మంచి మాట

శివ దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివమయం జగత్. ఈ విశాల విశ్వంలో శివుడు కానిది ఏదీలేదు. శివశబ్దమే కల్యాణకారకం అని అర్థం. శివుడు సకల జగాలకు పాలకుడు. దిక్కులనే అంబరాలు ధరించినవాడు. జగమంతటికీ ఆకలి తీర్చే అన్నపూర్ణ సాక్షాత్తు ఆయన ధర్మపత్ని అయినప్పటి ఆయన మాత్రం ఆదిభిక్షువుగా పేరుగాంచాడు.
శివుడు భక్తసులభుడు. ‘హర హర మహాదేవ శంభో’అన్నంతనే నేనున్నా నంటూ భక్తులను బ్రోచే భక్తవశంకరుడు. జడమైన జగతికి చైతన్యాన్ని ప్రసాదించే లయకారుడు. మాయానాశకుని ఉదంతాన్ని తెలియచేయడానికే లింగోద్భవం జరిగిందం టారు.
శివ, శక్తి రెండింటికీ ఒకే రూపం. అర్థనారీశ్వర తత్వం ఆకళింపుఅయితే పరమేశ్వరుని చిద్విలాసమే సృష్టి స్థితిలయలని అర్థం అవుతుంది. శివారాధన హైందవ సంస్కృతిలో అంతర్భాగం. జనులహృదయాల్లో ఉండే తమోగుణాన్ని తొలగించే జ్యోతి స్వరూపునిగా పరమేశ్వరుడు జ్యోతిర్లింగాలల్లో కొలువై వున్నాడనేది పురాణ వచనం. వజ్ర లింగం, మరకత లింగం, పద్మరాగ లింగం, స్పటిక లింగం ఇలాంటి లింగాలన్నో ఉన్నా ఆ లింగాలకు చేసే లింగాభిషేకాలు విశేషఫలితాన్నిచ్చివే కాని కలియుగంలో పార్థివ లింగ పూజలు ప్రశస్తమైనవని పురాణాలు ఘోషిస్తున్నాయ.
మానవరూపంలో ఉండి దివ్యత్వాన్ని కలిగిన దేవతలకు మనం సుగంధ భరిత పుష్పాలతో, దీపధూప నైవేద్యాలతో పూజలు చేస్తాం. కానీ నిరాకారుడు, లింగాకారుడు అయిన శివుడిని మారేడు దళాలు, విబూధితో పూజిస్తారు. శరీరంపై వ్యామోహాన్ని పోగొట్టుకోవాలనుకునేందుకు విబూధి సంకేతం. మనలో వికారాలు, వ్యసనాలు, బలహీనతలను సువాసన లేని పూవుల రూపంలో స్వామికి అర్చిస్తే అందుకు ప్రతిగా శంకరుడు మనకు దివ్యత్వాన్ని ప్రసాదిస్తాడంటారు.
శివుడి త్రినేత్రం జ్ఞానానికిసంకేతం. సత్వ రజో తమోగుణాలు త్రిగుణాలు. చేతిలోని త్రిశూలం త్రిగుణాలకు ప్రతీక. త్రిశూలాన్ని ధరించిన శివుడు త్రిగుణాలను నియంత్రణంలోకి తెస్తాడు. ‘శివ’ శబ్దంలో, ‘శం’ అంటే సుఖము, ఆనందమని, ‘ఇ’ కారము పరమ పురుషుడని, ‘వ’కారము-అమృత స్వరూపిణి అయిన శక్తి అంటే అమ్మ అని- శాస్త్రం చెబుతుంది. ఈ ముగ్గురి సమ్మేళనమే అనగా ఆనందమయమైన శివశక్తి సంయోగమే శివ శబ్దార్ధము. దీన్ని గురించితెలుసుకొంటే ఓంకార స్వరూపంలోని తత్వం అర్థంబోధపడుతుంది.
ఓమ్ కార స్వరూపుడు, సత్యశివసుందరుడైన పరమశివుడు మాఘ బహుళ చతుర్థశి అర్థరాత్రి మహాలింగాకృతినొందాడు. స్పర్థతో రగిలిపోయే బ్రహ్మవిష్ణువులను ఆదరించి వారికి జ్ఞానోదయాన్ని కలిగించాడు. దివ్యకల్యాణవిభూషితుడు, సర్వాధిపతి, సర్వశ్రేష్ఠుడు అంటూ ఈశానోపనిషత్తు పరమేశ్వరుణ్ణి కీర్తిస్తోంది. శివుని గురించి చింతనే ఆనందహేతువంటారు. పశులక్షణాలను దూరం చేసుకొంటూ పశుపతిని కొలవడమే నరుని ప్రథమోద్దేశం కావాలన్నదే పెద్దల మాట.
..............................................................................

మంచిమాట శీర్షికకు
ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను
సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు.
రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి.
మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి.
ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.

- చోడిశెట్టి శ్రీనివాసరావు