భక్తి కథలు

హరివంశం -140

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లెక్కలేనంతమంది బ్రాహ్మణులను చంపివేశాడు. తపస్వులనూ పెట్టిన బాధలు ఇన్నీ అన్నీ కావు. వివిధోపాయాలు పన్ని క్షత్రియులను నురుమాడాడు. ప్రజలను ఘోష పెట్టాడు. తన ముఖ్య కర్తవ్యం ఏమిటంటే ధర్మ వినాశనమే అన్నట్లు ప్రవర్తించాడు.
ఇక ఒక రోజున బదరికావనంలో ఋషులు, తపస్వులు యజ్ఞయాగాదులు, తపస్సులు చేస్తుంటారు కాబట్టి ఆ ప్రాంతంమీద దండు వెడలాడు. ఊర్వశి విధించిన నిబంధన నరకుణ్ణి తహతహలాడించింది. నిలవలేకపోయినాడు. ఉద్వేగం చెందాడు. బదరికావనంలో ఋషులను సమీపించి ఈ హోమాలు ఈ యజ్ఞక్రియలు ఎందుకు చేస్తున్నారు? ఎవరికోసం చేస్తున్నారు? అని అడిగాడు. వాళ్ళు ‘ఇంద్రుడు, వేదాలు మాకు పూజ్యులు’ అని చెప్పారు.
నరకుడికి చాలా కోపం వచ్చింది. అదంతా జరిగిపోయినమాట. ఇంద్ర వరుణ యమ కుబేరులు ననే్నమీ చేయలేకపోయినారు. పలాయతులైనారు. ఇపుడు త్రైలోక్య సామాజ్యాధిపతిని నేనే. కాబట్టి ఆ చేసేవేవో నన్నుద్దేశించి చేయండి అని వాళ్ళను నిర్బంధించాడు. అట్లా మేము చేయలేము అని నిరాకరించారు ముని వర్గం. అందుకు కోపించి యజ్ఞశాలలను కాల్చివేశాడు.
అక్కడ చేరి యజ్ఞ నిర్వహణ చేసే హాత, అధ్వరుడు, ఉద్గాత, యజమానులను ఎక్కడ కనపడితే అక్కడ చంపివేశాడు. తాపసుల ఇల్లాండ్రను అవమానపరచాడు. ఋషికన్యలను చెరపట్టాడు. వీళ్ళకు సరి అయిన శాస్తి చేశాను అని విర్రవీగుతూ ప్రాగ్జ్యోతిషం వెళ్లిపోయినాడు. నరకుడి ఈ క్రూర ఔద్ధత్వానికి, హింసాప్రవర్తనకు గురి అయిన వారిలో వశిష్ఠుడు, వామదేవుడు, కపిలుడు, కశ్యపుడు, కణ్వుడు, జాబాలి, ధౌమ్యుడు, భరద్వాజుడు ఉన్నారు. వీళ్ళనే నరకుడు ఏ మాత్రం సరకు చేయలేదంటే ఎంత క్రూర హింసాపరుడైనాడో భావించవచ్చు. తమ క్రియా కలాపాలాను భంగపుచ్చటం, పరిభవించటమే కాక, స్ర్తిలను బాధించటం, చెరచటం చూసి వాళ్ళు తల్లడిల్లారు.
జగద్రక్షకుడైన హరి అవతారమెత్తి లోకాన్ని రక్షిస్తున్నాడనుకొంటున్న ఈ కాలంలోనే ఇటువంటి ఘోర పాపాలకు పూనుకున్నాడీ నరకుడు. ఇక మనకు కంస మర్తనుడు కాక దిక్కెవ్వరున్నారు? అని వాళ్ళంతా ద్వారకకు ప్రయాణమైపోయినారు. వృద్ధపురస్సరంగా సమూలంగా వారు కాలి నడకనే బయలుదేరారు. మధ్యలో అనేక పుణ్య నదులలో స్నానాలు చేస్తూ భగీరథిని చేరి అక్కడ ప్రాయశ్చిత్త కర్మలు నిర్వహించుకున్నారు.
ఇట్లా కొన్ని రోజులు ప్రయాణం చేసి ఈ మునిగణం ద్వారవతిని చేరుకున్నది. ఆ దివ్య నగరం చూడగానే వాళ్ళు ఎంతో ఆశావహులైనారు. గత ఖేదులైనారు. రాజమార్గంలో నెమ్మదిగా కోట వాకిలి దగ్గరకు చేరి అక్కడి ప్రతీహారులతో ‘బదరి నుంచి మునులు మిమ్ములను చూడకోరి వచ్చారని కమలలోచనుడికి విన్నవించవలసిందిగా’ ఆ ద్వార పాలకులకు చెప్పాడు. అప్పుడు కృష్ణుడు సంభ్రమంతో ప్రద్యుమ్నుడిని పిలిపించి ఆ మహర్షులను ఆదర గౌరవ భక్తిశ్రద్ధా పురస్కారంగా తన దగ్గరకు తీసుకొని రావలసిందిగా అతడిని నియోగించాడు. ప్రద్యుమ్నుడు ఆ మహా మునీశ్వరులకు ఎదురుగా వెళ్లి వినయ సంభ్రమ భక్తిశ్రద్ధలతో పద్మనాభుడి సమక్షానికి తీసుకొని వచ్చాడు. సుధర్మ సభా నిలయంలో మనోజ్ఞ దివ్య ఆసనంపై కూచుని ఉన్న శ్రీకృష్ణుడు ఈ దివ్య ఋషులను చూడగానే దిగ్గున లేచి వాళ్ళకు ప్రత్యుత్థానం చేశాడు. పేరు పేరున వాళ్ళకు నమస్కరించి క్షేమ సమాచారాలు కనుక్కున్నాడు.

ఇంకాఉంది

అక్కిరాజు రమాపతిరావు