మంచి మాట

సంవత్సరారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయ సమయంలో పాడ్యమి తిథి ఏ రోజు ఉంటుందో ఆ రోజే ఈ ఉగాది పర్వదినం. అందుకని అనాదిగా వస్తున్న ఈ యుగాది రాను రాను ఉగాది పండుగగా మారింది. శాలివాహన చక్రవర్తి (క్రీ.శే.79) ఈ సంవత్సరాదినాడే పట్ట్భాషిక్తుడయ్యాడని చెబుతారు. ఆ కారణంగా ఈ యుగాన్ని శాలివాహన శకంగా పేర్కొన్నారు.
ఉగాది పేరులోనే పచ్చదనం, వసంత చైతన్యం దాగుంది. యుగానికి ఆది కాబట్టి యుగాది. ఈ పండుగ కోలాహలం ప్రకృతిలో అడుగడుగునా కనిపిస్తుంది. కోయిల కుహకుహూ రాగాలతో పక్షుల కిలకిలా రావాలతో ఎటు చూసినా పచ్చదనపు చిగుళ్ళతో, ఎన్నో రకాల పూల సందళ్ళతో ఘుమ ఘుమలతో మధురమైన పళ్ళ రుచులతో సరికొత్త అనుభూతులతో, జీవన చైతన్యంలో ఈ పండుగ మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ రోజే బ్రహ్మ సృష్టికి శ్రీకారం చుట్టాడంటారు. అందుకే ఈ రోజుని చైత్యశుద్ధ పాడ్యమిగా, ఉగాదిగా పండితులు పేర్కొంటారు. కొత్త సంవత్సరానికి, కొత్త మాసానికి, సరికొత్త రోజుకి ఇది సుస్వాగతం పలుకుతుందన్న మాట. తెలుగు మాసాలతో శుభ ఘడియలతో కూడిన హిందువుల ప్రత్యేక కేలండర్‌ని పండితులు రూపొందిస్తారు.
ప్రతి ఉగాదితో ప్రారంభమయ్యే కొత్త వత్సరాలకు ప్రభవ, విభవ వంటి అరవై పేర్లున్నాయి. ప్రభవ నామ సంవత్సరంతో ఆరంభమై అక్షయ నామ సంవత్సరంతో ఒక ఆవృతం పూర్తవుతుంది. అంటే అరవై వసంతాలని అర్థం. ఈ ఉగాదితో దుర్ముఖి నామ సంవత్సరం మొదలైంది.
ఇది మనకు నిజమైన కొత్త సంవత్సరారంభం. ప్రకృతిలో కూడా కొత్త మార్పులు ఈ రోజునుండే మనకు కనబడతాయి. కొత్త చిగుళ్ళు, కొత్త పూత ఇలా అంతా కొత్తదనమే కనుకనే ఈ రోజున మనం ఉగాది పండుగ జరుపుకుంటాం. మన ఆంధ్రులు ఔషధీ విలువలు ఉన్న ఉగాది పచ్చడి అని ఈ పండుగ చాలా పవిత్రంగా జరుపుకుంటారు. సంవత్సరారంభమున పూర్వ తిథితో కూడిన పాడ్యమినే గ్రహించవలెను. చైత్య శుద్ధ పాడ్యమి దినమున ఉపవాస దీక్ష జరిపి బ్రహ్మను పూజించిన వారు సంవత్సరం అంతయు సుఖ సంతోషాలతో విలసిల్లెదరు అని కొన్ని ప్రాచీన గ్రంథాలలో చెప్పబడింది.
ఉగాది పర్వదినాన ప్రతి ఇంటికీ తోరణాలు కట్టాలనీ, ధ్వజారోహణం చేయాలని, వేపాకు తినాలని, పంచాంగ శ్రవణం చేయాలని చెబుతారు. యుగము అనే పదాన్ని కాలానికి కాలమానంగా పరిగణించడమే కాకుండా జంట అనే అర్థంలో కూడా వాడతారు. ఉత్తరాయణం, దక్షిణాయనం అనే రెండు అయనాలతో కూడినది యుగం. ఆ యుగాన్ని ప్రారంభించే రోజు కనుక దీనిని ఉగాది అంటున్నాం.
చైత్రశుద్ధ పాడ్యమి నాటికి ద్వాపర యుగం పూరె్తై కలియుగం ప్రారంభమైందని కృష్ణావతారం ముగిసిన ఆ రోజే భువిలో కలి ప్రవేశించిందని, అందువలన ఉగాదిని ఆ రోజు జరుపుకోవడం ఆచారంగా మారిందని చెపుతారు. శ్రీరాముడు త్రేతాయుగంలో ఉగాదినాడే పట్ట్భాషిక్తుడయ్యాడు. విక్రమార్క, శాలివాహన చక్రవర్తులు తమ రాజ్యాల్ని ఉగాది రోజే స్వీకరించారు. ఇలా ఉగాది పుట్టు పూర్వోత్తరాల వెనుక అన్నీ శుభాలే గోచరిస్తున్నాయి. జీవితంలోని కష్టసుఖాలు, చీకటి వెలుగులను ఒకేలా స్వీకరిస్తూ దృఢ చిత్తంతో ముందుకు సాగాలన్న చిరు సందేశం ఈ పండుగనాడు అందరికీ అందుతుంది. ఆనందకర, బాధాకర పరిస్థితులన్నింటినీ సమానంగా చూసే ధోరణికి మానసికంగా మనం తయారుకావడానికి షడ్రుచులతో కూడిన ఈ ఉగాది పచ్చడి ప్రతీక.
ఉగాది పండుగ రోజున దేవాలయాలలో సాయంత్రం పంచాంగ శ్రవణం ఏర్పాటుచేస్తారు. ఇది వినుటవలన మనకు భవిష్యత్తులో రానున్న పుష్కర, గ్రహణాది విశేషాలు, పండుగలూ జరిగిన కల్పాది తిథులూ తెలుసుకోవచ్చు. ఆ రోజు అధి, నక్షత్ర, ఫలములను రాశి ఫలితాలు, ఆదాయ వ్యయాలు తెలుసుకొని వానికనుగుణంగా నడుచుకొనుటకు వీలవుతుంది.

-ఆళ్ళ నాగేశ్వరరావు