భక్తి కథలు

హరివంశం- 70

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహుశా బలి చక్రవర్తిని పాతాళానికి అణగద్రొక్కి మళ్లీ ఇంద్రుడికే స్వర్గరాజ్యం కట్టబెట్టిన వాడు కూడా వీడే అయి ఉండాలి. ఇక పరశురాముడు కూడా వీడేనని స్పష్టపడుతూనే ఉంది. గొప్ప యజ్ఞం చేసి కశ్యప మహర్షికి సమస్త భూవలయాన్ని దక్షిణగా ఇచ్చినవాడు కూడా వీడే అయి ఉంటాడు. ఇక దశరధుడికి నలుగురు కుమారుల అంశతో పుట్టి రావణుడి వంటి మహా బలపరాక్రమవంతుణ్ణి వధించింది వీడు కాక మరెవరికైనా సాధ్యమవుతుందా?
ఇన్ని మాయలు పన్నగలవాడు హరి ఒక్కడే. ఎప్పుడూ ఇదే పని వీడికి. ఇక దేవతల ప్రార్థన కూడా తోడైందా! వెంటనే ఉపక్రమిస్తాడు అసుర నాశనానికి. అదొక నెపం మాత్రమే. రాక్షసులు కాస్త పచ్చగా ఉంటే వీడు చూడలేడు. కాస్త వాళ్ళు తల ఎత్తుకొని ఉంటే వాడు భరించలేడు, సహించలేడు. మీరు కూడా లెస్సగా ఆలోచించండి. నేను చెప్పేది నిజమో, కాదో మీకే బోధపడుతుంది. ఇంతేకాదు బలరాముడని అంటున్నారే, వాడు కూడా వీడికి తోడుబోయినవాడే.
కాకపోతే వాడు తెల్లగా ఉంటాడు, వీడు నల్లగా ఉంటాడు. వీడికి బల పరాక్రమాలలో వాడేమీ తీసిపోడు. ఆ బలరాముడు కూడా మన వాళ్ళను ఎందరినో పరిమార్చబోతున్నాడు. వీళ్ళిద్దరిపట్ల మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళిద్దరూ దేవకార్యం కోసం పుట్టారు. ఈ విషయమంతా నారదుడు నాకెప్పుడో చెప్పనే చెప్పాడు. దేవకీ దేవికి అర్థరాత్రి సమయంలో కొడుకు పుట్టగానే, వసుదేవుడు ఆ కొడుకును తీసుకొనిపోయి సరిగా అదే సమయానికి నందగోపుడి ఇల్లాలు యశోద కూడా ప్రసవించింది. ఆమెకు ఆడ శిశువు జన్మించగా, ఆ పిల్ల స్థానంలో వాసుదేవుడు దేవకి కొడుకును ఉంచి, ఆ పిల్లను తీసుకొని వచ్చి దేవకికి ఇవ్వటం, నేను అష్టమ గర్భం ఇదే కదా అని ఆ శిశువును బండకేసి మోది చంపటానికి ప్రయత్నం చేయబోతే ఆ శిశువు నా చేతినుంచి జారిపోయి తప్పించుకొని వింధ్యవాసిని అనే దేవతగా పూజలు పొందటం నాకు తెలియదా? నన్ను ఆ శిశువు హెచ్చరించింది కూడా, నిన్ను పొరిగొనే శిశువు వ్రేపల్లెలో సలక్షణంగా పెరుగుతున్నాడని. ఇంతకూ ఎవరిననుకుంటే ఏం లాభం. తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టినట్లు, నమ్మిన మిత్రుడే వెన్నుపోటు పొడిచినట్లు నారుూ దౌర్భాగ్యానికి, దురదృష్టానికి, నా సర్వ నాశనానికి ఈ వసుదేవుడే మూలకారణం.
ఏమీ ఎరగనట్లు మీ అందరిమధ్యా ఎట్లా నింపాదిగా కూచుని ఉన్నాడో చూడండి! కాకి కనుక తలమీద వ్రాలి ముందుకు వంగి ఉక్కు ముక్కతో రెండు కళ్ళూ పెకలించాలని ప్రయత్నం చేసే విధంగా ఈ వసుదేవుడు నాకు మహోపకారాన్ని తలపెట్టాడు. మరి నాకు దగ్గరి బంధువు. ఇతడినేమి చేయటానికీ నాకు మనసొప్పకుండా వుంది. నా చెల్లెలి పెనిమిటి ఆయె! ఏం చేయగలను? ఎంత చెడ్డవాడైనా చుట్టరికం ఒకటి నా కాళ్ళకు బంధాలు వేస్తున్నది గదా?
నేనితణ్ణి ఎంత మర్యాదగా, మన్నగా చూశాను? ధనధాన్య సంపదలిచ్చి తృప్తిపరచాను. నా పెద్ద మనసునొకనాడైనా గుర్తించాడా? కృతజ్ఞత లేకపోతే లేకపోయె. ఇంత కృతఘ్నత చూపుతాడా? మిత్రదోహం కంటే మహాపాతకం ఇంకొకటి ఉంటుందా? తక్కిన పాపాలన్నిటికీ పరిహారాలుంటాయనీ, ఉన్నాయనీ పెద్దలంటారు కాని, కృతఘు్నడి పాపానికి నిష్కృతి ఉంటుందా? చివరకు భ్రూణహత్య వంటి మహా పాపానికి కూడా నిష్కృతి ఉంటుంది కాని, కృతఘ్నతకు నరకవాసం తప్ప మరేమీ పరిహారం లేదు అంటూ సూటిగా వసుదేవుడి ముఖంలోకి చూస్తూ ‘యదు కులాన్నంతా కంటికి రెప్పలా చూసుకుంటున్నాను నేను.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు