భక్తి కథలు

హరివంశం - 50

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తక్కిన గోపకులు తమ ఆట పాటలలో నిమ్నమై ఉండగా వామదేవుడు, భరద్వాజుడు అనే మునిశ్రేష్ఠులు తీర్థయాత్రలు చేస్తూ అక్కడకు వచ్చారు. ఆ వట వృక్షానికి నమస్కరించి ప్రదక్షిణలు చేశారు. సమీపంలో ఆవులను కాస్తున్న గోప బాలకుల దగ్గరకు వెళ్లి ‘నాయనలారా! ఇక్కడ స్నానం చేయటానికి అనువైన రేవు ఏదో మాకు చెప్పండి. సుడిగుండాలు, మొసళ్ళు, ఊబ ఒడ్లు లేకుండా సుఖంగా తీర్థయాత్రా విధులు నిర్వర్తించుకుంటాం మేము’ అని వాళ్ళను అడిగారు.
ఈ ఋషులు గడ్డాలు, మీసాలు, జటాజినాలు, కమండులువల వైఖరి చూసి గోప బాలకులు కొంటెతనంతో, రేవా? అంటే ఏమిటో మాకు తెలీదు, ఇదుగో అక్కడున్నాడే మావాడు, వాడు చెప్పగలడేమో కనుక్కోండి అని అడిగిన వాడల్లా ఆ మునులను ఆటలు పట్టిస్తూ ఉండటం కృష్ణుడు చూశాడు. ఆ గోపబాలకుల అవినయ ప్రవర్తనకు కృష్ణుడు నొచ్చుకున్నాడు మనసులో. వెంటనే ఆ మునుల దగ్గరకు వెళ్లి నమస్కరించి ‘వీళ్ళకు మర్యాద, సత్ప్రవర్తన అంటే ఏమిటో తెలియదు. మహానుభావులారా! నేను మీరు కోరిన రేవు చూపుతాను. అక్కడ మీ తీర్థవిధులు ఆచరించి మళ్లీ ఇటు రండి.
మేము మాతో చిక్కని పాలమీగడల చల్ది అన్నం, బహుపాయసాన్నాలు చిక్కాలలో తెచ్చుకున్నాం. మీరు తప్పక వాటిని ఆరగించాలి. లేదా పొదుగు నుంచి పిండినపుడు ఎంత నునుపెచ్చగా ఉంటాయో ఆ పాలు మా దగ్గర కావలసినన్ని ఉన్నాయి. వాటిని క్రోలుదురుగాని అంటూ ‘నన్ను కృష్ణుడంటారు, ఈయన మా అన్న బలరాముడు. నేను నందగోపుడి కుమారుణ్ణి’ అని మృదు మధుర వినయ వచనాలతో ఆ మునులకు తమ పరిచయం తెలుపుకున్నాడు కృష్ణుడు. ‘ఇక్కడ ఈ ఆలమందలన్నీ మావే’ అని కూడా చెప్పి ‘మా ప్రార్థన అంగీకరించాలి’ అని ఆ రేవు గుర్తులు, దారి, ఆ వివరాలు వారికి చెప్పాడు శ్రీకృష్ణుడు. ఆ మునులప్పుడు ఈ వ్వనల దివ్య తేజో విలాస సౌందర్యం, మృదుమధుర వినయ వాక్సరణి చూసి వీళ్ళు గోప బాలురు కారు అని విస్మయ నిశ్చయం చెందారు. వీళ్ళెవరో తెలుకోవవలెనని క్షణకాలం యోగ సమాధినిష్ణులై వీక్షించారు. అపుడు శ్రీకృష్ణుడు పరాత్పరుడు, పరమేశ్వరుడు, పరంధాముడు, ఆద్యంతరహితుడు, అప్రమేయుడు, లోకావనుడు అని వారు తెలుసుకున్నారు.
తమ యాత్రల ఫలితమంతా వెంటనే ఫలించిందని సంతోషించి శ్రీకృష్ణుణ్ణి స్తోత్రం చేశారు. ‘ఆ బ్రహ్మదేవుడు కూడా నీ మహిమ, నీ సత్వం, నీ కలరూపు గ్రహించనేరడు, తపస్సువల్ల, యజ్ఞంవల్ల, దానంవల్ల కాని నిన్ను దర్శించలేరు ఎవరైనా! ఇపుడు నీవు గోపాలకత్వం ధరించి క్రీడాలోలుడివి అయినావా? మా సాధనలన్నీ నీ దర్శనంవల్ల నెరవేరాయి. సృష్టి స్థితి లీలా లయకారకుడవు నీవే. నీ మాయను ఎవరెవరు తెలుసుకోగలరు?
సూర్య చంద్రులు నీ కనులు. సరస్వతి నీ జిహ్వ. పర్వతాలు నీ దంతాలు. సత్యలోకం నీ ఫాలం. వక్షస్థలం లక్ష్మీదేవి. నీ వామభుజం గణపతి. కుడి భుజం కుమారస్వామి. హస్త శాఖాలు అబ్ధులు. నీ ఉదరం ఆకాశం. దిక్కులు రహోంగాలు. దేవతలు నీ కేశపాశం. పాతాళలోకం నీ పాద తలం. నీవు లోక వంద్యుడవు. విశ్వమూర్తివి. జగత్ప్రకాశుడవు. వేదాలు నీ మూర్తిమంతాలు. యజ్ఞస్వరూపాలు. యజ్ఞకర్తవు. యజ్ఞ ఫలదాయివి కూడా నీవే. నీ అనుగ్రహ పాత్రులైన వారి చేత యజ్ఞాలు చేయిస్తావు. చేసి చూపిస్తావు. చేసే విధం బోధిస్తావు. అనాది నిధనుడవు. ఆద్యంత రహితడువు. నామరూప క్రియా కలాప రహితుడవు. లోకహితుడవు అంటూ స్తుతిస్తున్నారు వారు.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు