైతన్యాల సంయోగం. ‘నేను’ అంటే ప్లానెటరీ ఫోర్సెస్ విస్ఫోటనం.
భౌతిక క్షేత్రంలో ‘ప్రాణం’ అన్న వెంటనే అది హ్యూమన్ లైఫ్ ఫోర్స్ అనిపిస్తుంది. నిజానికి అధిభౌతిక చైతన్యంగా అది యూనివర్సల్ లైఫ్ ఫోర్స్.. అది థర్టీన్ ప్లానెటరీ ఫోర్సెస్‌గా కాస్మిక్ లైఫ్ ఫోర్స్... అది ప్లెంటీ ఆఫ్ ప్రాణా లెవల్స్‌ల కార్యక్షేత్రం... యోగ సాధకుల కర్మక్షేత్రం.. ఇక్కడ కర్మ క్షేత్రం అంటే సాధనా క్షేత్రం అని.
హ్యూమన్ లైఫ్ ఫోర్స్ ఈ భౌతిక శరీరానికి అంటే మానవ ‘నేను’కు చెందింది. భౌతిక అంటే దేహ చైతన్యం అనేది ప్రాణ చైతన్యం + మానస చైతన్యం. అధిభౌతిక చైతన్యం అనేది ఆత్మ చైతన్యం + జీవ చైతన్యం. దేహం ప్లానెటరీ ఫోర్సెస్‌తో ప్రాణ స్పందనలు జీవ చైతన్యంగా పరిణమించటంతో ఆత్మ దేహంలో కొలువవుతుంది. అప్పటి నుండి దేహ చైతన్యానికి ఆత్మ చైతన్యం తోడవుతుంది. మానవ దేహ, ప్రాణ, జీవ చైతన్యాలకు విశ్వ ప్రాణ, ఆత్మ చైతన్యాలకు మధ్య ‘లింక్’ ఏర్పడాలి. ఈ ‘డైరెక్ట్ లింక్’ యోగ ప్రభతోనే సాధ్యమవుతుంది.
* * *
భౌతికంగా ‘నేను’లోని ప్రతి ఇంద్రియం మానస చైతన్యంతోను, ప్రాణ చైతన్యంతోను శక్తులు సంయోగంగా తన విధులను నిర్వహిస్తుంటుంది. ఈ రెండింటి సంయోగమే ‘లైఫ్ ఫోర్స్’. ఈ లైఫ్ ఫోర్సెస్ రెండింటికి సహకరించేది నాడీ వ్యవస్థ - ముఖ్యంగా సింపథటిక్, పారా సింపథటిక్ నెర్వ్స్.
ప్రతీ అవయవానికి మానస ప్రాణ చైతన్యాలకు మధ్యన ఈ రెండు నాడులు లింక్‌లా వ్యవహరిస్తుంటాయి. ప్రతీ ఇంద్రియం ఈ నాడుల ద్వారానే లైఫ్ ఫోర్స్‌లా పరిణమించిన ప్లానెటరీ ఫోర్సెస్‌తో చైతన్యవంతమయ్యేది. అంటే, హ్యూమన్ ఫార్మేషన్‌లోనే ప్లానెటరీ ఫోర్సెస్ హ్యూమన్ లైఫ్ ఫోర్స్‌గా పరిణమించాయన్నమాట.
* * *
అసలు, ‘ప్రాణం’ అంటే కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా ఉత్పత్తి అయ్యేది మాత్రమే కాదు. ఆక్సిజన్ కావలసినంత అందుతుంటే ప్రాణా సప్లై బాగున్నట్లు కాదు. నిజానికి, ‘ప్రాణ’ అనేది ఒరిజినల్ లైఫ్ ఫోర్స్, ఆరిజినల్ ప్లానెటరీ ఫోర్స్. ‘నేను’ తల్లి గర్భాన్ని చేరిన తొలి క్షణం నుండీ ప్లానెటరీ ఫోర్సెస్‌తో ‘ప్రాణ’ జీవ చైతన్య మవుతుంటుంది. వర్తమాన ఫంక్షనింగ్‌కి ప్లెంటీ ఆఫ్ ప్రాణా అవుతుంటుంది.
అణువు వంటి ‘నేను’ సంపూర్ణ మానవ రూపంగా తల్లి గర్భంలో పరిణమించేంత వరకు డిపెనె్డంట్‌గానే తన ఇన్డిపెనె్డన్సీని చాటుకుంటుంది. ప్రాణ చైతన్యానికి తోడైన మానస చైతన్య ఫలితమే ఈ స్వతంత్ర పరిణామం. మాతృగర్భం నుండి ఈ స్వ-తంత్ర స్వభావంతోనే శిశు రూపంలో పంచభూత భౌతిక ప్రపంచంలో ఊపిరి తీసుకోవటం.
పంచభూతాల ఆలింగనంతో ప్రాణ, మానస చైతన్యాలు దేహ చైతన్యమైతే, ఆ దేహాన్ని చేరిన ఆత్మది ప్రత్యేక ప్రతిపత్తి అవుతుంది. అప్పటి నుండి దేహ చైతన్య, ఆత్మ చైతన్య సంయోగంగా ‘నేను’ జీవన లాలసలో పడుతుంది. అందుకే, భౌతిక ‘నేను’కు ప్రాణం, మనసులు భూమిక అవుతుంటే అధిభౌతిక ‘నేను’కు ఆత్మశక్తి, విశ్వప్రాణ శక్తులు మూలమవుతున్నాయి.

-విశ్వర్షి 93939 33946