భక్తి కథలు

హరివంశం - 90

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిక్కులేకుండా రంగస్థల వేదికపై పడి వున్న కంసుడి మృత కళేబరం చుట్టూ చేరి కంసుడి భార్యలంతా దీనంగా విలపించారు. గుండెలు బాదుకున్నారు. తలలు బాదుకున్నారు. కంసుడి విభవాన్ని, పరాక్రమాన్ని, తలచుకొని పనవి పనవి రోదించారు. ఇంద్రుణ్ణి కూడా లెక్కసేయని నీకెంత గతి పట్టింది? అని విలపించారు.
ఇంద్రుడు మాత్సర్యంతో నీ రాజ్యంలో వర్షాలు కురిపించనపుడు మేఘాలను నీ బాణాలతో చీల్చి చెండాడి వర్షధారలు కురిపించిన వీరాధివీరుడవు నీవు. నీకు సకల దేశాధీశులు కప్పాలు చెల్లిస్తూ నీ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండేవారు. సకల సంపదలకు నీవే అధీశుడివి. ఇటువంటి నిన్ను గోపాల బాలకుడొకడు వధించటం, విధి లీల కదా అని ఆక్రోశించారు. నీ తల్లి వృద్ధురాలు, నీ చావు విని, నీ శవం దగ్గరకు వచ్చి ఎంత విలపిస్తుందో కదా! తల్లిని ఇంత దుఃఖానికి పాలుపరుస్తారా?
ఎవరైనా! మహావీరా! మహారాజా అని కంసుడి శవంమీద పడి, మేము దిక్కులేని వారమైపోయినాము అని ఆక్రందనలు చేశారు. అపుడు కంసుడి తల్లి శోకదేవతామూర్త్భీవించినట్లు అక్కడకు చేరింది. కోడళ్ళు ఆమెను పొదవి కొన్నపుడు ఆమె దుఃఖం కట్టలు తెచ్చుకుంది. ఎందుకింత తొందరపడి చావు నీవు తెచ్చుకున్నావు? రాజ్యమూ, ఎందరో భార్యలు, సకల సంపదలు, నీ ఆజ్ఞ తలదాల్చే సకల భూపతులు నీకు చాలలేదా? నీకన్నా వీరుడు లోకంలోనే ఇంకొకరు లేరని పేరు పొందినవాడివి నీవు. ఒక యదువీరుడి కంటి కెంపుకు ఆహాతి అయినావు.
రావణుడితో సమానమైన పరాక్రమం నీది. మరి ఆ రాముడే మళ్లీ వచ్చాడేమో నిన్ను చంపటానికి. లేకపోతే నినె్నవరైనా చంపగలరా? దైవజ్ఞులు చెపుతూ వచ్చిందంతా నిజమైంది. కంసుణ్ణి సంహరించి వృష్ణి వంశస్థుడైన ఒక దివ్య పరాక్రముడు సకల భూవలయాన్ని రక్షిస్తాడు అని భవిష్య విధులు చెప్పిన మాటలు కల్లలెందుకవుతాయి? వాళ్ల జ్యోతిష్యం ఇపుడు ఫలించింది అని కంసుడి తల్లి వాపోతూ ఉండగా, తన భార్య, కోడళ్ళూ నిరవధిక శోకంలో కూరుకొనిపోయినారని తెలిసి ఉగ్రసేనుడక్కడు వచ్చాడు. ఆయనను చూసిన వాళ్ళు మరింత దుఃఖించారు. దైవ విధిని ఎవరు తొలగించగలరు?
కంసుడికి పారలౌక క్రియలు ప్రారంభించాలి కదా ఇపుడు. అంత్యక్రియలు, అపరక్రియలు నెరవేర్చాలి, ఇంకా ఆలస్యమెందుకు? ఇపుడు యాదవ వంశానికంతా ప్రభువు శ్రీకృష్ణుడు. ఆయనను దర్శించి, ఆయన అనుజ్ఞ పొంది ఆ ఏర్పాట్లేవో చేయవలసిందని ఉగ్రసేనుణ్ణి ఆయన రాణి అర్థించింది. రాజ్యం వీరులది. కృష్ణుడు వీరాధివీరుడు. ఆయనే ఇపుడు మన రాజు. కాబట్టి కంసుడి ఊర్థ్వ దైహిక క్రియలకు ఆయన అనుమతి పొంది శాస్త్రోక్తంగా అవి నిర్వహించాలి కదా అని రాణి ఉగ్రసేనుణ్ణి ప్రబోధించింది. సూర్యాస్తమయం అయ్యేలోగా ఈ ఏ ఏర్పాట్లన్నీ చూడాలి అని కంసుడి తల్లి ఉగ్రసేనుణ్ణి కోరింది.
అప్పుడక్కడికి కృష్ణుడు వచ్చాడు. కంసుడి భార్యలు, జనని హృదయ విదారకంగా రోదనలు చేయటం చూసి కృష్ణుడి కళ్ళలో కూడా నీళ్ళు వచ్చాయి. అయ్యో! ఇంతమందికి వైధవ్యం, తల్లికి పుత్ర శోకం నావల్ల కలిగాయి కదా! అని ఆయన కరుణార్ద్ర హృదయుడైనాడు. అక్కడ చేరిన యాదవకుల శ్రేష్ఠులందరితో ‘ఇక వేరే గత్యంతరం లేక నేను కంసుణ్ణి చంపివేశాను.
తండ్రిని క్రూరంగా చెరసాలలో బంధించి రాజ్యాధికారాన్ని దోచుకున్నాడు. పాపాత్ముడిపట్ల జాలి పడటం కూడా పాపమేనంటారు పెద్దలు. కాబట్టి నాకు ఇంతకన్నా వేరే మార్గం లేకపోయింది. వీడు చేసిన పాపాలు ఇన్నీ అన్నీ కావు. లోక కంటకుడైనాడు.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు