డైలీ సీరియల్

బంగారుకల- 30

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమలాంబికనే కాదు, రాజ్యాన్ని యావత్తూ ఆ వీరునికిచ్చినా తక్కువే! ఎంతటి ప్రతాపవంతుడు! ప్రచుండులైన వైరి వీరులకు భయంకర చండ మార్తాండుడయ్యడు.
అరివీర హరిణ సముదాయానికి అతడు సింహమయ్యాడు. దుర్భేద్యమైన ఉదయగిరి మాత్రమే కాదు. గోల్కొండ ప్రభువు కందవోలును ముట్టడించినపుడు కూడా అతడు తండ్రి అయిన శ్రీరంగ దేవరాయల ఆజ్ఞతో కందవోలుకు వెళ్లి దానిని శత్రువుల చేతుల్లో పడకుండా కాపాడాడు.
ఆలోచనలోంచి రాయలు తిమ్మరుసుకేసి చూసి ‘‘అతని వంశ చరిత్ర ఏమిటి అప్పాజీ’’ అని అడిగారు.
తిమ్మరుసు ఆ యువకుని వంశ చరిత్రను ఇలా చెప్పారు.
‘‘రాయా! తురుష్కులు దక్షిణ భారతదేశంపైకి దండయాత్రలు విరివిగా చేస్తున్నపుడు విశిష్ట హిందూ సామ్రాజ్యమైన కాకతీయ సామ్రాజ్యం ఛిన్నాభిన్నమైన సంగతి మీకు తెలిసినదే! హిందువులను ఏకీకృతం చేయటానికి చేసిన ప్రయత్నమే మన విజయనగర సామ్రాజ్య స్థాపన.
అలాగే ప్రసిద్ధి పొందిన మరో హిందూ రాజ్యం ఉంది. వారి ముఖ్యపట్టణం కళ్యాణి నగరం. దీనిని అనాదిగా చంద్ర వంశ రాజులు పాలిస్తున్నారు. వీరు అత్యంత పరాక్రమవంతులై పొరుగున వున్న హోయసల రాజ్యానికి, కంపిలి రాజ్యానికి పక్కలో బల్లాలుగా ఉన్నారు.
వీరి మూల పురుషుడు ‘వీరహమ్మాళిరాయడు’. ఇతనికి బొమ్మరాజు అనే మరొక పేరున్నది. ఇతని మనుమడు రాఘవరాజు కంపిలిరాయ సైన్యాన్ని గెల్చి ‘గండరగూళి’ బిరుదు పొందాడు. మహమ్మద్ బీన్ తుగ్లక్ తమ రాజ్యంపై పలుమార్లు దండెత్తినా ఓడించాడు. తుగ్లక్‌ను చెరబట్టి మరీ మరీ వేడుకొనగా వదిలేశాడు. తుగ్లక్ సామంతరాజ్యమైన మాళవ రాజ్యాన్ని ఓడించి ‘మాళవ రాజేంద్ర మస్తకశూల’ బిరుదు పొంది చాళుక్యరాజ్యస్థాపనకు ప్రయత్నించాడు.
తుంగభద్రకు ఉత్తరానగల రాజ్యాన్నంతా జయించి సప్త దుర్గ్ధాపతి అయ్యాడు. రాఘవరాజు మరణించాక పిన్నభూపాలుడు ఆరవీడు రాజధానిగా దేవరాయ మహారాయలకు సామంతుడయ్యాడు. ఇతని కుమారుడు బుక్క్భూపాల చంద్రుడు. చంద్రగిరి ప్రభువైన సాళువ నరసింహరాయలకు పరమ మిత్రుడు. అత్యంత పరాక్రమవంతుడైన ఆరవీటి బుక్కరాజు కుమారుడు రామరాజు. ఇతని కడపటి కుమారుడు శ్రీరంగరాజు. మొదటి కుమారుడైన తిమ్మరాజు నలభై సంవత్సరాలు విజయనగర రాజుల పక్షాన యుద్ధంలో పాల్గొన్న గొప్ప రాజభక్తుడు.
‘‘అతని గురించి మేమొక ఉదంతం విన్నాము’’ ఆసక్తిగా చెప్పారు రాయలు.
‘‘అవును రాయా! ఒకప్పుడు తిరుపతి వేంకటేశ్వరస్వామి ఒక అంధ గోపకుని కరుణించి ఒక కన్ను మాత్రమే ఇచ్చి తిమ్మరాజు కలలో కన్పించి మిగిలిన రెండవ కన్ను ఈయమని ఆజ్ఞాపించాడట! అప్పుడు తిమ్మరాజు ఆ గోపబాలునికి రెండవ కంటిచూపు ఇచ్చాడట. మరోసారి సైన్యంతో మండు వేసవికాలంలో ప్రయాణం చేస్తున్నపుడు సైన్యానికి చాలా దాహం వేసిందట. తిమ్మరాజు ఎంతో భక్తిగా విష్ణువును ప్రార్థించాడట. ఆశ్చర్యంగా ఆ ఎతె్తైన కొండమీద నీటి బుగ్గ పుట్టిందట. అంతా దాహం తీర్చుకోగానే అది మాయమైందట. ఇంతటి వీరుడు, భక్తుడయిన తిమ్మరాజు మహమ్మదీయులతో పోరాడి జయము పొందాడు. కళింగాధీశుడయిన ఒడ్డెరాయని జయించాడు. శ్రీవారి పట్ట్భాషేకోత్సవంతో పాల్గొన్నాడు. శ్రీవారి జైత్రయాత్రలన్నింటిలో పాల్గొన్న ముఖ్యుడు’’ అప్పాజీ వివరించాడు.
‘‘చాలా బాగున్నది అప్పాజీ! అయితే ఈ వీర యువకుడు ఎవరి సంతానం?’’ రాయలు ప్రశ్నించాడు.
‘‘ఆరవీటి బుక్కరాయ వంశంవారు. మొదటినుంచి విజయనగర రాజులకండగా ఉన్నారు. నంద్యాల, కందవోలు, ఆదవని, అవుకు, గుత్తి, గండికోట మొదలైన ప్రాంతాలీ వంశంవారివే! తిమ్మరాయుని చివరి తమ్ముడు శ్రీరంగదేవరాయలు మీకు బహుప్రీతిపాత్రుడని ఎరుగుదును. ఈయనకు కోనరాజు, తిమ్మరాజు, రామరాజు, తిరుమలరాజు, వెంకటపతి రాజు అను ఐదుగురు కుమారులున్నారు. వీరిలో మూడవ కుమారుడయిన రామరాజే మీ వాత్సల్యానికి పాత్రుడయిన అదృష్టవంతుడు. అతనే రామరాయలు’’ తిమ్మరుసు ముగించాడు.
రాయల వదనం సంతోష తరంగితంగా ఉంది. తన కుమార్తెకు నచ్చిన వరుని అనే్వషించే తండ్రికి సరియన గమ్యం దొరికినట్లయింది.
రాయల చిరునవ్వులో తిమ్మరుసుకు కృతనిశ్చయం కనిపించింది. ఆయన సంతుష్టుడై ఆనాటికి సెలవు తీసుకున్నారు.
***
అన్నపూర్ణాదేవి జగన్నాథస్వామికి పూజ ముగించి హారతిని వీరేంద్రుని కందించింది.
‘‘పూజలకేమిగాని అసలు విషయం ఆలోచించావా?’’ నిష్టురం అతని గొంతునిండా వినిపిస్తున్నది.
‘‘ఏమిటది వీరేంద్రా?’’ చిరునవ్వుతో అడిగిందామె.
‘‘జగన్నాథ! నీ కుమారుని గురించి’’
‘‘కుమారుని గురించి ఏముంటుంది. వాడింకా పసివాడు, విద్యలు నేరుస్తున్నాడు’’ తల్లి ప్రేమ తొణికిసలాడుతూ అంది.
‘‘నా బాధ అదేనమ్మా! నువ్విలా పూజలు వ్రతాలు చేసుకుంటూ కూచుంటావు. ఆ తిమ్మరుసు ఏం కుట్రలు పన్నుతాడో అని నా భయం’’.
‘‘అప్పాజీవారలంటివారు కారు వీరేంద్రా! వారి కృషివల్లనే ఈ విజయనగర సామ్రాజ్యలక్ష్మి ఇంతగా కళకళ్లాడుతోంది’’ నమ్మకంగా అంది.
‘‘సైన్యాధికారులు, సైన్యం, రాజ్యంలోని ఈగ, దోమ కూడా తిమ్మరుసు మాట జవదాటదు. జగన్నాథ! దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడమనే నేను చెప్పేది’’ వీరేంద్రుడు వల విసిరాడు.
‘‘మీ మాటలు నాకు రుచించటంలేదు.

- ఇంకా ఉంది

- చిల్లర భవానీదేవి