భక్తి కథలు

హరివంశం - 128

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నన్ను రక్షించటానికే నా నాథుడు వచ్చాడనుకున్నదామె. ఎనె్నన్నో కలలు సృష్టించుకుంది. కలతలు ఉపశమింపచేసుకుంది. శ్రీకృష్ణుడు నన్ను ప్రేమగా చూస్తే నేనెంత ఆనంద ధన్య పారవశ్యం అనుభవిస్తానో కదా అనుకుంది. మధురంగా, మృదువుగా, అనురాగంతో ఆయనతో మాటలు కలిపినపుడు ఎంత పులకించి పోతానో కదా అని మురిసిపోయింది.
శ్రీకృష్ణుడికి పరిచర్యలు చేస్తున్నప్పుడు నేను ఆయన శిష్యురాలవుతాను కదా అని ఆనందోద్విగ్న హృదయ అయింది. మా ఇద్దరికీ అభేద యోగ సిద్ధి సంప్రాప్తించినపుడు ఎంత చొక్కిపోతానోఅని భావించింది. నా ప్రియం, నా భక్తి, నా తలపు, నా వలపు అన్నీ ఆ మధురమూర్తికే మీదు కట్టి ఉంచాను కదా అని పరవశించింది. కృష్ణుడు చేయి పట్టుకొని నన్ను దగ్గరకు తీసుకుంటే అఖిల జగములు ఏలుకొనే మహారాణి పదవి కదా నాది అని గర్వించింది. చెలికత్తెలతో కృష్ణ ప్రసంగాలే చేసింది.
రుక్మిణి మనఃస్థితి ఇట్లా ఉండగా విడిదిలో కృష్ణుడు కూడా ఆమెను గూర్చే ధ్యానించసాగాడు. రుక్మిణి నాకెప్పుడు కనపడుతుంది. ఆ దివ్య సుందరిని ఎప్పుడు చూస్తాను, ఎట్లా చూస్తాను, శత్రువులతో నాకు యుద్ధం ఎట్లా ఎప్పుడు సంఘటిస్తుంది?
నేను తనను చూసిన క్షణానే, తాను నన్ను బేల కళ్ళతో చూస్తుంది కాబోలు. అప్పుడు సురాసురులెవ్వరు అడ్డు వచ్చినా వెంటనే ఆమె పాణిగ్రహణం చేస్తాను. ఆ తరళ నయనాలు నన్ను చూసి ఎట్లా మెరసిపోతాయో! ఆమె కపోలాలు నా స్పర్శతో సిగ్గులతో ఎంతగా ఎర్రబడతాయో! నా పిలుపులు, నా వలపులు ఆమెను ఎంత పులకరింపజేస్తాయో!
ఆమె కనుల క్రేవలు ఎంత విముగ్థములవుతాయో?! ఆమెతో నాకు ప్రాప్తించే అభేద యోగ సిద్ధి ఎటువంటిదో! అని ఆ రాత్రి అంతా ఉద్వేగ మనస్కతతో కృష్ణుడు వేగిరించాడు. ఆయన ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉదయం, హృదయానంద సంధానకారియై ఇంతలో పొడసూపింది. ఉద్యానవనాలలో పక్షుల కలకలరావాలు, విహగ కూజితాలు వినవచ్చాయి. తుమ్మెదలు పిండుకట్టి పద్మ సరోవరాలతో పాటలు పాడాయి. జక్కవ పిట్టలు వియోగ బాధా పరితప్తతతో రుతించాయి.
తూర్పు దిక్కు అరుణ రాగరంజితమైంది. సూర్యుడు తన సింహాసనం అధిష్టించాడు. లోకాలన్నీ చీకట్లు పారద్రోలినందుకు ఆ కర్మ సాక్షికి తమ కృతజ్ఞతలు ప్రకటించాయి. శ్రీకృష్ణుడు ఉత్సాహంతో, చక్కగా సింగారించుకొని తన రథంమీద పుర పరిసర ప్రాంతాలకు వచ్చాడు. నగరమంతా పరమ రమణీయంగా అలంకృతమై ఉంది.
రుక్మిణీదేవిని చెలులు మోహన మంత్రదేవతలాగా అలంకరించారు. బంగారు పల్లకి ఎక్కించారు. సర్వమంగళాధి దేవతయైన సర్వమంగళ (గౌరి)కి మొక్కించటానికి దేవాలయానికి తీసుకొని వచ్చారు. ఆ ఒప్పుల కుప్ప ముప్పిరిగొన్న భక్తిప్రపత్తులతో, రాగలజ్జావిలాసాలు పైకొనగా అమ్మవారికి ఆత్మార్పణం చేసుకున్నది తనను రక్షించవలసిందని. కూరిమితో పూజలు సమర్పించింది.
దేవాలయం నుంచి తడబడే అడుగులతో తత్తరపాటు చూపులతో రుక్మిణి పూజ ముగించుకొని రథ్యలోకి రావటం చూశాడు కృష్ణుడు. ఆయన సమ్మోహపరవశుడైనాడు. నన్నీ బాల వలుచుకొన్నది, గెలుచుకున్నది అనుకున్నాడు. ఇదిరా మంచి సమయం అని ఉత్సహించాడు. నాకు దైవానుకూల్యం ఈ వరకే సమకూడింది. ఇప్పుడు పౌరుషం చూపుతాను అని రాగ వివశాత్మకుడైనాడు.

-- ఇంకా ఉంది

-అక్కిరాజు రమాపతిరావు