మంచి మాట

యోగ వాశిష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ విశ్వంలో ఎన్ని దిక్కులకు ఎంత దూరం ప్రయాణం చేసినా మళ్లీ అనంత దూరం మన ఎదుట ప్రత్యక్షమవుతుంది. కోట్లకి కోట్ల నక్షత్రాలు, గెలాక్సీలు (పాలపుంతలు), కృష్ణబిలాలు, ఇలా తలలు పండిన శాస్తవ్రేత్తలకే తలలు తిరిగేలా చేస్తున్న వాటి నియమాలు. అలాగే భూమి మీద ఎన్నో కోట్ల జీవరాశులు ఇవన్నీ తమ బతుకుబండిని నడపడానికి అహర్నిశలు పాటుపడుతున్నాయి.
మరి నిద్రలోకి వెళ్లినపుడు అక్కడ కలలోకూడా ఇలాంటి ప్రపంచమే. ఇదే ఆకలి, సూర్యుడు, భూమి, నక్షత్రాలు, గ్రహాలు. అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఉండి మనం నడుస్తుంటాం. కలలో కూడా మనుషులు మనతో మాట్లాడుతుంటారు. అక్కడ కూడా ఎంతదూరం ప్రయాణించినా మళ్లీ అనంత దూరం మన ఎదుట ప్రత్యక్షమవుతుంది. మరి కల ప్రపంచం మన మనసులోని భావనల సమాహారం. అయితే ఇల ప్రపంచం కూడా భావనా మాత్రంగా మనకు గోచరిస్తుందా. మరి కలని ఇలని ఎలా అర్ధం చేసుకోవాలి? దీనికి సమాధానం ఏమిటి?
ఇలాంటి అద్భుత ప్రశ్నలు వస్తున్న మనస్సులకోసం మన ఆధ్యాత్మిక శాస్త్రంలో ఎంతో సమాచారం వుంది. శ్రీరాముడు మనకు అవతార పురుషునిగా మాత్రమే తెలుసు. ఆయన జీవిత చరిత్ర అయిన రామాయణంలో మనకి ఒక కోణం మాత్రమే తెలుసు. కానీ రెండవ కోణం రాముడు జ్ఞానిగా మారడానికి వశిష్ట మహర్షి బోధించిన యోగ వాశిష్టంకారణం.ఈ యోగ వాశిష్టానే్న అఖండ రామాయణం అని కూడా పిలుస్తారు. ఇది రామాయణలో ఒక భాగమే అయినా జ్ఞానానికి సంబంధించిన విషయం కాబట్టి రామాయణంకన్నా ఇందులో విషయం చాలా ఎక్కువ వుండడంవల్ల ఇంకొక పుస్తకంగా మనకు లభిస్తుంది.
విశ్వామిత్రుడు తన యాగ రక్షణ కోసం రాముడిని పంపమని దశరధుని వద్దకు వచ్చినపుడు దాదాపు 22 రోజులపాటు జరిగిన వశిష్ట మహర్షి శ్రీరాముని సంవాదమే ఈ యోగవాశిష్టం. అంతకు కొన్ని రోజులముందే శ్రీరాముడు కొన్ని తీర్థస్థలాలు, పుణ్య క్షేత్రాలు తిరిగి రావడం అప్పుడు అతని మనసులో జగత్తు మీద తీవ్ర వైరాగ్యం కలగడం ఆ సమయంలో వశిష్ట మహర్షి దశరథ మహారాజు యొక్క సభలో అందరి సమక్షంలో శ్రీరామునికి వచ్చిన ప్రశ్నల పరంపరకు అద్భుతమైన సమాధానాలు చెప్పడం, తీవ్ర వైరాగ్యం, అభ్యాసం కారణంగా వశిష్ట మహర్షి సమాధానాలతోనే శ్రీరాముడు తన అంతరంగంలో పరమాత్మను తెలుసుకోవడం జరిగింది.
వీరిమధ్య జరిగిన ఈ సంభాషణలలో కలలో కలలు, జగాల జనన మరణాలు, ఏకాత్మ తత్వాలు, సాంప్రదాయాల రహస్యాలు, విచారణా వివేకాలు ఇలా వందల విషయాల గురించి ఇందులో ఉంది. ఈ యోగవాశిష్టం చదివాక ఏ ఆధ్యాత్మిక శాస్తమ్రైనా అర్ధంఅవుతుందని ఇందులో చెప్పడం చూస్తే ఆ సంవాద విశిష్టత అర్ధమవుతుంది. అందుకే పెద్దలు ఇలా అంటారు.
‘‘అశాశ్వత చీకటిలోవైరాగ్య జ్యోతిమనసులో వెలిగిన శ్రీరాముడు
జ్ఞానఫలము వెదకడాజగాలన్నీదర్శించగల ద్రష్టఅయిన వశిష్ట మహర్షి
యోగ వాశిష్టంచెప్పకుండా ఉండగలరా’’
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

మంచిమాట శీర్షికకు
ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి. మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి.
ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.

-ఎ.రాజేష్