మంచి మాట

కర్మబంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్ఞాపకాల ప్రభావం వల్ల పక్షపాతంతో ఉండే ప్రవృత్తి మనకు కొన్ని విషయాలను మంచి రూపంలో, కొన్ని విషయాలను చెడురూపంలో చూపిస్తుంది. అదే మన ‘కర్మ’గా భావించాలి. ‘కర్మ అంటే మన చర్యలు. వాటికి రూపం ఇచ్చేది కూడా మనమే. మన ప్రతి అనుభూతి కూడా ఒక చర్యే.
అంటే స్థూలంగా చూస్తే కర్మ అంటే క్రియ. ఈ క్రియ అనేది నాలుగు విధాలుగా ఉంటుంది. శారీరక, మానసిక, శక్తి, భావనాత్మక క్రియలుగా పరిగణించవచ్చు. శక్తి క్రియ మనకోసం ఎదురుచూడదు. అది ప్రతిక్షణం జరుగుతూనే ఉంటుంది.
మరో దృష్టికోణంలో నుండి చూస్తే కర్మ అనేది మన జ్ఞాపకాల సంకలనం. మన శరీరంలోని ప్రతి కణానికీ కూడా అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉంటుంది. అది లక్షల సంవత్సరాల జ్ఞాపకాలను మోస్తుంటుంది. ఒకవిధంగా మన శరీరం రంగు, ముఖం, రూపం, ఆకారం, ఎత్తు అన్నీ కూడా జ్ఞాపకాల సంకలనం ద్వారానే నిర్ణయించబడతాయి. వాటి ఆధారంగానే అవి జీవితాన్ని నడిపిస్తుంటాయి. ఏనాడైతే మనం తల్లి గర్భం నుంచి బయటికి వచ్చామో! ఆరోజే ఒక సంభావన జన్మించింది. జీవ రూపంలో మనమందరమూ ఒక జంతువులా జన్మిస్తాం. కానీ మనల్ని మనం ఒక సంపూర్ణ మానవుడిగా, దివ్వ సంభావుడిగా మార్చుకునే దిశగా ప్రయత్నించాలి.
అందుకే నిరంతరం సముద్రకెరటాల్లా వచ్చిపోయే జ్ఞాపకాల నుండి విముక్తలం కావాలి. జీవితం ఒకే వలయంలో ఇరుక్కుని ఒకవిధంగా గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. ముందుకు వెళ్లే మార్గం దానికి తెలియదు. జ్ఞాపకాలను వీలైనంతగా వదిలివేయడమే స్వేచ్ఛకు మార్గం సుగమం అవుతుంది. అప్పుడే మన జీవితం సంపూర్ణంగా వికసించగలదు. కొత్త ద్వారాలు తెరచుకోగలవు. కానీ చాలా జ్ఞాపకాలు అంత త్వరగా వదలిపెట్టవు. వాటిని తక్కువగా అంచనా వేయకూడదు. మనసును గాయం చేసిన జ్ఞాపకాలైతే చాలా కాలం తిష్టవేస్తాయి. చేయాల్సిన కర్మలను సక్రమంగా చేయనివ్వవు. మూడు అడుగులు ముందుకు వేస్తే ఏడు అడుగులు వెనక్కి లాగుతాయి.
అందుకు తగిన ఆయుధం ఆధ్యాత్నిక సాధన. సహజ కర్మలను చేయనివ్వకుండా ఆటంకపరిచే జ్ఞాపకాలను నియంత్రించాలంటే భగవంతునిపై మనసుని లగ్నంచేసి ధ్యానం చేయడం గొప్ప ఫలితాన్ని ఇవ్వగలదు. వ్యక్తిత్వం కూడా పెరుగుతుంది.
మనం కొత్త జీవితాన్ని గడపటానికి ప్రజ్ఞ చాలా అవసరం. ఒక రకమైన జీవితాన్ని గడపటానికి జ్ఞాపకాలు సరిపోతాయి. పునరపి జననం, పునరపి మరణం అనే అంతులేని చక్రంలో చిక్కుకోవటం వల్ల పొందే లాభం ఏమిటి? ఏమీ లేదు. వచ్చిన జ్ఞాపకాలే వచ్చి పోతుంటాయి. కాలాన్ని హరిస్తుంటాయి. కాలహరణం అనేది కర్మనాశనానికి మూలం అవుతుంది. అది ముఖ్యంగా ఉత్తమ కర్మలు చేసేందుకు నిరోధకం అవుతుంది.
మంచి కర్మ ఏది? చెడు కర్మ ఏది? అన్న మీమాంసలో నుండి బయటకు రావాలి. భగవంతునికి ఇష్టమైనవన్నీ సత్కర్మలే. సకల జీవుల పట్ల సమాన ప్రేమను పంచగలటమే ఉత్తమ కర్మ. కనీస ఉత్తమ కర్మలను నాలుగింటినైనా జ్ఞాపకాల సంకెళ్ళను తెంచుకుని మరీ ఆచరించగలిగితే ఉత్తమ జన్మలు తప్పక కలుగుతాయి
..............................................
మంచిమాట శీర్షికకు
ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను
సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి.
మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి.
ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.

- పి. వి. రమణకుమార్