భక్తి కథలు

హరివంశం- 101

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ యుద్ధ వ్యూహాలకన్నిటికీ అగ్రేసరంగా జరాసంధుడు తన సైన్యాన్ని మోహరించాడు. ఏకలవ్యుడనే ఆజరాసంధ సేనాధిపతి నేనొక్కడినే చాలు గోప బాలకుల్ని పట్టి బంధించి పరిమార్చటానికి, ఇంతటి మహాసేన ఎందుకు? అని ప్రగల్భాలాడుతూ జరాసంధుణ్ణి సంతోష పరుస్తున్నాడు. తన ప్రతాపాలు ఏకరువు పెట్టుకుంటూ బాణతూణీర కృపాణాది ప్రయోగ కౌశలం చూపుతానంటూ బీరాలు పలికాడు. అప్పుడు జరాసంధుడు తన సమస్త సేనా విభాగాలను అనువుగా ఏర్పరచుకున్నాడు. కొంచెంసేపు విశ్రమించి తనకు యుద్ధసహాయంగా వచ్చిన రాజులందరినీ పిలిపించి వారి సైనికులు చేయవలసిన పనులు, చూపవలసిన మెళుకువలు బోధించాడు. మనం కొండను ఎగబాకవలసి ఉంటుంది కాబట్టి ఎగుడుదిగుడులు చదును చేయాలి. కొండచరియలు అడ్డువస్తే వాటిని పగులగొట్టి మార్గం ఆటంకం లేకుండా చేయాలి. దట్టంగా ఉన్న చెట్ల కొమ్మలను తెగనరకాలి. కొండమీద నుంచి పగవారు నిలదొక్కుకోకుండా బాణవర్షంతో వాళ్లను రూపుమాపాలి. ఈటెలు విసరాలి. ఒడిసెలవాళ్లను చాతుర్యంగా ఆయా ప్రదేశాలలో నిలిపి శిలలు ప్రయోగింపచేయాలి.
సెలకట్టెలవాళ్ళు కొయ్యతో నిర్మించిన విసురుడు కర్రలు అధిక సంఖ్యలో వాటిని పైకి విసురుతూనే ఉండాలి. ఎవరూ కొండ కొమ్మ మీద కనిపించకుండా! మన గూఢచారులు యాదవులు ఈ నగాన్ని ఆశ్రయించుకున్నారని చెప్పారు కదా! ఇక్కడ మృగాలు, పక్షులు కూడా మనకు శత్రుకోటిలోనివే. అవి కనపడగానే వాటిని చంపివేయాలి అని ఆయా సైనిక దళాలకు ఆయా పనులు ఆజ్ఞాపించాడు జరాసంధుడు. నాలుగువైపుల నుంచి ఏయే రాజులు ఈ పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నం సాధించాలో ఆయా వ్యూహాలు రూపించి చూపుతాను వినండి.
మద్రదేశాధిపతి, కాళింగుడు, చేకితాన బాహ్లికులు, కాశ్మీర రాజైన గోవర్థనుడు (గోనర్దుడు) కారూశ దేశాధిపతి ద్రుముడు. ఇంకా పర్వత ప్రాంతాలవారైన రాజులు ఈ గోమంతక పర్వతపు పడమటి దిశ నుంచే అధిరోహం చేస్తారు.
ఇక పౌండ్రదేశాధిపతి (వేణుధారుడు), విదర్భరాజు శ్రీముడు, భోజరాజు రుక్మి, దానవపతి సూర్యాక్షుడు, పాంచాల రాజు ద్రుపదుడు, అవంతి పరిపాలకుడైన విందానువిందులు, దంతవక్తృడు, పురమిత్రుడు, మాత్స్య దేశాధిపతి విరాటుడు, కౌశాంబి మాళవాధిపతులు, భూరిశ్రవుడు, త్రిగర్త దేశాధిపతి, గ్రథకైశికుడు, పంచజనుడు, ఈ మహాశైలం ఉత్తర దిక్కును ముట్టడించి శైలాధిరోహణం చేస్తారు.
కేరళుడైన ఉలూకుడు, ఏకలవ్యుడు (జరాసంధుడి సేనాధిపతి) బృహక్షత్రుడు, జయద్రధుడు, ఉత్తవౌజుడు, సాళ్వ కేశికులు, విదేశాధిపతి వామదేవుడు, పర్వతం తూర్పుదిక్కున మోహరించి శత్రువుతో యుద్ధం చేస్తారు. ఇక దరుద, తుంది, చేదిరాజులతో కూడుకొని నేను దక్షిణ దిశ నుంచి ముట్టడి చేస్తాను. వీరు, వారు అని పేరు పేరున చెప్పటం ఎందుకు? గదలు, గునపాలు, ముసలాలు పట్టుకొని కొండబండలు చెండాడుతూ, తుమురు చేస్తూ మీ మీ పరాక్రమాలు చూపాలి. మన కొండపైకి పాకటానికి ఎంత తొందరగా బాటలు ఏర్పాటుచేసుకుంటే అంత త్వరగా మన కార్యం సిద్ధిస్తుంది అని చెప్పాడు జరాసంధుడు. అప్పుడు శిశుపాలుడు ఈ పూనిక పట్ల సంశయం ప్రకటిస్తూ ఇట్లా అన్నాడు. ఉన్నతోత్తమైన గండశిలలు, మహావృక్షాలు, తుది మొదలు నిరూపించలేని భయంకరమైన పొదలు, ఎత్తుపల్లాలు, లోయలు, ఏటవాలు ప్రదేశాలున్న ఈ మహాశైలాన్ని అధిరోహించటం సురాసురులకు కూడా దుస్సాధ్యం.

ఇంకా ఉంది