భక్తి కథలు

హరివంశం -98

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక్కడకు దగ్గరలోనే కరవీరపురం రాజధానిగా చేసుకొని స్పగాలుడనే దుష్ట రాక్షసుడు అహంకరిస్తున్నాడు. జరాసంధుడు వచ్చాడా అంటే వాడూ, వీడూ ఏకమవుతారు. జరాసంధుడు పెద్ద సైన్యంతో వచ్చినా వాడు హతాశుడై, పరాజయం పాలయ్యే రక్షణ స్థలం మీ వెంట స్వయంగా వచ్చి నేను చూపిస్తాను. దానిని చుట్టు ముట్టినా వాడేమీ చేయలేడు. ఈ ఏర్పాటంతా నేను ముందే ఆలోచించి ఉంచాను. ఇపుడు మనం ఏం చేయాలంటే వేణు నదిని దాటటానికి ఇక్కడే అనువైన రేవు వుంది. ఈ నదిని దాటి కొంత దూరం ముందుకు పోతే చక్రగిరి ప్రాంతం వస్తుంది. అక్కడ క్రూర కర్ములు, మహాచోరులు నివసిస్తూ ఉంటారు. అయినా మనకు వెరపు లేదు. ఒక్క రాత్రి మాత్రం అక్కడ ఉండి ఇంకా ముందుకు ప్రయాణం చేసే ఖడ్గగ అనే నది వస్తుంది. ఆ నదీ తీరంలో మహామునీశ్వరులు నిష్కామంగా తపస్సు చేసే వారెందరో వున్నారు. వాళ్ళను దర్శించి ఇంకా ముందుకు పోతే క్రౌంచపురి అనే నగరం వస్తుంది. కాని ఆ నగరంలో ప్రవేశించకుండా అక్కడి సమీపంలో ఆ నరుహమనే పుణ్యతీర్థంలో ఆ రాత్రి విడిది చేసి తెల్లవారగానే మళ్లీ పయనిస్తే అక్కడకు దగ్గరలోనే గోమంతమనే పర్వతం చేరుకుంటాము. అది మహా పర్వతం. ఏకశృంగ విరాజితం. దానిని అమరులు కూడా అధిరోహించలేరు. మేరు పర్వతం అంత ప్రభావం, ప్రకాశం కలది ఆ పర్వతం. రత్నకాంచన నిలయాలు దాని చరియలు. మధు మథనా! దాని మహా ప్రభావం వాకొన శక్యం కాదు. ఆ శృంగాగ్రానికి పాకుకుంటూపోయి చూస్తే మహాద్భుతాలలో మహాద్భుతం అక్కడ నుంచి దర్శించవచ్చు. చంద్రసూర్యులు, తారల ఉదయాస్తమానాలు కనపడతాయి. మహా సముద్రంలో అంతద్ద్వీపాలు కానవస్తాయి. అక్కడి మహాశైల దుర్గంలో మీరు సుఖంగా ఉండవచ్చు. జరాసంధుడు ఆ దుర్గున్ని ముట్టడించినా, ఆ పర్వతంపైకి సైన్యాలు చేరలేవు. అలసి సొలసి పరాజితుడై పలాయనం చేయక తప్పదు జరాసంధుడికి.
కాని మహాసమరం జరగటం తథ్యం. అప్పుడు మీకు మీ మీ దివ్యాయుధాలు వచ్చి చేరుతాయి. చక్ర, శార్య కౌమోదకి, ఆయుధాలు కృష్ణుడి చేరుకుంటాయి. సౌనందమూ, సంవర్తకమూ హలాయుధమూ, ముసలాయుధమూ అనే పురాణ పురుష ఆయుధాలు బలరాముణ్ణి చేరుకుంటాయి. మీమీ దివ్యావతారాలు మీకు ఆత్మీయమవుతాయి. వైరి భంకరులై మీరు ఉజ్జ్వల రూపాలు ధరిస్తారు. మగధేశ్వరుడి నాయకత్వంలో అనేక మంది రాజులు యాదవులపై దండెత్తి వస్తారని దైవ ప్రేరణ ఈవరకే నిశ్చయమై ఉన్నది. అంతేకాదు భూభారం తగ్గించటానికే కృష్ణుడు అవతరించాడు. భారతయుద్ధం జరగబోతున్నది. ఆ మహాయుద్ధం ప్రవర్తింపజేయవలసినవాడు కృష్ణుడే అని పరశురాముడు భవిష్యద్వృత్తాంతం వాళ్ళకు తెలియజేశాడు. ఆయన మాటలకు బలదేవ, వాసుదేవులు సంతృప్తులైనారు. త్రేతాగ్నులులాగా భావిస్తూ ఆ ముగ్గురూ కొన్ని పూటలు ప్రయాణం చేసి గోమంతం చేరుకున్నారు. ఆ గోమంతం అనే కారణ్య తరులతా శోభితంగా, సెలయేళ్ళతో సుందరంగా, గైరికాదిఅప్పుడు జరాసంధుడు మోకరిల్లినట్లు ముందుకు తూలి నేల మీద కూలి ఊగిసలాడాడు. చేతిలోని గద జారిపోయింది. సజ్యం చేసిన విల్లు చేతినుంచి జారిపోయింది. రథం వైపు చూసే ధైర్యం కూడా లేకపోయింది అతడికి. ప్రాణాలు దక్కించుకోవటానికి అటూ ఇటూ చూసి నక్కి పలాయన మంత్రం పఠించాడు. జరాసంధుడి పాటు చూసి ఆయనకు సహాయం చేయటానికి వచ్చిన రాజులు తత్తరపాటు చెంది పిక్క బలం చూపారు. ఇట్లా యుద్ధ రంగం నాటకం ముగిసిన బోసిపోయిన రంగస్థలం అయిపోయింది.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు