మంచి మాట

చిత్తశుద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తశుద్ధి లేని శివపూజలేలరా...అన్నారు మన మహనీయులు.ఆ భగవంతుడు మనకు సర్వం ప్రసాదించాడు. మనం ఏమీ అడగకుండానే అలాంటి భగవంతునికి ఏమిచ్చి రుణం తీర్చకోగలము. మనసా వాచా కర్మణా చిత్తశుద్ధితో భక్తి సుమాంజలులు అర్పించడం తప్ప. పుష్పం, పత్రం, తోయం, అర్చనం, కీర్తనం పలువిధ భక్తి విధానాలతో అర్చిండం చేస్తాము. ఆ భగవంతుని లీలలు అద్భుతం. ప్రతి లీలలో ఏదో అంతరార్ధం దాగి ఉంటుంది.
సర్వ మానవ కల్యాణానికై భగవంతుడు సదా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. అందరికీ అన్నీ ఇస్తాడు, అవి అందుకోవడంలోనే మానవుని నైపుణ్యం దాగి ఉంటుంది. గాలిలో దీపం పెట్టి భగవంతుడా ఆరిపోకుండా చూడు! అంటే అది ఆరిపోకుండా ఉంటుందా? ఉండదుగాక ఉండదు. గాలి వీస్తే చేతులు అడ్డుపెట్టాలి. అపుడే వెలుగుతుంది. ఆ దీపం వెలగడానికి కూడ ఎంతమంది శ్రమ, నైపుణ్యత అవసరం. ఒక ప్రమిద కావాలి, ఒక వత్తి కావాలి, ఒక చమురు కావాలి. అగ్గి కావాలి. ఇవన్నీ ఎక్కడినుండి వస్తాయి. అన్నీ భగవంతుడే ఇస్తాడు. ముందుగా సకల జీవకోటి రాశిని సృష్టించాడు. వాటికి జీవనాధారమైన పంచ భూతాలను సృష్టించాడు. కేవలం ఒక దీపం వెలగడానికి ఇన్ని సృష్టించిన భగవంతునికి హృదయపూర్వక భక్తి సుమాలు అందించి మనకై మన మహర్షులు చెప్పిన కొన్ని విషయ విశేష భక్తి అద్భుతాలను మనం తెలుసుకుందాం.
ముందుగా తీర్ధం. మనం ఆలయానికి స్వామి దర్శనానికై వెళ్లినపుడు పురోహితులు ‘అకాల మృత్యు హరణం, సర్వవ్యాధి నివారణం సమస్త పాప క్షయకరం, శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభమ్’ అనే మంత్రాన్ని చదువుతూ తీర్ధాన్ని ఇస్తుంటారు. రాకూడని కాలంలో మృత్యువుతో సమానమైన బాధ రాకుండా ఉండేందుకై, సమస్త వ్యాధుల నివారణకు, సమస్త పాపాలనుండి బయట పడడానికి పరమేశ్వరుని పాదోదకాన్ని స్వీకరిస్తున్నానని అర్ధం. స్వామికి పంచామృతాలతో చేయించగా వచ్చిన తీర్ధం కాబట్టి... ఓ విధమైన ఔషధ శక్తిని పొందిన నీరు అని పిలువకుండా తీర్ధం అని అన్నారు. ఈ తీర్ధంలో పవిత్ర మంత్ర శక్తి ఉంటుంది. అది మనకు శుభం కలిగిస్తుంది. అదే ఆ భగవంతుని తీర్ధమహిమ.
తర్వాత దేవేరుల ఆసనం. మనం దేవుళ్లను దర్శించుకున్నప్పుడు ఆయా దేవుళ్ల దేవేరులంతా ఎడమ పక్కనే కూర్చుని ఉండడాన్ని చూస్తుంటాం. అందులో అర్ధనారీశ్వర తత్వం ఇమిడి ఉంది. కుడి భాగాన్ని శివుని ప్రతీకగా ఎడమ భాగాన్ని శక్తికి ప్రతీకగా భావిస్తూ ఎడమవైపు దేవేరులను ఉంచుతారు. అందుకే దంపతులు కూడ పెద్దలనుంచి ఆశీర్వచనాలను అందుకునేటప్పుడు శ్రీవారు కుడి పక్కన నిలబడితే శ్రీమతి ఎడమ పక్క నుండి ఆశీర్వచనాలను తీసుకోవడం మనం చూస్తుంటాము. అలాగే వినాయకుని దంతం గురించి కూడా ఒక విశేషం తెలిపారు మన మహనీయులు. మనం వినాయకున్ని దర్శించుకున్నప్పుడు ఆ స్వామికి దంతం విరిగి ఉండడాన్ని చూస్తుంటాం.
ఇందు వెనక ఓ ఉదంతం ఉంది. ఒకసారి అపర శివభక్తుడైన పరశురాముడు శివదర్శనార్ధం కైలాసానికి వస్తాడు. అపుడు ద్వారం వద్దనున్న గణపతి పరశురాముడిని లోపలికి వె ళ్లనీయకుండా అడ్డుకుంటాడు. దాంతో ఆగ్రహోదగ్రుడైన పరశురామునికి వినాయకునికి మధ్య సంకుల సమరం మొదలవుతుంది. వినాయకుడు పరశురాముడిని తన తొండంతో దూరంగా విసిరేస్తాడు. అప్పుడు పరశురామడు ఆవేశంతో తనకు శివుడు ప్రసాదించిన పరశువును(గొడ్డలిని) గజాననునిపై ప్రయోగిస్తాడు. ఆ గొడ్డలి దెబ్బవల్లే వినాయకుని దంతం విరిగిందనేది పురాణ కథనం. ఇలా మన పురాణాలలో ప్రతి కథకు ఒక ఉదంతం ఉంటుంది. దాన్ని మనం అర్ధం చేసుకోవడంలోనే ఉంది..అసలు సిసలు పరమార్ధం. సదా ఆ భగవంతుని సేవలో తరించి ఈ జీవితానికో అర్ధం పరమార్ధం కల్పిద్దాము.

-కురువ శ్రీనివాసులు