మంచి మాట

భీష్మైకాదశి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తండ్రికోసం భీషణ ప్రతిజ్ఞచేసిన వాడు కనుక దేవవ్రతుడ్ని భీష్ముడని అన్నారు. సత్యనిష్టాగరిష్ఠుడు. సత్కర్మాచరణుడాయన. నిష్కల్మషమైన నిబద్ధతతో నిజాయతీ తో కూడిన నడవడి కలిగిన వాడు కనుకనే భీష్ముడు కాలస్వరూపుడినే కట్టడి చేశాడు..
తండ్రి చేతిలో స్వచ్ఛందమరణాన్ని వరంగా పొందాడు. అటువంటి వానిని గుర్తుచేసే రోజే భీష్మైకాదశి. విష్ణువుకు ప్రీతికరమైన తిథి ఏకాదశి అయతే అత్యంత ప్రేమపాత్రుడు ఆయుధాన్ని పట్టనని సారథియైన శ్రీకృష్ణునిలోని భక్తపరా ధీనతను లోకానికి పట్టుపట్టి తెలిపిన ధీశాలి భీష్ముడు.
వశిష్ఠుని వద్ద విద్యనేర్చిన ఉదాత్త స్వభావుడు బుద్ధితో బృహస్పతని పేరు గాంచాడు. పరశురామునిదగ్గరా విద్య నభ్యసించి పరశురాముని అనుగ్ర హాన్ని పొందిన శాంత స్వభావుడు భీష్ముడు.
చిత్రాంగుడు, విచిత్రవీర్యుడు- వీరిద్దరి వలన వంశోభివృద్ధి జరగడంలేదని వాపోయే తల్లి యైన సత్యవతిని ఊరడించి వ్యాసుని ద్వారా కౌరవవంశోన్నతిని కలుగచేయడానికి మార్గోపదేశం చేసినవాడూ భీష్ముడే.
కురుపాండవులు పెద్దవారు అవుతుంటే వారిలో జ్ఞానబీజాలను నాటింపచేశాడు. కాని, కురుపాండవుల మధ్య స్పర్థ పెరిగి రాజ్యార్హతలో శత్రుత్వం ఏర్పడినా కురుపాండవులను సమబుద్ధితో చూచిన మేరుగంభీరవదనుడు భీష్ముడు. అట్లాంటి సత్యస్వభావుడిని పాండవ పక్షపాతి అని దుర్యోధనుడు అసత్యనేరారోపణ చేసినా కిమ్మనకున్నాడు.
నీవు చేతిలో బాణాన్ని పట్టకపోతేనే మేము గెలుస్తాము మాకోదారి చూపుమా అంటూ పాండవులు కన్నీళ్లతో అడిగినా కేవలం శిఖండి వీక్షణంతోనే నా అస్తస్రన్యాసం ...అపుడే మీకు విజయం నాకు వీరమరణం అని నిశ్చింతతో చెప్పిన గొప్ప వీరాధివీరుడు భీష్ముడు.
అటువంటి సత్కళానిధి, ఆదర్శ పురుషుడు, గొప్పకర్మయోగి తన మరణానికి తానే మూహూర్తం నిశ్చయంచుకున్నాడు. కదనరంగంలో అపశయ్య పై పడుకుని స్మరించినంత మాత్రానే కరుణించే అపార దయాంబురాశి యైన మహావిష్ణువు సహస్రనామావళిని ధర్మరాజును నెపంగా పెట్టుకొని అఖిలలోకాలకు అందించాడు. కురుక్షేత్ర మహాయుద్ధంలో అర్జునుడు నిర్మించిన అంపశయ్యపైనే కాలం వెళ్లదీస్తూ ఉత్తరాయణ పుణ్యకాలం సమీపించిన తరువాత మాఘశుద్ధ సప్తమి మొదలుకొని ఒక్కొక్క ప్రాణానే్న వదులుతూ మాఘశుద్ధ ఏకాదశినాటికి మహావిష్ణువులో ఐక్యమైపోయన గాంగేయుని స్మరించుకుంటూ భీష్మ పంచకమని, ఈ ఏకాదశిని ఎవరు పాటిస్తారో, ఎవరైతే భీష్మునికి తర్పణ విధులు ఆచరిస్తారో వారి వంశోన్నతి, సకల సంపదలు ఒనగూరుతాయని మహావిష్ణువు వరాన్ని ప్రసాదించాడు. భీష్ముని ఆదర్శంగా తీసుకొని ఈ తరం యువత కర్తవ్యదీక్షాకంకణ బద్ధులు కావాలి. భారత జాతి ఔన్నత్యాన్ని దశదిశలా విస్తరించడానికి సత్యవ్రతాన్ని ఆచరించాలి. కాలానే్న శాసించే దివ్యగుణోపేతులు అవ్వాలి. భారతదేశ పూర్వవైభవాన్ని ద్విగుణీకృతం చేయాల్సిన బాధ్యత నేటి యువతరం పైన ఉంది. ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చడానికి మన చారిత్రిక పురుషులు, పురాణపురుషులను జ్ఞప్తికి తెచ్చుకుంటూ వారి నుంచిస్ఫూర్తిని ప్రేరణను పొందడానికి మన ఆచరించే పండుగల, పర్వాల వెనుకనున్న అంతరార్థాన్ని నెమరేసుకొనే తరుణమాసన్నమైంది.

- గున్న కృష్ణమూర్తి