నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. చనుదెంచి యమ్మహాసపతి జల మపీ క్షించి యచ్చో విశ్రమించి చూచి
తత్కూపమున విలసత్కూలఘనవల్లి యన్నిష్టసఖి నూఁదియున్న దాని
గురుకుచయుగమైపైఁ బరువడిఁ దొరఁగెడు కన్నీరు పూరించుచున్న దానిఁ
దనసమీపమునకు జనుల యాగమనంబు పన్నుగాఁ గోరుచునున్న దాని
క. వరుణదేవుతోడఁ గరమల్గి జలనివా
సంబు విడిచి భూస్థలంబువలని
కరుగుచేరనున్న వరుణేంద్రేవియ
పోని దాని దేవయానిఁ గనియె
భావం: నూతి గట్టు దగ్గరకు వచ్చిన యయాతి మహారాజు నీరుకోరి, అక్కడ విశ్రాంతి గైకొని చూచి, ఆ నూతిలో ఒప్పుతున్న ఒడ్డునందున్న గొప్పలత అనే ఇష్టసఖిని పట్టుకొన్న దానిని పెద్దవైనస్తనయుగ్మంపై క్రమంగా జారు కన్నీటిని నింపుతున్నదానిని తన వద్దకు జనుల రాకను ఒప్పుగా కోరుతున్న దానిని వరుణదేవుడితో మిక్కిలి కోపించి జలమందలి నివాసాన్ని విడిచి భూప్రదేశం దిక్కుకు రానున్న వరుణుడి పట్టమహిషిని పోలిన దానిని దేవయానిని చూచాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము