మంచి మాట

శుభవచనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో అనేక జీవరాసులు ఉన్నాయి. ఏ జీవులకు లేని వరం మానవునికి వుంది. అదే మాట. మాట మనిషికి దేవుడిచ్చిన వరం. మిగతా జీవుల నుండి వేరు చేసి మనిషిని ఉన్నత స్థితిలో నిలబెట్టింది మాట.
ప్రతి మనిషికి ఒక స్థాయి ఉంటుంది. ఈ స్థాయి మనిషికి మాటవలన ఏర్పడుతుంది. మనిషి మాట్లాడే మాటలవల్ల స్థాయి వ్యక్తవౌతుంది. వ్యక్తిత్వాన్ని ఏర్పరుస్తుంది.
ఎక్కువగా మాట్లాడితే వాగుడుకాయ లేదా వసపిట్ట అంటారు. తక్కువగా మాట్లాడితే మితభాషి అంటారు. మాట్లడకపోతే ముంగి ముఫాణం లేదా నేలముచ్చు అంటారు. బుద్ధిమంతులు (జ్ఞానులు) మితభాషులు. మూర్ఖులు (అజ్ఞానులు) అమిత ప్రసంగాలు చేస్తారు.
నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు పెద్దలు. పెద్దల మాట సద్దిమూట కదా! మనిషి మనసు మంచిదైనపుడు మంచి మాట వస్తుంది. లేకుంటే కఠిన మాటలే వస్తాయి. మనసు మంచిదైనా మాట కఠినమైనప్పుడు మనుష్యుల మధ్య అంతరాలు పెరుగుతాయి. మనసులు విరిగిపోతాయి. సంబంధాలు బెడిసికొడతాయి. దీనితో మనిషి జీవితం దుర్భరంగా మారుతుంది. ఒంటరితనం ఆవరిస్తుంది. ఏకాకియై మనిషి జీవించాల్సి వస్తుంది. అందుకే మాటల్లో మృధుత్వం ఉండాలి, కాఠిన్యం పనికిరాదు.
కొట్టిన, దెబ్బ తగిలిన శరీరానికి గాయం అవుతుంది. ఈ గాయం కొంతకాలానికి మానిపోతుంది. సూటిపోటి మాటలవలన మనసుకు గాయం అవుతుంది. మనసుకు (గుండెకు) కలిగిన గాయం మాత్రం జీవితాంతం ఉంటుంది. ఇనుము ఇరిగితే కాల్చి అతుకవచ్చు కాని మనసు విరిగితే అతుకుట అసాధ్యమని వేమన చెప్పిన మాటలు అందరికీ తెలిసినవే!
తియ్యని మాటలు ఎన్నో మంచి కార్యాలు సాధిస్తాయి. ఆత్మీయతను పెంచుతాయి. స్నేహాన్ని పెంచుతాయి. సంబంధ బాంధవ్యాలను పెంచుతాయి. మనుషుల ఉత్సాహాన్ని, సంతోషాన్ని అందిస్తాయి. స్ఫూర్తిని కలిగిస్తాయి. సానుభూతి మాటలు బాధగల హృదయాలకు ఆనందాన్ని కల్గించి, బాధను ఉపశమింపజేస్తాయి. అందువలననే ప్రతి ఒకరు ఎల్లప్పుడూ శుభవచనాలే పలికితే శుభాలు కలుగుతాయి.
బంగారు హారాలు ధరించడం, సిగలో పూలు పెట్టుకోవడం, సుగంధ ద్రవ్యాలు పూసుకోవడం, పన్నీటితో స్నానం చేయడం మానవునికి అలంకారాలు కావు. సంస్కారవంతమైన మాట మాత్రమే నిజమైన అలంకారం అవుతుంది. మిగిలిన అలంకారాలన్నీ నాశనమయ్యేవే.
ఎవరు ఎలా మట్లాడితేవారి అనుభవాలను ఎట్లా ఉంటాయని తెలుసుకోవడానికి మనకు ఎన్నో పురాణగాధలున్నాయ. రామాయణంలో వాక్కుకు దీపంలాగా హనుమంతుడు కనిపిస్తాడు. రాముడు ఎపుడూ ఎవరినీ నొప్పించకుండా మాట్లాడు తాడు. కాని లక్ష్మణుడు కోపధారిగా కనిపిస్తాడు. నొప్పించేట్టు మాట్లాడుతాడు అని మనకు తెలుస్తుంది. కాని కోపధారిగా ఉన్నపుడెల్లా అన్యాయాన్ని ఎదుర్కోవాలనే ఉద్దేశంతో కోపాన్ని ధరించాడు కాని మరే ఇతర విషయమూ కాదు అని తేటతెల్లమవుతుంది.అంటే మనిషికి ధర్మాగ్రహం ఉండాలన్నమాట. అదిలేకపోతే మనం ఉన్నచోటును, మన కన్నతల్లిని ఎవరో ఏదో అంటే అహింసావాదం అంటే అక్కడ అంతగా పనికిరాదు. కనుక కోపంతో నైనా అన్యాయం చేసినవారికి మనమాట వింటేనే హడలు పుట్టాలి. వారి మాట వినాల్సివస్తుంది కనుక అన్యాయమే చేయకూడదు అన్న తలంపు వారిలో కలుగాలి. ఇది కోపం ద్వారా మనం అన్యాయపరులను నిగ్రహించవచ్చు. ఇక్కడ కోపమనేది ధర్మాధర్మవిచక్షణకు పనికిరావాలి. దీనివల్ల కేవలం మాట నే కాక మనసును కూడా తెలుసుకోవాలనేది లక్ష్మణునుంచి కూడా తెలుసుకోవాలి. ఇట్లా ఎన్నో విషయాలను మనం పురాణాల ద్వారా మనం తెలుసుకోవచ్చు.

-జాధవ్ పుండలిక్ రావు