మంచి మాట

మణికంఠుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనాధ రక్షకుడైన అయ్యప్పస్వామి హరిహరసుతుడు. మణికంఠుడుగా సంతానం లేని పందళరాజుకు లభ్యమయ్యాడు. ఆ శివుడే తనకోసం బిడ్డను ప్రసాదించాడని నమ్మి మెడలో మణిహారంతో పంబా తీరంలోలభించినబిడ్డ కనుక ఈ బాలుడిని మణికంఠునిగా పేరిడి ఆ మహారాజు అల్లారుముద్దుగా బిడ్డడిని పెంచుకోసాగాడు. ఆ దారిలో అగస్త్యమహర్షి కనిపించి ఆ మహారాజును దీవించి మణికంఠుని వల్ల నీ వంశానికే కీర్తి వస్తుందని దీవించి పంపించాడు.
మహారాజురాణి లతో పాటుగా ఆ బాలుని ముద్దుగా ‘అయ్యా - అప్పా’ అని జనులందరూ పిలవసాగారు దాంతో మణికంఠుడే అయ్యప్పగా మారాడు. భక్తులం దరూ అయ్యప్పా అని ఒకసారి పిలవగానే పలుకే మణికంఠుని నామం ఎవరికైనా మధురమే కదా. స్వామియే శరణమయ్యప్ప! అనడం అయ్యప్ప దీక్షాదారులకు అలవాటే. పులిపాల నిమిత్తం వెళ్లిన మణికంఠుడు నానా రభస చేసే మహిషిని సంహరించాడు. ఈ మహిషాసుర సంహారం తరువాత తాను వచ్చిన పని అయపోయందని ఇక నేను వెళ్తాను అనే మణికంఠుని చూచి మహారాజ పరివారంతో పాటు సకల జనులు కనుల నీరు కార్చారు. కాని మణికంఠుడు వారికి అభయం ఇస్తూ తాను ఎప్పుడు ఎవరు తలుచుకున్నా వారికి కనిపిస్తానని, వారి కష్టాలను దూరం చేస్తానని మాటఇచ్చాడు. సంక్రాంతి పర్వదినాన శబరిమల ప్రాంతంలో తాను జ్యోతిస్వరూపుడుగా అందరికీ దర్శనం ఇస్తానని అభయం ఇచ్చాడు.
అలా అభయం ఇచ్చిన తరువాత అయ్యప్ప తను వేసిన బాణము పడినచోట చివరిగా అందరికీ దర్శనమిచ్చి అంతర్థానమయ్యాడు ఆ మణికంఠుడు. అలాదర్శనం ఇచ్చిన చోటే శబరిమల. స్వామి శబరిమల శిఖరం చేరి పట్టబందాసనంలో కూర్చొని, చిన్ముద్ర, అభయహస్తముతో అందరికీ దర్శనమిచ్చి జ్యోతిరూపంలో అంతర్థామైనట్లు శబరిమల స్థల పురాణం చెబుతుంది. తరువాత పరశురాముడు 18 మెట్ల నిర్మాణం కావించి స్వామిని విగ్రహరూపంలో ప్రతిష్టించినట్లు చెప్తారు. బ్రహ్మచారి యైన మణికంఠుని దర్శనం కేవలం మగవారికే. వారు కూడా దీక్షావస్త్రాలను ధరించి నియమ నిష్టలను పాటించి తరువాత శబరిమల చేరి స్వామి దర్శనం చేసుకోవాలి. ఇట్లా స్వామి దర్శనం చేసుకొన్నవారికి ఇహలోక ఇబ్బందులు ఏవీ అంటవు. శనేశ్వరుని బాధలను తాకవు. స్వామిని దర్శించడానికి వెళ్లేవారు బ్రహ్మచర్య వ్రతం చేబట్టి, రెండు పూటలా తలకు చన్నీటి స్నానం చేస్తారు. నేలమీద నిద్రిస్తారు. ఒంటిపూట భోజనంచేస్తారు. తెల్లవారు జామున నాలుగు గంటలకే బ్రహ్మీమహూర్తంలో అయ్యప్ప ఆరాధన చేస్తారు. తిరిగి సాయం సంధ్యవేళ కూడా స్వామి ఆరాధన చేస్తారు. గురుస్వాముల పర్యవేక్షణలో సామూహికారాధనలు చేస్తారు. దీక్షతీసుకున్న వారు వారికున్న దుర్వ్యసనాలనన్నీ విడిచిపెట్తారు. సత్సంగాలకు వెళ్తూ సత్కాలక్షేపంతో ఆధ్యాత్మిక చింతన వారికి అలవడుతుంది. అహంబ్రహ్మస్వి - తత్వమసి సిద్ధాంతం ప్రకారం స్వామి దీక్షచేబడుతారు. తనలోను, ఎదుటివారిలో కూడా అయ్యప్పస్వామినే దర్శించి ప్రతివారిని స్వామి అన్న పేరుతోనే పిలుస్తారు. దీనివల్ల అరిషడ్వర్గాలపై అదుపు దొరుకుతుంది. అహంకారం, గర్వం దూరమవుతాయ. సర్వవ్యాపి అయన భగవంతుణ్ణి అందరిలోను చూసే నేర్పు ఈ దీక్షతో వస్తుంది. చివరకు దీక్షావిరమణకు శబరిమలకు ఇరుముడితో ఆవు నేతిని ముద్రకాయలో నింపి తీసుకువెళ్లి స్వామివారికి అభిషేకించి స్వామికి శరణాగతులౌతారు. ఇలా చేసినవారందరూ స్వామివారి కృపకు పాత్రులవుతారు. ఇహలోక సంపదలన్నీ పొంది అంత్యమందు మోక్షాన్ని పొందుతారు.
.................................

మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి.
మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి.
ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.

- సాయ