'క్లాప్' కొట్టు గురూ!

వాహ్..దీపికా!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హాలీవుడ్‌లో అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే అక్కడా బిజీ బిజీగానే మారుతోంది. హిందీలో టాప్ హీరోయిన్‌గా అగ్రహీరోల సరసన చిందులేసిన ఈ అమ్మడు క్రేజీతారగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీపిక నటించిన ‘ట్రిఫ్లెక్స్’ చిత్రం ఇప్పటికే విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టుకుంటోంది. ఇప్పుడు మరో హాలీవుడ్ చిత్రంలో కూడా దీపికా నటించబోతోందిట. ఓ చిత్రం విడుదలైన అతి కొద్ది రోజుల్లోనే మరో చిత్రంలో నటించే అవకాశం రావడం నిజంగా విశేషమే. ‘బ్యాంగ్ బ్యాంగ్’ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తన తదుపరి చిత్రానికి ఏర్పాటు చేసుకున్నాడు. చైనా అబ్బాయి.. ఇండియా అమ్మాయి మధ్య ప్రేమకథగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుందట. ‘ఇది ఇండియన్ - చైనీస్ సంస్కృతుల నేపథ్యంగా కథ సాగుతుంది’ అని చెబుతున్నారు దర్శకుడు. ఇందులో హీరోగా చైనా నటుడు డెంగ్ చావో నటిస్తున్నట్లు సమాచారం. కథానాయికగా ముందుగా ప్రియాంకచోప్రాను అనుకున్నారట. కానీ తర్వాత ఆ అవకాశం దీపికానే వరించినట్లు తెలిసింది. బాలీవుడ్డే కాదు.. హాలీవుడ్‌లోనూ బిజీ బిజీగా మారుతుండటం పట్ల ఫీలింగ్ ఎలా వుంది? అని దీపికాను కదిలిస్తే- ‘‘ చాలా హాపీగా వుంది. బాలీవుడ్‌లో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించా. హాలీవుడ్‌లో అడుగు పెట్టాక ఇక్కడా మంచి ఆదరణ లభిస్తోంది. ఇండియన్ తారలంటే ఏంటో నిరూపించాలనుంది. మంచి అవకాశాలు వరిస్తున్నాయి. నటిగా నా వంతుకృషి నేను చేస్తున్నా. తప్పకుండా మరిన్ని హాలీవుడ్ చిత్రాల్లో మెరుస్తా’’అంటూ చెప్పుకొచ్చింది. వాహ్..దీపికా!!

-సమీర్