భక్తి కథలు

హరివంశం- 62

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహదానందాన్ని అనుభవించారు. తరువాత గిరి ప్రదక్షిణం చేశారు. దారి మధ్యలో కొండకు సాగిలపడ్డారు.
ఆ తరువాత వాళ్ళంతా విందు భోజనలు చేశారు. తమ పశువులకు వివిధాలంకారాలు సంఘటించి మురిసిపోయినారు. శ్రీకృష్ణుణ్ణి తమ ముందుంచుకొని మళ్లీ వ్రేపల్లె చేరారు. గోవర్థనాద్రి మహాపూజ్సోవాన్ని ఆ తరువాత చాలా రోజులు ముచ్చటగా చెప్పుకున్నారు.
ఇక దివోలోకంలో ఇంద్రుడికి తల కొట్టేసినట్లైంది. అభిమానం, అవమానం తోసుకుని వచ్చాయి. పరిభావం మనస్సును దహించసాగింది. సిగ్గు తలపులను చిందర వందర చేసింది. పట్టలేని ఆగ్రహం కలిగింది. సంవర్తకం మొదలుగా తన వశవరులైన మేఘాలను పిలిపించుకున్నాడు.
‘కాలమేఘాల్లారా! వినండి. బృందావనంలో నందగోపుడిలాంటి వెర్రి గొల్లలు చాలా అహంకరించి నన్ను అవమానం పాలు జేశారు. నన్ను తలయెత్తుకోకుండా చేశారు. ప్రతి సంవత్సరం నన్నుద్దేశించి చేయవలసిన ఇంద్రోత్సవం చేయకపోవటమే గాక కృష్ణుడి ప్రోత్సాహంతో పనికిరాని రాళ్ళ గుట్టకు నాకు చేయవలసిన పూజ చేశారు. ఇక ఇంతటితో బతికిపోయినామనుకుంటున్నారు కాబోలు. అయినదేదో అయింది.
వాళ్ళకు బుద్ధి చెప్పుతాను. మళ్లీ ఇటువంటిది చేయకుండా వాళ్ళకు తగిన శాస్తి చేస్తాను. వాళ్ళు ఏ తమ సంపద చూసుకొని మిడిసిపడుతున్నారో ఆ గోసంపదను సర్వనాశనం చేసేట్లు ఏడు రాత్రులూ ఏడు పగళ్ళు తీవ్రమైన శీతగాలులతో ప్రచండమైన వర్షం కురిపించండి. ఒక గొప్ప మేఘాన్ని ఏనుగులాంటిదాన్ని అధిరోహించి నేను కూడా మీ వెనుక వచ్చి మీ ధాటి ఎటువంటిదో చూస్తాను అన్నాడు ఇంద్రుడు.
అప్పుడా కాలమేఘాలు తమ ప్రభువును మెప్పించే పూనికతో వ్రేపల్లెను భీకరమైన వానలతో ముంచి ఎత్తాయి. గోకులం వారు చూస్తుండగానే ఈశాన్యంలో భయంకంరమైన మెరుపులతో ఉరుములతో వర్షామేఘాలు తోచి అవి అన్ని దిక్కులూ ఆక్రమించాయి. జడివానలు కురిశాయి. ఒక్క రోజులోనే పంటలు, పచ్చగడ్డి, చీడపట్టి పాడైపోయినాయి. అకాల వర్షాలకు వ్రేపల్లె జనమంతా తల్లడిల్లిపోయినారు. పెనుగాలులవల్ల కొండలే పెగిల ఆకాశం మీదికి వచ్చాయన్నట్లు కారు మేఘాలు కమ్ముకున్నాయి నాలుగు దిక్కులా.
పాతాళంలో ఉన్న చీకట్లు సూర్యుణ్ణి మింగటానికి ఆకాశాన్ని ఆక్రమించుకోబోతున్నట్లు గాడాంధకారం అన్ని వైపులా కమ్ముకుంది. ప్రచండమైన వాయువులు వీచాయి. వడగండ్లు కురిసాయి. పిడుగులు పడ్డాయి. కల్పాంతం సమీపించిందా అని గోకుల వాసులంతా వ్యాకులం పొందారు. పృథివి అంతా ఏకార్ణవం కాబోతున్నదని భయం ముంచుకొని వచ్చింది జనులలో. ఎక్కడకు పోతాము? మాకు దిక్కేది? ఎట్లా ప్రాణాలు రక్షించుకుంటాము? అని ఆర్తి చెందారు వ్రేపల్లెవాసులు.
ఇంద్రుడికి జరగవలసిన పూజను, చేయవలసిన ఉత్సవాన్ని తన అర్హత ఏ మాత్రం పట్టించుకోకుండా ఈ మిడిమేలపు కొండ తాను స్వీకరించింది అని దురాగ్రహం చూపుతూ ఒక్కుమ్మడి మేఘాలన్నీ ఆ కొండను కనపడకుండా చేశాయి. చుట్టూ చేరి పీడించాయి గోవర్థనాద్రిని. పశువులెన్నో అసువులు బాశాయి.
ప్రవాహాలలో కొట్టుకొనిపోయినాయి కొన్ని. అరణ్య భూములలో చెట్లు అసంఖ్యాకంగా కూలిపోయినాయి. వన పక్షులెన్నో చనిపోయినాయి. గోవులు దీనంగా కన్నీళ్లు కార్చాయి. లేగదూడలను గంగడోళ్ళతో కప్పి అంబారవాలు చేశాయి. చలిగాలులకు గడగడ వణికిపోయినాయి.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు