భక్తి కథలు

హరివంశం - 43

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్షఋతువు రాకతో సూర్యుడూ చంద్రుడూ కూడా తమ పరువు పోగొట్టుకొని మరుగుపడిపోతున్నారు. మేఘాలు దట్టంగా ఆకసాన్ని ఆక్రమించుకోవటం వల్ల పగలూ రాత్రీ కూడా ఒక విధంగా ఉంటూ వచ్చాయి.
తటిల్లత అనే నర్తకి గొండ్లి నృత్యం చేయటానికి రంగస్థలం మీదికి వచ్చినపుడు ఆమెకు పుష్పాంజలులు సమర్పిస్తున్నట్లు వడగండ్లు కురుస్తున్నాయి. మేఘాలు నభో రంగస్థలంమీద అలంకరించిన తెరలులాగా కనపడుతున్నాయి. కొండ గుహల నుంచి వెలువడే గాలులు గర్జారవంగాను, కొండలపై స్రవిస్తున్న జలధారలు, మదజలంలాగానూ, కొండలు ఏనుగులను అనుకీర్తిస్తున్నాయి.
పుడమి మళ్లీ నవవ్వన శోభిత అరుందా అన్నట్లు పచ్చని పట్టు చీర ధరించి కిసలయ కంచుక శోభిత అయింది. నిరంతర వర్షధారలవల్ల సరోవరాలలో పద్మాలు నశించిపోగా దిగులు చెంది వాపోతున్న తుమ్మెదలకు మేమున్నామని అభయమిస్తున్నట్లు కడిమి చెట్లు మొగ్గ తొడుగుతున్నాయి. అడవి మొల్లలు అరవిరి దరహాస ఆహ్వానాలు అందజేస్తున్నాయి.
మొగలి పొదల పుప్పొడి సుగంధాలు అడవులన్నిటా వ్యాపింపజేస్తున్నాయి. భూమిపైన ధూళులు వానాకాలంవల్ల అణిగిపోయినా నల్దిశలా, ఉప్పరంలోనూ పూల పుప్పొడుల ధూళులు అలముకుంటున్నాయి. అడవులలో అడవి మల్లెలూ, నగర ఉపవనాలలో మొల్లలు కొల్లలు పూసి వియోగ జనాన్ని బాధిస్తున్నాయి ప్రియా వియోగ విరహంతో. పగలూ రేరుూ ఉరుములూ మెరుపులు చెలరేగుతుండడంవల్ల ఎలప్రాయవు భార్యల భయం పోగొడుతున్న నెపంతో మగలు వారి పరి రంభ సుఖాలు పొందుతున్నారు దిన దిన ప్రవర్థమానంగా.
నది ఒడ్డున ఒడ్లు కోసుకొని పోతూండడంతో చెట్లు ప్రవాహాలలో గుడుసుళ్లు తిరుగుతూ కొట్టుకొని పోతున్నాయి. ఏనుగులు గుంపులుగా వచ్చి తమ తొండాలతో నీరు తాగుతుండటంతో, కప్పల బెకబెకల రమ్య రావాలతో, తీరభూముల రెల్లు పొదలు సింగారించుకొని నదీ లక్ష్మీ విలాస సోయగాలతో విలసిల్లుతున్నది.
బలభద్ర సహితుడై అడవులలో గోవులను పాలన చేస్తున్న కృష్ణుడు తాను ధరించిన పట్టు శాటి కాంతులు మెరుపులాగా, ధరించిన నెమలి పింఛపు అందాలు ఇంద్రధనుస్సు కాంతులుగా, తాను పూరిస్తున్న మురళీ రవం మేఘ ధ్వనిలాగా తానే ఒక నీలమేఘమై అడవులలో సంచరిస్తున్నాడు అపుడు. ఆయన అలంకరించుకున్న పననవ పుష్ప మాలికలు గున్న యేనుగు అడవులో సంచరిస్తున్నపుడు పుష్పలతలు అల్లుకున్న చెట్టును గోరాడగా దాని నిండా రాలిన పూల శరీరాన్ని తలపింపజేస్తున్నాయి.
ఈ సమయానికి విదేహ రాజ్యంలో కుంభకుడనే గోగణాధిపతి సిరిసంపదలతో తుల తూగుతున్నాడు. ఆయన అతులతైశ్వర్యశాలి. లెక్క పెట్టలేనన్ని ఆవుల మందలు, అంతులేని ధనధాన్యాలు, పాడి పంటలు ఆయనకున్నాయి. ఆయన దాన ధర్మ నిరతుడు. నిర్మల చరితుడు. చుట్టాల సురభి. ఆయన యశోదకు తోడపుట్టినవాడే. బంధు గణమంత ఆయనను ఎంతగానో అభిమానిస్తారు. ఆయన భార్యపేరు ధర్మద. ఆ పేరుకు అన్ని విధాల తగిన ఇల్లాలామె. ఈ దంపతులకిద్దరు సంతానం. కొడుకు పేరు శ్రీ్ధముడు. కూతురి పేరు నీల. ఈ పిల్లలపట్ల వాళ్ళకు ఇంతా అంతా గారాబమని చెప్పలేము. ఆ అమ్మాయి త్రిలోక సుందరి. పాలకడలిలో పుట్టిన సిరి సౌందర్య శోభాస్పద. ఈ పిల్లలకు పెళ్లి ఈడు వచ్చింది. కుంభకుడికి పిల్ల పెళ్లి త్వరగా చేయాలని అభిలాష రోజురోజుకు ఎక్కువవుతున్నది.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు