భక్తి కథలు

హరివంశం 103

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్సాహంతో మిన్నందుకున్నారు. ఇంద్రస్త్రం ప్రయోగించి దేవతలు రెక్కలు నిర్మూలించిన కొండలాగా అయిపోయింది గోమంతం. ఒక మహావృక్షం మాడి మోడైనట్లు కన్పించింది. ఈ కొండను పూర్తిగా పెళ్లగించిగాని శమించదేమో ఈ ప్రళయాగ్ని అని దేవతలు తమ తమ ధరాధిపతులతో అర్ధక్రోసు దూరం కొండ దిగువ నుంచి తమ వ్యూహాలను వెనక్కు తీసుకువెళ్ళారు. కొండమీద ఇటువంటి ప్రళయాగ్ని దహనార్పులు విజృంభిస్తుండగా చూసి బలరాముడు తమ్ముడితో ఇట్లా అన్నాడు. మాధవా! చూశావా! మన వల్ల నిరపరాధి అయిన ఈ గోమంతానికి ఎంత ఆపద చుట్టుముట్టిందో. ఎంత చేటు వాటిల్లిందో! ఇటువంటి మహాపద న్యాయమా! ఇట్లా ఉపేక్షిస్తే అంతకన్నా అపకీర్తి ఏముంటుంది మనకు? పరులకోసం స్వీయ దుఃఖాన్ని సహించటం లోకంలో స్తవనీయమైన ఉన్నతోన్నత గుణం.
మనకోసమే కదా ఈ శైలపతి తన కష్టాన్ని ఓర్చుకుంటున్నాడు. ఈయనను ఇంతగాసి పెట్టిన ఆ దుర్మార్గుడు జరాసంధుణ్ణి చంపివేయటమే ఈ గిరిరాజు పట్ల మనం తీర్చుకోవలసిన ఋణం. నీవు చూస్తూ ఉండు. ఇప్పటికిప్పుడు నేను జరాసంధుణ్ణి చంపివేస్తానరు. గొప్ప సేనలతో ఈ పరమ దుష్టుడికి సహాయపడటానికి వచ్చిన ఈ రాజులందరినీ పరిమారిస్తే కాని నా కోపం చల్లారదు అని వెంటనే బలరాముడు కుప్పించి దూకి ఆ రాజుల మధ్యకు వెళ్ళి నిలిచాడు. అన్న ఈ విధంగా ఆ రాజ సమూహం మధ్యకు ఉరికిన మరుక్షణమే తన కిరీట కాంతులు తళ తళలాడుతుండగా, కటిటన పట్టు పుట్టం చలిస్తుండగా, శ్రీవత్స లాంఛనం దివ్యరోచులు వెదజల్లుతుండగా శ్రీకృష్ణుడు కూడా జరాసంధుడి సేనామధ్యమంలోకి దూకాడు. వీళ్ళిద్దరూ ఇట్లా గుప్పించి దూకిన ఉదుటుకు గోమంత పర్వతం భూమిలోకి దిగబడిపోవటంవల్ల ఆ వత్తిడికి ఇలాతలంలోని సలిలాలు భూమిని చీల్చుకొని చాలా ఎత్తుగా పర్వతం చుట్టూ పైకెగసాయి. దీనితో పైకి పాకుతున్న మంటలు చల్లారిపోయినాయి. ఈ విధంగా గోమంతం సంరక్షితమైంది. ఈ విధంగా బలరామ కృష్ణులు జరాసంధుడి అపార సేనా సముద్రం మధ్య ఏక కాలంలో రెండు మందర పర్వతాలు గుభాలున కూలితే ఎంతటి సంక్షోభం కలుగుతుందో అంత పెను సంచలనం కలిగింది.
వాళ్ళుఓ తమ బాహుబాల విజృంభణంతో అరి సైన్యాలను కకావికలం చేయసాగారు. అమర వీరుల ప్రార్థనవల్ల అపుడు వాళ్ళకు తమ దివ్యాయుధాలు వచ్చి చేరాయి. ఈ ఆయుధాలు ఎప్పుడైతే వారు ధరించారో వారి సహజ దివ్య రూపాలు కూడా వారిలో నెలకొన్నాయి. గోవిందుడప్పుడు సుదర్శన చక్రం, శారధనువు, కౌమోదకి గద, నందక ఋపాణం తన అధీనం చేసుకున్నాడు. బలరాముడు సౌనందమనే ముసలాయుధం (రోకలి)సంవర్తకమనే (నాగలి) ఆయుధాలుగా ధరించాడు.
బలరాముడు యుద్ధ్భూమిలో వీరవిహారం చేశాడు. రోకలితో మోది అశేష సేనావాహిని చీకాకుపరచాడు. అనంతుడి అంశావతారం కాబట్టి యుద్ధ్భూమిలో ఆయన సహస్ర ఫణ మండల విరాజితుడైన ఆదిశేషుడిలా వైరి సైన్యాన్ని భయంకర సంభ్రమానికి లోను చేసి చంపివేశాడు. ఈ జంట ఆయుధాలతోనే కాక నిశితమైన బాణాలు తన ధనువు నుంచి ప్రయోగించి సైనిక సమూహాలను అంతమొందించాడు.
హరి తన చతురాయుధాలతో ఘోరమైన పోరు సల్పగా రాజులందరూ కకావికలై భీతిల్లి వెన్నుచూపి యుద్ధ విముఖులైనారు. జరాసంధుడి రక్షణ కోరుకొని ఆయన వెనుక ఒదిగారు.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు